
టాలీవుడ్ ని ఏలే స్థాయికి ఎదిగిన నిర్మాతలలో ఒకరు దిల్ రాజు..నైజాం ప్రాంతం లో ఒక డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ని ప్రారంభించిన దిల్ రాజు ఆ తర్వాత దిల్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి నిర్మాతగా పరిచయం అయ్యాడు..వీవీ వినాయక్ దర్శకత్వం లో నితిన్ హీరో గా తెరకెక్కిన ఈ చిత్రం ఆరోజుల్లో పెద్ద సెన్సేషన్ సృష్టించింది..అప్పటి నుండి రాజు గారికి దిల్ అనే పేరు శాశ్వత స్క్రీన్ నేమ్ గా మారిపోయింది..టాలీవుడ్ లో కుర్ర హీరోల దగ్గర నుండి స్టార్ హీరోల వరుకు ప్రతి ఒక్కరితో బ్లాక్ బస్టర్స్ తీసిన ఘనత దిల్ రాజు గారిది..ఆయన కెరీర్ లో అట్టర్ ఫ్లాప్ సాధించిన సినిమాలను చేతి వేళ్ళతో లెక్కపెట్టొచ్చు..అలాంటి ట్రాక్ రికార్డు దిల్ రాజు సొంతం..ఒక సినిమా సక్సెస్ అవుతుందా లేదా..సక్సెస్ అయితే ఎంత వసూళ్లను రాబడుతుంది..ఎంత లాభాలు వస్తాయి అనేది ఆయన స్టోరీ విన్నప్పుడే అంచనా వెయ్యగలడు.
అందుకే దిల్ రాజు మార్కెట్ లో ఒక బ్రాండ్ గా మారిపోయాడు..నిర్మాతగా ఒక పక్క సినిమాలను నిర్మిస్తూనే, తనకి మూలకారణమైన డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ని మాత్రం ఆయన వదలలేదు..ఇప్పటికి ఆయన నైజం , ఉత్తరాంధ్ర మరియు కృష్ణా జిల్లాలలో డిస్ట్రిబ్యూషన్ చేస్తూనే ఉన్నాడు..దిల్ రాజు ఒక సినిమా కొన్నాడు అంటే కచ్చితంగా అది బాగానే ఉంది ఉంటుంది అనే నమ్మకం ప్రతి ఒక్కరిలో కలుగుతుంది..అది స్టార్ హీరో సినిమా అయినా సరే, చిన్న హీరో సినిమా అయినా సరే..లేదా డబ్బింగ్ సినిమా అయినా సరే..లేటెస్ట్ గా ఆయన తమిళం లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా లవ్ టుడే అనే సినిమాని తెలుగు లో దబ్ చేసి విడుదల చేసాడు..కేవలం రెండు కోట్ల రూపాయలకే ఆయన ఈ సినిమాని కొనుగోలు చేసి 8 కోట్ల రూపాయిల లాభాల్ని ఆర్జించాడు..ఇక ఈ సినిమా హీరో హీరోయిన్లు గా నటించిన ప్రదీప్ రంగనాథం మరియు ఇవానా కి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది.
ముఖ్యంగా హీరోయిన్ ఇవానా కి యూత్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది..ఇది దిల్ రాజు బాగా గమనించాడు..అప్పటి నుండి ఆమెని తన ఆస్థాన హీరోయిన్ గా పెట్టుకునేందుకు తెగ ట్రై చేస్తున్నాడట..తన బ్యానర్ లో వరుసగా సినిమాలు చెయ్యాలని..మొదటి సినిమాకి కోటి రూపాయిల పారితోషికం ని దిల్ రాజు ఆఫర్ చేసినట్టు సమాచారం..ఇవానా కూడా వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తుంది..తమిళం లో చిన్న చిన్న క్యారెక్టర్స్ ద్వారా పాపులర్ అయినా ఇవానా కేవలం ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది..టాలెంట్ కి తోడు అదృష్టం కలిసి వస్తే జాతకం మారిపోతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ..భవిష్యత్తులో ఈమె సమంత , నయనతార రేంజ్ హీరోయిన్ అవుతుందా..లేదా కొంతమంది హీరోయిన్స్ లాగ తారాజువ్వలా పైకి లేచి వెంటనే క్రింద పడిపోతుందా అనేది చూడాలి..ఆమె కెరీర్ ఎలా సాగబోతోంది అనేది ఆమె ఎంచుకునే కథలని బట్టే ఉంటుంది.