
టాలీవుడ్ లో ప్రస్తుతం క్రేజ్ పరంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా ఎవ్వరూ అందుకోలేని రేంజ్ లో ఉన్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..అందుకు ఉదాహరణే రీసెంట్ రీ రిలీజ్ అయినా ఖుషి చిత్రం..22 ఏళ్ళ క్రితం పవన్ కళ్యాణ్ కెరీర్ లో మైలు రాయిగా నిలిచిపోయిన ఈ చిత్రాన్ని నిర్మాత AM రత్నం నేటి తరం యువతకి అందించేందుకు సరికొత్త 4K క్వాలిటీ కి మార్చి డిసెంబర్ 31 వ తారీఖున రీ రిలీజ్ చేసారు..రెస్పాన్స్ ఫ్యాన్స్ కూడా ఊహించని రేంజ్ లో వచ్చింది..మొదటి రోజే ఏకంగా నాలుగు కోట్ల 20 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసి సంచలనం సృష్టించిన ఈ సినిమా కేవలం వారం రోజుల్లోనే 7 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను సాధించి ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డు ని నెలకొల్పింది.
ఈ రికార్డు ని మేము బద్దలు కొడుతాము అంటూ వచ్చారు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్..ఆయన హీరో గా నటించిన ఆల్ టైం క్లాసిక్ బ్లాక్ బస్టర్ ‘ఒక్కడు’ చిత్రాన్ని రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేసారు..వీళ్ళు ఇచ్చిన బిల్డప్ చూసి నిజంగానే ఖుషి రికార్డ్స్ ని బద్దలు కొడుతారేమో అని అందరూ అనుకున్నారు..కానీ కథ పూర్తి గా అడ్డం తిరిగింది..ఈ చిత్రం ఖుషి సాధించిన కలెక్షన్స్ లో పావు శాతం కూడా సాధించలేకపోవడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరిచింది..ఉదాహరణకి హైదరాబాద్ లో ఈ సినిమాకి 400 కి పైగా షోస్ వెయ్యగా, కేవలం 15 షోస్ మాత్రమే హౌస్ ఫుల్ అయ్యాయి..ఇక కృష్ణ , గుంటూరు , వైజాగ్ వంటి మూడు పెద్ద ప్రాంతాలను కలిపితే ఈ సినిమాకి వచ్చింది కేవలం మూడు హౌస్ ఫుల్స్ మాత్రమే.
మొత్తం మీద ఈ సినిమాకి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలను కలుపుకొని కేవలం కోటి 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి..ఇది ఖుషి చిత్రానికి రెండవ రోజు వచ్చిన వసూళ్లతో సమానం..ఖుషి రికార్డ్స్ ని బద్దలు కొడుతాం..మొదటి రోజు రికార్డుని కూడా బ్రేక్ చేస్తాం అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో సవాలు విసిరినా మహేష్ ఫ్యాన్స్..ఇప్పుడు రెండవ రోజు తో సరిసమానం కూడా కానీ కలెక్షన్స్ ని సాధించి నవ్వుపాలయ్యారు..సోషల్ మీడియా మొత్తం ఎక్కడ చూసిన ఒక్కడు కలెక్షన్స్ గురించే ట్రోలింగ్స్ జరుగుతున్నాయి.