
బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి గ్రూపులు మరియు ఫ్రెండ్ షిప్ లు అని మైంటైన్ చెయ్యకుండా సొంతం గా గేమ్ ఆడుతూ మగవాళ్ళతో సైతం పోటీపడిన కంటెస్టెంట్ ఇనాయ సుల్తానా..హౌస్ లోకి అడుగుపెట్టినప్పుడు ఈమె ఎవరో ఎవరికీ తెలియదు..అందువల్ల మొదటి వారం నామినేషన్స్ లోకి వచ్చినప్పుడు అందరికంటే తక్కువ ఓట్లు వచ్చాయి..ఆమె అదృష్టం కొద్దీ మొదటి వారం ఎలిమినేషన్ ని తొలగించడం సేఫ్ అయ్యింది..వచ్చిన ఆ అద్భుతమైన అవకాశం ని సద్వినియోగ పర్చుకుంటూ తన ఆట తీరుని పూర్తిగా మార్చుకొని 15 వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగింది..ఆమె ఎలిమినేషన్ అయితే న్యాయం గా జరుగలేదు..ఎందుకంటే ఆమె టాప్ 2 స్థానాల్లో ఒకరిగా నిలబడిన కంటెస్టెంట్..పడిన ఓట్లు ఆధారంగా చూస్తే అది అందరికి అర్థం అవుతుంది..కానీ బిగ్ బాస్ తనకి ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించి హౌస్ లో బాగా ఆడేవాళ్ళందరిని పంపేస్తున్నాడని..అలాగే ఇనాయ ని కూడా పంపేసాడని సోషల్ మీడియా లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది.
విన్నర్ అవుతుంది అనుకున్న ఇనాయ కనీసం టాప్ 5 లోకి కూడా అడుగుపెట్టలేకపోవడం ఆమె దురదృష్టం అనే చెప్పాలి..కానీ ఈ రియాలిటీ షో ద్వారా ఆమెకి వచ్చిన ఫేమ్ మామూలుది కాదు..హౌస్ లోకి అడుగుపెట్టకముందు ఆమె ఎవరో ఎవరికీ తెలియదు..ఇప్పుడు ఆమెకి సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు రప్పించుకునే రేంజ్ కి పాపులారిటీ ని సంపాదించుకుంది..హౌస్ నుండి బయటకి అడుగుపెట్టగానే ఆమెకి ఒక బంపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది..పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే చిత్రం తెరకెక్కబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ప్రారంభం అయ్యింది..ఈ సినిమాలో ఇనాయ కి ఒక చిన్న క్యారక్టర్ ఆఫర్ చేసాడట డైరెక్టర్ హరీష్ శంకర్..పవన్ కళ్యాణ్ సినిమాలో ఆఫర్ రావడం అంటే మాములు విషయం కాదు..హిట్టయితే రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవచ్చు..ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా ని ఊపేస్తోంది.
బిగ్ బాస్ సీజన్ 4 లో కూడా పాల్గొన్న కొంతమంది కంటెస్టెంట్స్ కి సినిమాల్లో అవకాశాలు బాగానే వచ్చాయి..వారిలో మనం ముందుగా చెప్పుకోవాల్సింది దివి గురించి..ఈమె ఇప్పుడు వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది..లేటెస్ట్ గా ఆమె మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించే ఛాన్స్ కొట్టేసింది..ఆ తర్వాత గంగవ్వ కి కూడా సినిమాల్లో మంచి రోల్స్ వస్తున్నాయి..బిగ్ బాస్ తర్వాత వీళ్లిద్దరి జాతకాలు మారిపోయాయి..అలా ఇనాయ జాతకం కూడా మారిపోతుందా లేదా అనేది చూడాలి..హీరోయిన్ అవ్వాల్సిన లక్షణాలు అన్ని పుష్కలం గా ఈమెలో ఉన్నాయి..బిగ్ బాస్ షో ద్వారా యూత్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించింది..మరి దీనిని సరిగ్గా వాడుకొని కెరీర్ లో పీక్ స్టేజి కి వెళ్తుందా లేదా అనేది చూడాలి.