
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ హీరో కి లేదని చెప్పడం లో ఎలాంటి అతిశయం లేదు..ఒక హీరో ని దేవుడిలాగా కొలవబడేంత అభిమానం ఉన్న ఏకైక తెలుగు హీరో ఆయన మాత్రమే..పాన్ ఇండియా లెవెల్ లో ఎన్ని బాహుబలీలు మరియు ఎన్ని #RRR లు తీసినా కూడా తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ క్రేజ్ ని మ్యాచ్ చెయ్యడం అనేది అసాధ్యం..హిట్ కొట్టినప్పుడు ఏ హీరో కి అయినా క్రేజ్ ఉండడం అనేది సర్వసాధారణం..కానీ అత్తారింటికి దారేది తర్వాత తన రేంజ్ హిట్ లేకపోయినా కూడా అదే రేంజ్ క్రేజ్ ని మైంటైన్ చెయ్యడం ఎంత మంది హీరోలకు సాధ్యం..? రీసెంట్ ఉదాహరణ నిన్న జరిగిన ‘అన్ స్టాపబుల్’ షో విత్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని తీసుకుందాం..ఆహా మీడియా లో ప్రసారం అవుతున్న ఈ బిగ్గెస్ట్ టాక్ షో కి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే.
సీజన్ 1 ఎంత పెద్ద హిట్ అయ్యిందో..సీజన్ 2 అంతకు మించి హిట్ అయ్యింది..ఈ రెండవ సీజన్ కి సంబంధించిన చివరి ఎపిసోడ్ కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వచ్చాడు..ఇప్పటి వరకు ఈ షో కి ఎంతో మంది సెలబ్రిటీస్ వచ్చారు..కానీ పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఉన్న యుఫొరియా మరియు క్రేజ్ ని మాత్రం ఎవ్వరు మ్యాచ్ చేయలేకపోయారు..పవన్ కళ్యాణ్ వచ్చాడని టాప్ మీడియా చానెల్స్ మొత్తం ఫుల్ లైవ్ కవరేజి ఇచ్చింది..సోషల్ మీడియా మొత్తం అట్టుడికిపోయింది..ఎక్కడ చూసినా ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడుకోవడమే జరిగింది..ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ ఎపిసోడ్ కోసం పవన్ కళ్యాణ్ ధరించిన హూడీ పెద్ద సెన్సేషనల్ టాపిక్ అయిపోయింది..సాధారణంగా పవన్ కళ్యాణ్ అభిమానులు తమ హీరో ఏది ధరిస్తే అది కొనడానికి ప్రయత్నిస్తూ ఉంటారు..అలా ఈ హూడీ ని కూడా కొనడానికి గూగుల్ మొత్తం వెతికారు.
హూడీ అయితే దొరికింది కానీ..దాని ధర చూసి అందరికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది..ఎందుకంటే ఆ హూడీ ధర అక్షరాలా 50 వేల రూపాయిలు..ఈ డబ్బులతో ఒక మధ్యతరగతి కుటుంబం నెల మొత్తం బ్రతికేయొచ్చు..ఈ హూడీ ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్ లో అందుబాటులో ఉన్నది..ఎవరైనా కొనాలి అనుకుంటే కొనేయొచ్చు..మధ్య తరగతి కుటుంబీకులకు అయితే కష్టం కానీ..బాగా డబ్బునోళ్లకు ఇలాంటివి కొనడానికి ఏమి లోటు చెప్పండి..ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ‘హరిహర వీరమల్లు’ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు..ఈ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతుంది.