
న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన అంటే సుందరానికి సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అయినా సంగతి మన అందరికి తెలిసిందే..ఇటీవల కాలం లో వరుసగా సిరీస్ సినిమాలే చేసిన నాని, చాలా కాలం తర్వాత ఒక్క పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ తియ్యడం తో మొదటి నుండి ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి..దానికి తగ్గట్టుగానే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్ కి కూడా అప్పోర్వమైన స్పందన లభించడం తో కచ్చితంగా ఈసారి నాని పెద్ద హిట్ కొట్టబోతున్నాడు అని అందరూ అనుకున్నారు..అందరి అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా మొదటి రోజు మొదటి ఆట నుండి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది..కేవలం కామెడీ మాత్రమే పరంగా మాత్రమే కాదు..ఎమోషన్స్ పరంగా కూడా ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది..F3 , విక్రమ్ మరియు మేజర్ వంటివో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ఈ సినిమా కూడా హిట్ అవ్వడం టాలీవుడ్ కి ఎంతో శుభపరిణామం అని చెప్పొచ్చు.
ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న శిల్ప కళా వేదికలో ఘనంగా నిర్వహించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రావడం తో సినిమా పై క్రేజ్ ఒక్క రేంజ్ లో ఏర్పడింది..ఓపెనింగ్స్ కూడా మొదటి ఆట నుండే ఆదారిపొయ్యాయి..ఇది కచ్చితంగా పవన్ కళ్యాణ్ ప్రభావమే అని ఆయన అభిమానులు గట్టిగ నమ్ముతున్నారు..ఎందుకంటే అంటే సుందరిని అడ్వాన్స్ బుకింగ్స్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి ముందు ఆశించిన స్థాయిలో జరగలేదు..ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వస్తున్నాడు అని ఆ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించిందో అప్పటి నుండి ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయి దానికి తోడు సినిమా టాక్ కూడా అదిరిపోవడం తో నాని కెరీర్ లో మరో భారీ బ్లాక్ బస్టర్ వైపు అడుగులు తీసే దిశగా ఈ సినిమా ముందుకి దూసుకుపోతుంది..ఇక ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అవుతుంది.
సాధారణంగా పవన్ కళ్యాణ్ తన స్పీచ్ పూర్తి అయినా తర్వాత వెంటనే వెళ్ళిపోతాడు..కానీ నిన్న స్పీచ్ పూర్తి అయినా తర్వాత హీరోయిన్ నివేత థామస్ ని చూసి మైక్ మళ్ళీ అందుకొని ‘క్షమించాలి..నివేత థామస్ గారి గురించి మర్చిపోయాను..ఆమె గొప్ప నటి..ఆమెకి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టాలి అని కోరుకుంటున్నాను’ అంటూ చెప్పి వెళ్ళిపోయాడు..పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలను నివేత థామస్ కళ్ళలో నుండి ఆనందబాష్పాలు రాలాయి..ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది..పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా లో నివేత థామస్ ఒక్క ముఖ్య పాత్ర పోషించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమాలో ఆమె కనబర్చిన నటనకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..పవన్ కళ్యాణ్ తర్వాత ఈ సినిమా లో బాగా హైలెట్ అయ్యింది నివేత థామస్ అనే విషయం మన అందరికి తెలిసిందే.