
సుడిగాలి సుధీర్ హీరో గా నటించిన ‘గాలోడు’ చిత్రం ఇటీవలే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..టాక్ కి కలెక్షన్స్ కి సంబంధం లేకుండా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లు చూసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యానికి గురి అవుతున్నారు..నాసిరకపు స్టోరీ తో చాలా చెత్తగా ఈ సినిమాని తీశారంటూ టాక్ వచ్చినప్పటికీ కూడా కలెక్షన్స్ పరంగా ఓపెనింగ్స్ దగ్గర నుండి ఈ ఇప్పటి వరుకు ప్రతి రోజు ఈ సినిమా ట్రేడ్ వర్గాలకు షాక్ మీద షాక్ ఇస్తూనే ఉంది..కేవలం రెండు కోట్ల 50 లక్షల రూపాయలకు ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి వారం లోపే 3 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..అంటే వారంలోపే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటేసి అదనం గా కోటి రూపాయిల లాభాలు అన్నమాట.
నెగటివ్ టాక్ మీద వారం లోపే సూపర్ హిట్ స్టేటస్ కి తీసుకెళ్లిన ఏకైక హీరో గా సుడిగాలి సుధీర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు..ఇలాంటి రేర్ ఫీట్ ని టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు కూడా ఇప్పటి వరుకు చెయ్యలేదు..కేవలం సుడిగాలి సుధీర్ పేరు మీద జనాలు ఇలా కదిలి రావడాన్ని చూసి టాలీవుడ్ బడా నిర్మాతలందరూ ఇప్పుడు సుధీర్ ని హీరో గా పెట్టి సినిమాలు చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారట..కాస్త క్వాలిటీ మైంటైన్ చేస్తే సరైన స్క్రిప్ట్స్ తో అతనిని వెండితెర మీద ప్రెజెంట్ చేస్తే కాసుల కనకవర్షం కురుస్తుందని దర్శక నిర్మాతలు చాలా గట్టిగా నమ్ముతున్నారట..అందుకే టాలీవుడ్ లో సుడిగాలి సుధీర్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది..పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు వంటి హీరోల సినిమాలు కూడా ఫ్లాప్ టాక్ వస్తే నష్టాలు వచ్చేస్తున్నా ఈరోజుల్లో సుధీర్ నెగటివ్ టాక్ తో వారం లోపే లాభాల్ని రాబట్టడం అంటే సాధారణమైన విషయం కాదు.
సుడిగాలి సుధీర్ క్రేజ్ కేవలం యూట్యూబ్, సోషల్ మీడియా మరియు బుల్లితెర వరుకు మాత్రమే పరిమితమని అనుకున్నారు అందరూ..కానీ సుధీర్ కోసం ప్రేక్షకులు థియేటర్స్ కి కదిలేంత క్రేజ్ ఉందని మాత్రం ఎవ్వరు ఊహించలేదు..ఇది నిజంగా మెచ్చుకోదగ్గ విషయమే..అయితే తనని ఇంతలా అభిమానించే ఫ్యాన్స్ కోసం సుధీర్ ఎదో డబ్బుల కోసం సినిమాలు చేస్తునట్టు కాకుండా..కాస్త కథాబలం ఉన్న సినిమాలు చేస్తే అతను మరో లెవెల్ కి వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నా మాట..ఇప్పుడైతే ఒక సినిమా తేలికగా ఆడేసింది కానీ..ప్రతీ సినిమా ఇలాగే ఆడుతుంది అనే నమ్మకం లేదు..అందుకే స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో సుధీర్ ఇక నుండి జాగ్రత్తలు తీసుకోవాలి..లేకపోతే జీవితాంతం అతను ఆ జబర్దస్త్ షోకి పరిమితం అవ్వాల్సి వస్తుందని విశ్లేషకులు చెప్పే మాట..మరి సుధీర్ తన తీరుని మార్చుకుంటాడా..మరో లెవెల్ కి వెళ్తాడా..లేదా ఈటీవీ కి మాత్రమే పరిమితం అవుతాడా అనేది తెలియాలంటే కొద్దీ రోజులు వేచి చూడాల్సిందే.