
మన టాలీవుడ్ లో యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు ఎవరు అంటే మనకి ముందుగా గుర్తుకు వచ్చే పేర్లు పవన్ కళ్యాణ్ మరియు ప్రభాస్..వీళ్ళ సినిమాలు వస్తుంది అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది..టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు వసూళ్లు ఒక్క రేంజ్ లో వస్తాయి..ప్రభాస్ అయితే ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు..ప్రస్తుతం ఈయనకి పాన్ ఇండియా లెవెల్ లో ఉన్న స్టార్ డమ్ ఏ హీరోకి కూడా లేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు..కానీ ఆంధ్ర ప్రదేశ్ వరుకు వస్తే పవన్ కళ్యాణ్ కి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది అనొచ్చు..ఏది ఏమైనా ఇద్దరు హీరోలు తోపులే అని చెప్పొచ్చు..అయితే ప్రభాస్ దాదాపుగా టాలీవుడ్ లో ప్రతి హీరో తో క్లోజ్ గా మూవ్ అయినా సందర్భాలు ఉన్నాయి..ఒక్క పవన్ కళ్యాణ్ తో తప్ప..ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఎవరితోనూ కలవడు..కానీ ఘర్షణ సినిమా ఆడియో లాంచ్ అప్పుడు పవన్ కళ్యాణ్ , ప్రభాస్ ముఖ్య అతిధులుగా హాజరు అయ్యారు..అప్పుడు ఒక్కటే ప్రభాస్ – పవన్ కళ్యాణ్ కలిసింది..ఇక ఆ తర్వాత వీళ్లిద్దరు ఎప్పుడు కూడా కలవలేదు.
అయితే అప్పట్లో సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ పైన పవన్ కళ్యాణ్ – ప్రభాస్ కాంబినేషన్ లో ఒక మల్టీస్టార్ర్ర్ సినిమా సెట్ అయ్యిందట..ఈ సినిమాని భారీ లెవెల్ లో అప్పట్లోనే పాన్ ఇండియా లెవెల్ లో తీద్దాం అనుకున్నారట..ప్రభాస్ తో అప్పటికే సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై వర్షం మరియు పౌర్ణమి వంటి సినిమాలను నిర్మించాడు MS రాజు గారు..ఇందులో వర్షం సినిమా సెన్సషనల్ హిట్ అవ్వగా..పౌర్ణమి సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది..కానీ పవన్ కళ్యాణ్ తో మాత్రం MS రాజు గారు అప్పటి వరుకు ఎలాంటి సినిమా చెయ్యలేదు..ఈ సినిమానే మొదటగా పవన్ కళ్యాణ్ తో చెయ్యబొయ్యే సినిమా అనుకున్నారట..పవన్ కళ్యాణ్ ని కూడా అడిగిన వెంటనే అయన నటించడానికి ఒప్పుకున్నాడట..కానీ ఈ గ్యాప్ లో ఒప్పుకున్నా కొన్ని సినిమాలు ఉన్నాయి అవి పూర్తి అవ్వగానే మీకు డేట్స్ కేటాయిస్తాను అని చెప్పాడట కళ్యాణ్..కానీ ప్రభాస్ కి అంత కాలం వేచి ఉండే సమయం లేదట..ఆయన సినిమాల లైనప్ లో బిజీ అయిపోయాడు..ఇక పవన్ కళ్యాణ్ కూడా తన లైనప్ లో బిజీ అయిపోయాడు..అలా భారీ బడ్జెట్ తో తీద్దాం అనుకున్న ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేకపోయింది.
ఇప్పుడు మల్టీస్టార్ర్ర్ ట్రెండ్ నడుస్తున్నప్పటికీ కూడా ప్రభాస్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా రావడం కష్టమే..ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక పక్క పొలిటికల్ కమిట్మెంట్స్ లో బిజీ గా ఉంటూనే మరోపక్క సినిమాలు చేస్తున్నాడు..ఇప్పుడు పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమాలకు బల్క గా డేట్స్ కేటాయించే సమయం కూడా ఉండదు..అందుకే ఈ కాంబినేషన్ భవిష్యత్తులో కూడా అసాధ్యం అనే చెప్పాలి..ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో సలార్ అనే సినిమా చేస్తున్నాడు..దీనితో పాటు ఆయన ప్రాజెక్ట్ K మరియు ఆదిపురుష్ వంటి సినిమాలలో కూడా నటిస్తున్నాడు..ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తన్న హరిహర వీర మల్లు అనే సినిమాలో నటిస్తున్నాడు..ఈ సినిమా తర్వాత భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో నటించబోతున్నాడు..ఈ రెండు చిత్రాలు పూర్తి అయినా తర్వాత ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు.