
టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..సీలెబ్రిటీస్ లో కూడా ఆయనకి ఉన్న ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ..ముఖ్యంగా మనకి ఇండస్ట్రీ లో పవన్ కళ్యాణ్ భక్తుడు అంటే మనకి ముందుగా గుర్తుకు వచ్చే పేరు బండ్ల గణేష్..పవన్ కళ్యాణ్ పేరు ఎత్తితే ఈయన పూనకాలు వచ్చి ఊగిపోతాడు..ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో బండ్ల గణేష్ స్పీచ్ కి ఉండే క్రేజ్ మామూలుది కాదు అనే చెప్పాలి..ముఖ్యంగా వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేష్ ఇచ్చిన స్పీచ్ ఇప్పటికి సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉంటుంది..అలా బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ రీసెంట్ మూవీ భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాకపోవడం పెద్ద చర్చకి దారి తీసింది..అయితే పవన్ కళ్యాణ్ ఫాన్స్ నేరుగా బండ్ల గణేష్ కి ఫోన్ చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తున్నావా అన్నా అని అడగగా, బండ్ల గణేష్ దానికి సమాధానం చెప్తూ ‘ నాకు ఎలాంటి ఆహ్వానం అందలేదమ్మా..త్రివిక్రమ్ శ్రీనివాస్ నాకు కావాలనే ఆహ్వానం అందకుండా చేసాడు’ అంటూ బండ్ల గణేష్ ఫోన్ లో మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో లీక్ అయ్యి ఒక్క రేంజ్ లో వైరల్ అయ్యింది.
ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత పవన్ కళ్యాణ్ ని కలవడానికి కోసం ఎన్నోసార్లు ప్రయత్నాలు చెయ్యగా త్రివిక్రమ్ ఆయనని కలవనివ్వకుండా అడ్డుపడుతున్నాడట..ఇక బండ్ల గణేష్ కి త్రివిక్రమ్ పై కోపం కట్టలు తెంచుకుంది..నా దేవుడిని కలవనియ్యకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ అడ్డుపడుతున్నాడని కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానుల సమక్షం లో వాపోయాడు బండ్ల గణేష్..అయితే దీని వల్ల పవన్ కళ్యాణ్ మరియు బండ్ల గణేష్ మధ్య చాలా దూరం పెరిగిందట..ఇటీవల ట్విట్టర్ లో ఆయన పెడుతున్న పోస్టులు పవన్ కళ్యాణ్ ని పరోక్షంగా ఉద్దేశించి పెడుతున్నట్టు తెలుస్తుంది..ఇటీవలే ఆయన పెట్టిన ఒక్క ట్వీట్ సోషల్ మీడియా లో పెను దుమారమే రేపింది..ఈ ట్వీట్ లో ఆయన ఏమి అన్నాడంటే ‘నటించే మనుషులు ఉన్నంత కాలం నిజాయితీగా ఉండేవాడు ఓడిపోతూనే ఉంటాడు’ అంటూ ఆయన పెట్టిన ఒక ట్వీట్ సెన్సషనల్ గా మారింది..ఇది ఎవరిని ఉద్దేశించి వేసాడు..? త్రివిక్రమ్ ని ఉద్దేశించి వేశాడా..లేక పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి వేశాడా అనేది ఇప్పుడు సోషల్ మీడియా నడుస్తున్న పెద్ద చర్చ.
ఇక పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే భీమ్లా నాయక్ సినిమా తర్వాత ఆయన ప్రముఖ దర్శకుడు క్రిష్ తో హరి హర వీర మల్లు అనే సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి తాత్కాలికంగా నిలిచిపోయింది..పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ షెడ్యూల్స్ తో బిజీ గా ఉండడం తో ఈ చిత్రం ఆలస్యం అవుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఇప్పటికే 60 శాతం కి పైగా షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం..మరో మూడు షెడ్యూల్స్ లో షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకోనుంది అని సమాచారం..ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ ఈ సినిమా తో పాటుగా తమిళం లో సూపర్ హిట్ అయినా ‘వినోదయ్యా సీతం’ అనే రీమేక్ సినిమాలో నటిస్తున్నాడు..ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ తో పాటుగా ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు..ఇటీవలే పూజ కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది..ఈ రెండు సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కబోయే ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమా చెయ్యబోతున్నాడు.