
తెలుగు చలన చిత్ర పరిశ్రమ మొత్తాన్ని నేడు కృష్ణ గారి మరణ వార్త అంధకారం లోకి నెట్టేసింది..తెలుగు సినిమా కి పునాదులు వేసిన మహనుభావులలో ఒకరైన కృష్ణ గారు ఇక లేరు అనే విషయాన్నీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు..తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా ఎంతోమంది ప్రముఖులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించుకొని బోరున విలపించారు..కేవలం టాలీవుడ్ మాత్రమే కాకుండా కోలీవుడ్, మాలీవుడ్ , శాండిల్ వుడ్ మరియు బాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీస్ కి చెందిన వారు సోషల్ మీడియా లో సంతాపం వ్యక్తం చేసారు..ఇక మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారి దగ్గర నుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వరుకు అన్ని రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులూ కృష్ణ గారికి అశ్రు నివాళి అర్పించారు..తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు రేపు ప్రభుత్వ లాంచలతో కృష్ణ గారికి అంత్యక్రియలు ఏర్పాటు చేసాడు..రేపు మహాప్రస్థానం లో కృష్ణ గారి అంత్యక్రియలు జరగనున్నాయి.
ఇక కృష్ణ గారి మరణవార్త విని ఇండస్ట్రీ లో అందరికంటే ముందుగా స్పందించి ఆయన భౌతిక కాయాన్ని సందర్శించిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..కాంటినెంటల్ హాస్పిటల్ నుండి కృష్ణ గారి భౌతిక కాయాన్ని ఆయన ఇంటికి తరలించగానే మొట్టమొదటగా సందర్శించి కృష్ణ గారికి నివాళులు అర్పించి మహేష్ బాబు ని ఆయన కుటుంబాన్ని పరామర్శించాడు పవన్ కళ్యాణ్..మహేష్ బాబు మరియు పవన్ కళ్యాణ్ నేటి తరం హీరోలలో టాప్ 2 స్థానాల్లో కొనసాగుతున్న స్టార్ హీరోలు..వీళ్లిద్దరి సినిమాలు విడుదల అవుతున్నాయంటే చాలు అమెరికా నుండి అనకాపల్లి వరుకు పండగ వాతావరణం నెలకొంటుంది..అలాంటి వీళ్లిద్దరు కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే చూడాలనేది ఇరువురి హీరోల కోరిక..కానీ ఆ కోరిక ఈరోజు ఇలాంటి విషాద సమయం లో నెరవేరుతుందని కలలో కూడా ఊహించలేదంటూ అభిమానులు వాపోతున్నారు..విచారవదనం తో ఉన్న మహేష్ బాబు ని పవన్ కళ్యాణ్ హత్తుకొని ఓదారుస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఇక కృష్ణ గారి భౌతిక కాయాన్ని హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడా లో కృష్ణ గారి స్వగృహం లోనే శ్రేయోభిలాషులు మరియు అభిమానుల సందర్సర్థం ఉంచారు..అభిమానుల తాకిడి తీవ్రత ఎక్కువ ఉంటుందని భావించిన కుటుంబీకులు తొలుత కృష్ణ గారి భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం గచ్చిబౌలి స్టేడియం లో పెట్టాలనుకున్నారు..కానీ హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షల కారణంగా కృష్ణ గారి ఇంట్లోనే అభిమానుల సందర్శనార్థం ఉంచాలని నిశ్చయించుకున్నారు..దీనితో కృష్ణగారిని కడసారి చూసుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి వేలాదిగా తరలివచ్చిన అభిమానులు కాస్త ఇబ్బందికి గురైయ్యారు..కృష్ణ గారి ఇంట్లోనే ఆయన భౌతిక కాయాన్ని సందర్శించుకునేందుకు పయనమయ్యారు..రేపు అట్టహాసం గా మహా ప్రస్థానం లో కృష్ణ గారి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరిపించనున్నారు..కృష్ణ గారి పవిత్ర ఆత్మా ఎక్కడున్నా శాంతిని కోరుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడికి ప్రార్థన చేద్దాము.