రాంగోపాల్ వర్మ ఇప్పుడు యూట్యూబ్ లో కానీ, సోషల్ మీడియా లో కానీ ఎక్కడ చూసిన ఈయన గురించే మాట్లాడు కుంటున్నారు కారణం జనసేన పార్టీ అద్యక్ష్యుడు పవన్ కళ్యాణ్ మీద ఇతను అసభ్యంగా తీసిన సినిమానే కారణంఆ సినిమా పేరు పవర్ స్టార్ ఈరోజు ఈ సినిమా రామ్ గాయపాల్ వర్మ తన మొబైల్ యాప్ లో విడుదల చేసాడు తొలుత ఈ సినిమా పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా తీస్తున్న చిత్రం అని అందరూ అనుకున్నారు రామ్ గోపాల్ వర్మ కూడా మొదటి నుండి ఈ సినిమాకి సంబంధించిన టీజర్లు,ట్రైలర్లు,పాటలు కూడా పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగానే తీస్తున్నట్టు ప్రచారం చేసుకున్నాడు. దీనితో పవన్ కళ్యాణ్ అభిమానులు రామ్ గోపాల్ వర్మ పై ఆవేశం తో రగిలిపోయారు.సోషల్ మీడియా లో కూడా రామ్ గోపాల్ వర్మ పర కళ్యాణ్ ఫాన్స్ ని కావాలని గెలుకుతూ రెచ్చగొడుతూ తన సినిమాకి ఎంత పబ్లిసిటీ కావాలో అంత తెచ్చుకున్నాడు.
కానీ చివరికి సినిమా చూస్తే కానీ అర్థం కాలేదు.ఒక్క అభిమాని గా పవన్ కళ్యాణ్ ఒక్క శిఖరాగ్ర స్థాయిని గుర్తు చేసాడు అని అవును మీరు వింటున్నది నిజమే ఈరోజు విడుదల అయినా పవర్ స్టార్ సినిమా లో చివరి 10 నిమిషాలు పవన్ కళ్యాణ్ కి ఒక్క రేంజ్ లో ఇచ్చి తానూ పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద అభిమానో నిరూపించుకున్నాడు.ఈ సినిమా చూసాక ప్రతి ఒక్కరికి రామ్ గోపాల్ వర్మ నిజమైన పవన్ కళ్యాణ్ భక్తుడు అని అనక తప్పదు.అయితే రామ్ గోపాల్ వర్మ తన పబ్లిసిటీ పిచ్చితో చేసిన వికృత చేష్టలు,ఆయనతో గతం లో పని చేసిన హీరోలు,ప్రొడ్యూసర్ల చేత కూడా తిట్టించేలా చేసాయి రెండు రోజుల క్రితం దమ్ముంటే నా ఇంటికి రమ్మని పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి ఛాలెంజ్ విసరగా పవన్ కళ్యాణ్ ఫాన్స్ అతని ఇంటికి వెళ్ళేలోపు పెద్ద రగడ జరిగింది.