
టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్‌కు ఉండే క్రేజ్ మరో హీరోకు లేదంటే అతిశయోక్తి కాదు. పవన్ ఎలాంటి సినిమా చేసినా హైప్స్ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆయన వరుసపెట్టి రీమేక్స్ సినిమాల్లో నటించినా ఇమేజ్ కొంచెం కూడా తగ్గలేదు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ వరుసగా సూపర్ డూపర్ హిట్లు కావడంతో ఇప్పుడు పవన్ నటించే తదుపరి సినిమాపై ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పవన్ కళ్యాణ్ దర్శకుడు హరీష్ శంకర్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. గబ్బర్ సింగ్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రాకపోవడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీకి ఆల్రెడీ భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ప్రతిష్టాత్మక అగ్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ ఈ సినిమాను నిర్మించనుంది.
అయితే భవదీయుడు భగత్ సింగ్ సినిమా గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లాల్సిన భవదీయుడు భగత్ సింగ్ సినిమా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతోంది. ఇటీవల దర్శకుడు హరీష్ శంకర్ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను కలిశారు. దీంతో హరీష్ శంకర్ ఆయనతో మూవీ చేయడానికి కలిశారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే అసలు కారణంగా పవన్‌తో తీయబోతున్న భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో కీలక పాత్రలో నటించాల్సిందిగా సల్మాన్ ఖాన్‌ను హరీష్ శంకర్ కోరినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో భవదీయుడు భగత్ సింగ్ మూవీలో సల్మాన్ కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. పవన్-సల్మాన్ లాంటి క్రేజీ కాంబినేషన్ వెండితెరపై పవర్‌స్టార్ అభిమానులకు భారీ ట్రీట్ అందించనుందని భావిస్తున్నారు. ఈ వార్త నిజమైతే ఓ గొప్ప కాంబినేషన్ సెట్ అయినట్లేనని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.
ఇప్పటికే బాలీవుడ్ కండల వీరుడు హీరో సల్మాన్ ఖాన్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్‌ఫాదర్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మలయాళ హిట్ లూసీఫర్ మూవీకి రీమేక్‌గా గాడ్ ఫాదర్ చిత్రీకరణ జరుపుకుంటోంది. దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే సల్మాన్ ఖాన్‌పై ఓ ఫైట్, ఓ సాంగ్ చిత్రీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు చిరంజీవి బ్రదర్ పవన్ కళ్యాణ్ సినిమాలోనూ పవన్ నటిస్తారని వార్తలు రావడం మెగా అభిమానులకు ఉత్కంఠకు గురిచేస్తోంది. పవన్-హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్ సల్మాన్ హిట్ మూవీ దబాంగ్ రీమేక్ అన్న విషయం తెలిసిందే. ఒరిజినల్ వర్షన్‌కు చాలా మార్పులు చేసి గబ్బర్ సింగ్‌ను హరీష్ శంకర్ తెరకెక్కించాడు. వరుస పరాజయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్‌కు ఈ మూవీ భారీ కమ్ బ్యాక్ ఇచ్చింది. అటు పవన్ కళ్యాణ్ తమిళ రీమేక్ వినోదయ సీతం మూవీని ముందుగా పూర్తి చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ సినిమాలో సాయిధరమ్‌తేజ్ కూడా మరో హీరోగా నటించనున్నాడు. సముద్రఖని ఈ మూవీని తెరకెక్కించనున్నాడు.