
ఒక పక్క సినిమాలు మరో పక్క రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ఏకైక స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..అజ్ఞాతవాసి సినిమా తర్వాత అసలు సినిమాలు చేస్తాడా లేదా అనే సందిగ్ధం లో అభిమానులను పడేసిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత పింక్ సినిమా రీమేక్ గా వకీల్ సాబ్ సినిమాని చేస్తునట్టు ప్రకటించాడు..అలా వకీల్ సాబ్ సినిమాని మరియు భీమ్లా నాయక్ సినిమాని విడుదల చేసాడు..రెండు కూడా భారీ హిట్టే..మరో పక్క జనసేన పార్టీ ని బలోపేతం చేస్తూ గ్రామ స్థాయి నుండి బలమైన ప్రత్యామ్నాయ పార్టీ గా మలిచాడు..ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా యాత్ర ని చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ యాత్ర ద్వారా చనిపోయిన కౌలు రైతు కుటుంబాలకు లక్ష రూపాయిల సహాయం చేస్తున్నాడు..ఇప్పటి వరుకు వెయ్యి కుటుంబాలకు సహాయం చేసిన పవన్ కళ్యాణ్ మరో రెండు వేల రైతు కుటుంబాలకు సహాయం చెయ్యబోతున్నాడు..అయితే నిరంతరం ప్రజా క్షేత్రం లో ఉంటున్న పవన్ కళ్యాణ్ కి వైరల్ ఫీవర్ సోకింది.
గత రెండు వారల నుండి ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు..ఇప్పుడు ఆయన వైరల్ ఫీవర్ నుండి పూర్తిగా కోలుకోవడం తో త్వరలోనే సినిమా షూటింగ్స్ మరియు రాజకీయ కార్యకలాపాలలో బిజీ గా గడపబోతున్నారు..అయితే నిన్న పవన్ కళ్యాణ్ తన పార్టీ ఆఫీస్ లో సెల్ఫీ దిగుతూ పెట్టిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..ఈ సెల్ఫీ లో ఒక చిన్న పిల్లాడిని హాగ్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ దిగిన ఫోటో సెన్సషనల్ గా మారింది..ఎవరు ఈ అబ్బాయి..?, పవన్ కళ్యాణ్ తో ఇంత చనువుగా ఉన్నాడు..మెగా ఫామిలీ కుటుంబానికి చెందిన అబ్బాయా? అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి..అయితే ఆ అబ్బాయి కేవలం ఒక సాధారణ అభిమాని కొడుకేనట..కౌలు రైతుల కోసం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరుపున ప్రత్యేకంగా ఒక నిధి ని ఏర్పాటు చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ నిధికి ఎంతో మంది డొనేషన్స్ చేసారు..అలాగే నిన్న పవన్ కళ్యాణ్ ని కొంత మంది NRI అభిమానులు కలిసి పార్టీ 50 లక్షల రూపాయిలు డొనేట్ చేసారు..అలా అక్కడకి వచ్చిన ఒక NRI కొడుకు పవన్ కళ్యాణ్ తో సెల్ఫీ దిగాలని కోరగా , ప్రేమగా అతినిని దగ్గరకి తీసుకొని ఫోటో దిగాడు పవన్ కళ్యాణ్.
ఈ ఫోటో ని చూసి మనం అందరం ఎవరో ఈ అబ్బాయి పవన్ కళ్యాణ్ కి బాగా కావాల్సిన వ్యక్తికీ సంబంధించిన అబ్బాయి..అందుకే ఇంత చనువు తో ఫోటో దిగాడు అని అనుకున్నాం..కానీ ఒక సాధారణ అభిమానితో పవన్ కళ్యాణ్ ఇంత చనువుగా ఫోటో దిగడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు..ఇలాంటి అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి కాబట్టే పవన్ కళ్యాణ్ ని అభిమానులు అంతలా ఆరాధిస్తారు అంటూ సోషల్ మీడియా లో ప్రశంసలు కురుస్తున్నాయి..ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన హీరో గా ప్రముఖ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్న ‘హరి హర వీర మల్లు’ సినిమా షూటింగ్ గత కొంతకాలం నుండి ఆగిపోయిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇప్పుడు అతి త్వరలోనే ఆ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది..దీనితో పాటు వినోదయ్యా సీతాం అనే తమిళ సూపర్ హిట్ రీమేక్ సినిమాలో కూడా నటించబోతున్నాడు పవన్ కళ్యాణ్..ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా అతి త్వరలోనే ప్రారంభం కానుంది.