Home Entertainment పవన్ కళ్యాణ్ డిజాస్టర్ ఫ్లాప్ ని రీమేక్ చేస్తున్న సల్మాన్ ఖాన్

పవన్ కళ్యాణ్ డిజాస్టర్ ఫ్లాప్ ని రీమేక్ చేస్తున్న సల్మాన్ ఖాన్

1 second read
0
0
211

ఇప్పటివరకు సల్మాన్ ఖాన్ సినిమాలను పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ రీమేక్ చేయడం చూశాం. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. మన పవన్ కళ్యాణ్ సినిమాను సల్మాన్ ఖాన్ రీమేక్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అది కూడా ఫ్లాప్ అయిన సినిమాను సల్మాన్ రీమేక్ చేయబోతుండటం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇటీవల బాలీవుడ్ పరిస్థితి మరీ తీసికట్టులా తయారైంది. ముఖ్యంగా దక్షిణాది సినిమాలు అందులోనూ తెలుగు సినిమాలపైనే బాలీవుడ్ అతిగా ఆధారపడుతోంది. ఈ ఏడాది పుష్ప, ఆర్.ఆర్.ఆర్, కేజీఎఫ్-, కార్తీకేయ-2, సీతారామం సినిమాలు బాలీవుడ్‌లో మంచి వసూళ్లు సాధించాయి. కానీ బాలీవుడ్ సినిమాలు మాత్రం వచ్చిన సినిమా వచ్చినట్లు టపా కట్టేసింది. ప్రస్తుతం బ్రహ్మాస్త అయినా బాలీవుడ్ రికార్డులను బద్దలు కొడుతుందేమో అని ఆశించారు కానీ అది కూడా తుస్సుమన్నట్లే కనిపిస్తోంది. రూ.400 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన బ్రహ్మాస్త్ర మూవీ తొలి వారంలో సగం వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. అందుకే ఇప్పుడు సౌత్ సినిమాలను రీమేక్ చేసి లబ్ధి పొందాలని బాలీవుడ్ బడా స్టార్లు ఆలోచిస్తున్నారు.

తాజాగా సల్మాన్ ఖాన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమాను రీమేక్ చేయబోతున్నాడు. ఈ సినిమా తమిళ రీమేక్‌గా తెరకెక్కింది. అయితే అప్పటికే తమిళ సినిమా వీరం సినిమా వీరుడొక్కడే పేరుతో తెలుగులో విడుదలైనా పవన్ వెనకడుగు వేయకుండా రీమేక్ సినిమాలో నటించాడు. 2017లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌‌గా మిగిలిపోయింది. అయితే స్టార్ హీరోల జడ్డిమెంట్ ఎలా ఉంటుందో చెప్పలేని స్థితి. ఒక్కో సారి ప్లాఫ్ అయిన సినిమాల రీమేక్‌కు సైతం అంగీకారం తెలుపుతుంటారు. హిట్ అయిన సినిమా చేయటానికి ఆలోచిస్తుంటారు. అంతే కాదు ఒక్కోసారి డబ్ అయి బాగా ఆడిన సినిమాను కూడా రీమేక్ చేస్తుంటారు.ఈ నేపథ్యంలో సల్మాన్ తాజా చిత్రం కిసీ కా భాయ్ కిసీ కి జాన్ కాటమరాయుడు రీమేక్‌గానే తెరకెక్కుతోందని టాక్ నడుస్తోంది. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో నటిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో జగపతిబాబు విలన్‌గా నటిస్తున్నాడు. దీనిని సల్మాన్ ఖాన్ స్వయంగా నిర్మిస్తున్నాడు. అయితే పూజా హెగ్డే సోదరుడి పాత్రలో వెంకటేష్ కనిపిస్తాడని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే సల్మాన్ ఖాన్ రీమేక్‌ల వెంట పడటం ఇదేమీ కొత్త కాదు. గతంలో మహేష్ నటించిన పోకిరి, రామ్ నటించిన రెడీ, వెంకటేష్ నటించిన బాడీగార్డ్ వంటి కొన్ని సూపర్ హిట్ సౌత్ చిత్రాలను రీమేక్ చేసి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ అందుకున్నాడు. కానీ ఇటీవల కాలంలో వరుస పరాజయాలతో వెనక బడ్డాడు. దీంతో మరోసారి రీమేక్ మూవీనే సల్మాన్ నమ్ముకున్నాడు. కాటమరాయుడుగా పవన్ అందుకోని విజయాన్ని సల్మాన్ రీమేక్ తో అందుకుంటాడేమో చూడాలి. గతంలో సల్మాన్ నటించిన దబాంగ్ వంటి హిట్ చిత్రాన్ని పవన్ గబ్బర్ సింగ్‌గా రీమేక్ చేసి భారీ విజయాన్ని పొందాడు. అయితే కిసీ కా భాయి కిసీ కీ జాన్ సినిమాలో సల్మాన్ లాంగ్ హెయిర్ స్టైలుతో సరికొత్తగా కనిపించనున్నాడు. ఇందుకు సంబంధించి మేకర్స్ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్, నడియావాలా గ్రాండ్ సన్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు ఫర్హద్ సమ్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది జూన్‌లో ఈ మూవీ రిలీజ్ కానుంది. తెలుగులో హీరోయిన్ తండ్రి పాత్రను హిందీలో హీరోయిన్‌కు అన్నగా మార్చారని అంటున్నారు. దాంతో సల్మాన్, వెంకీ మధ్య సీన్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…