
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన శుభవార్త రానే వచ్చింది..మెగాస్టార్ చిరంజీవి కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు..ఈ విషయం మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులకు తెలియచేసాడు..’ఆంజనేయ స్వామి ఆశీస్సులతో త్వరలోనే రామ్ చరణ్ – ఉపాసన మొదటి సంతానం కి తల్లితండ్రులు కాబోతున్నారు’ అంటూ ఆయన పెట్టిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది..సుమారు పదేళ్ల దాంపత్య జీవితం తర్వాత ఈ దంపతులిద్దరూ తల్లిదండ్రులు అయ్యారు..మెగాస్టార్ చిరంజీవి తాతయ్య అయ్యాడు..కొద్ది రోజుల క్రితమే ఉపాసన గర్భం దాల్చిందని..ఈ సందర్భంగా చిరంజీవి అభిమానులకు చెప్పుకొచ్చాడు..నేటి నుండి సరిగ్గా నొమ్మిది నెలలు అంటే ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంది..రామ్ చరణ్ కి కొడుకు పుడుతాడా..లేదా కూతురు పుడుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతో ఎదురు చూస్తూ ఉన్నారు.
ఇక రామ్ చరణ్ – ఉపాసన మొదటి సంతానం సెప్టెంబర్ 2 వ తేదీ..అనగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు భూమి మీదకి అడుగుపెట్టబోతుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న వార్త..నేటి నుండి సరిగ్గా తొమ్మిది నెలలు అంటే ఆగష్టు లేదా సెప్టెంబర్ నెల లో డెలివరీ డేట్ ఉండబోతుంది..ఆగష్టు 22 వ తారీఖున చిరంజీవి పుట్టిన రోజు ఉంది..తనకి ఎంతో ఇష్టమైన చిరంజీవి మరియు రామ్ చరణ్ పుట్టినరోజు నెలలలో ఒకవేళ బిడ్డ పుడితే రామ్ చరణ్ కి ఎంత సంతోషం గా ఉంటుందో ఊహించుకోవచ్చు..పవన్ కళ్యాణ్ తన చిన్న కొడుక్కి అన్నయ్య చిరంజీవి పేరు..మరియు తన పేరు కలిసి వచ్చేలా మార్క్ శంకర్ పవనోవిచ్ అని పెట్టుకున్నాడు..ఇప్పుడు రామ్ చరణ్ కూడా తనకి బిడ్డ పుడితే చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ పేర్లు కలిసొచ్చేలా పెడుతాడా లేదా అనేది చూడాలి..చిరంజీవి వంశం పేర్లు మొత్తం తేజ్ తో ముగుస్తుంది.
ఇప్పుడు రామ్ చరణ్ కూడా తన బిడ్డ పేరు చివరన తేజ్ అని పెడుతాడా..లేదా తన తండ్రి మరియు బాబాయ్ పేర్లు కలిసొచ్చేలా పెట్టుకుంటాడా అనేది చూడాలి..ఇక రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే..ఈ మూవీ షూటింగ్ సెరవేగంగా సాగుతుంది..మరో పక్క రామ్ చరణ్ కి #RRR సినిమాలో అద్భుతమైన నటన కనబర్చినందుకు గానూ అంతర్జాతీయ పురస్కారాలు కూడా వరుసపెట్టి వస్తున్నాయి..ఇప్పుడు ఆయనకి ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి..అలా ఒక్కేసారి కెరీర్ పరంగా మరియు వ్యక్తిగతం గా రామ్ చరణ్ ఎంతో పీక్ ని చూస్తున్నాడు..ఇక ఆయన అభిమానుల సంగతి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..తమ సొంత కుటుంబం లో ఎవరైనా విజయం సాధిస్తే ఎంత సంతోషిస్తారో..అంతలా వాళ్ళు సంతోషిస్తున్నారు.