Home Entertainment పవన్ కళ్యాణ్ అభిమానుల పై విరుచుకుపడ్డ సూపర్ స్టార్ కృష్ణ

పవన్ కళ్యాణ్ అభిమానుల పై విరుచుకుపడ్డ సూపర్ స్టార్ కృష్ణ

0 second read
0
0
500

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన సర్కారు వారి పాట సినిమా ఇటీవలే విడుదల మంచి విజయాన్ని సాధించిన సంగతి మన అందరికి తెలిసిందే..భారీ అంచనాల తో విడుదల అయినా ఈ సినిమా మొదటి రోజు మొదటి ఆట నుండి సోషల్ మీడియా లో కాస్త డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది..కానీ ఆఫ్ లైన్ లో ఈ సినిమాకి ఫామిలీ ఆడియన్స్ లో పాజిటివ్ టాక్ ఉండడం తో వసూళ్ల పరంగా స్టడీ గా ఉంటూ ముందుకి దూసుకుపోయింది..ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి మొదటి రోజు ఆన్లైన్ లో నెగటివ్ టాక్ రావడానికి కారణం పవన్ కళ్యాణ్ ఫాన్స్ అని సోషల్ మీడియా లో మహేష్ బాబు అభిమానులు ఆరోపించిన సంగతి మన అందరికి తెలిసిందే..మొదటి రోజు మొదటి ఆట నుండే వాళ్ళు నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేసారు అని..అందుకే ఓపెనింగ్స్ పై కాస్త ప్రభావం పడింది అని మహేష్ బాబు అభిమానులు చెప్పే మాట..కానీ మేము ఆలా రియాక్ట్ అవ్వడానికి కారణం గతం లో మహేష్ బాబు అభిమానులు వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ సినిమాలు విడుదల అయినా సమయం లో చాలా నెగటివ్ టాక్ విస్తరింపచేసారు అనో..వాళ్ళు చేసిన దానికి బదులుగా సమాధానం సర్కారు వారి పాట సినిమా సమయం లో చెప్పాము అని పవన్ కళ్యాణ్ అభిమానులు అంటున్నారు.

పవన్ కళ్యాణ్ అభిమానులు రంగం లోకి దిగి ట్రోల్ చెయ్యడం ప్రారంభిస్తే దాని ఫలితం ఇలాగె ఉంటుంది అని, కాబట్టి మా జోలికి రావొద్దు అంటూ సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ ఫాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు..పవన్ కళ్యాణ్ ఫాన్స్ చేసిన ట్రోల్ల్స్ ఏ రేంజ్ లో వ్యాప్తి చెందింది అంటే ప్రముఖ మీడియా చానెల్స్ అన్ని ఆ ట్రోల్ల్స్ పై ప్రత్యేక కార్యక్రమాలు చేసే రేంజ్ లో అన్నమాట!..స్వయంగా ఆ సినిమాని నిర్మించిన నిర్మాతలే ఈ ట్రోల్ల్స్ పై స్పందిస్తూ ట్విట్టర్ లో ట్వీట్ వెయ్యడమే కాకుండా, సూపర్ స్టార్ కృష్ణ కూడా రియాక్ట్ అయ్యేలా చేసింది..ఇటీవల ఒక్క ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కృష్ణ గారితో సర్కారు వారి పాట సినిమా గురించి చేసిన ఒక్క చిన్న చిట్ చాట్ లో ఆయన చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..ఆయన మాట్లాడుతూ ‘సర్కారు వారి పాట సినిమా బాలేదు అని సోషల్ మీడియా లో కొంతమంది దురాభిమానులు చాలా వైడ్ గా వ్యాప్తి చేసారు.. కానీ పబ్లిక్ లో ఆ టాక్ అసలు లేదు అని,సూపర్ హిట్ టాక్ ఉంది అని, పోకిరి మరియు దూకుడు కంటే కూడా ఈ సినిమానే బాగుంది అని..మహేష్ అప్పటికంటే ఈ సినిమాలోనే ఇంకా ఎక్కువ అందంగా కనిపించాడు..కాళీ సమయం లో ఎప్పుడు జిమ్ లోనే ఉంటాడు..అందుకే అంత అందంగా కనిపిస్తాడు’ అంటూ చెప్పుకొచ్చాడు సూపర్ స్టార్ కృష్ణ.

ఆయన నేరుగా పవన్ కళ్యాణ్ ఫాన్స్ పేరు ఎత్తకపోయిన కూడా ఈ సోషల్ మీడియా ట్రోల్ల్స్ ప్రస్తావన తెచ్చి పరోక్షంగా కామెంట్స్ చెయ్యడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..ఇప్పటికి సోషల్ మీడియా లో ఈ ఇరువురి హీరోల అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ జరుగుతూనే ఉన్నాయి..ఈ ఫ్యాన్ వార్స్ ఎప్పటికి ఫుల్ స్టాప్ పడుతుందో ఎవ్వరు అంచనా వెయ్యలేక ఉన్నారు..సోషల్ మీడియా లో అభిమానుల మధ్య ఎన్ని ఫ్యాన్ వార్స్ మరియు ట్రోల్ల్స్ జరుగుతున్నప్పటికీ, బాధ్యత గల మీడియా సినిమా థియేటర్స్ లో నడుస్తున్న సమయం లో నెగటివ్ ట్రోల్ల్స్ ని టెలికాస్ట్ చెయ్యడం నీచమైన చర్య అని సినీ విమర్శకులు విరుచుకుపడుతున్నారు..బ్రహ్మోత్సవం సమయం లో పవన్ కళ్యాణ్ ఫాన్స్ చేసిన ట్రోల్ల్స్ ని కూడా అప్పట్లో మీడియా చానెల్స్ ప్రసారం చేసాయి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…