
మన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ వంటి పాదాలను ఎత్తితే మనకి ముందు గుర్తుకు వచ్చే పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఒక్క హీరోని అభిమానిస్తే ఇంతలా అభిమానిస్తారు అనేదానికి ఉదాహరణ లాగ ఉంటాడు పవన్ కళ్యాణ్, ఆయన అట్టర్ ఫ్లాపు సినిమాలు కొంతమంది హీరోల సూపర్ హిట్ సినిమాలతో సమానం అని చెప్పడం లో ఎలాంటి సందేహము లేదు, ఇండస్ట్రీ ల ఆయనకి ఉన్న క్రేజ్ అలాంటిది,సారణంగా ఏ హీరో కి అయినా వరుసగా మూడు డిజాస్టర్ సినిమాలు పడితే క్రేజ్ తగ్గడం సహజం, కానీ పవన్ కళ్యాణ్ విషయం లో ఇది పూర్తిగా విరుద్ధం అని చెప్పొచ్చు , కెరీర్ ప్రారంభం లో అయాన్ సూపర్ సార్ధం సంపాదించినప్పటి నుండి నేటి వరుకు మధ్యలో ఎన్నో ఫ్లాప్స్ తగిలిన అభిమానుల్లో కసి పెరిగిందే కానీ ఇసుమంత కూడా నిరాశ చ్చోపలేదు మరియు ఆయన్ని వదలలేదు, అందుకే పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఒక్క వ్యక్తి కాదు, కోట్లాది మంది అభిమానుల గుండె చప్పుడు అని రాజమౌళి వంటి డైరెక్టర్స్ పలు సందర్భాలలో తెలిపారు, ఇంతతి క్రేజ్ ఉన్న హీరో అపజయం అనే పదమే ఎరుగని రాజమౌళి లాంటి దర్శకుడితో చెయ్యి కలిపితే బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని అద్భుతాలు జరుగుతాయో ఊహించడం కూడా మన తరం కాదు .
ఈ సెన్సషనల్ కాంబినేషన్ కి భీజం పంజా సినిమా సమయం లోనే పడింది, అప్పట్లో రాజమౌళి పవన్ కళ్యాణ్ తో ఒక్క పవర్ ఫుల్ సినిమా చేద్దాం అనుకున్నాడు, కానీ కొన్ని కారణాల వల్ల ఈ క్రేజీ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్ళలేదు,అయితే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియా లో వినిపిస్తున్న వార్త ఏమిటి అంటే త్వరలోనే పవన్ కళ్యాణ్ మరియు రాజమౌళి కాంబినేషన్ లో ఒక్క సినిమా రాబోతుంది, ఆర్ ఆర్ ఆర్ తర్వాత రాజమౌళి చెయ్యబొయ్యే సినిమా ఇదేనని సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగుతుంది, వాస్తవానికి ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక్క సినిమా చేయబోతున్నట్టు సోషల్ మీడియా లో వార్తలు వచ్చాయి, కానీ ఈలోపు పవన్ కళ్యాణ్ తో కూడా సినిమా చెయ్యబోతున్నాడు అని వార్తలు రావడం తో ఈ రెండిట్లో ఏది నిజం అనే దానిపై అటు పవన్ కళ్యాణ్ అభిమానులు, ఇటు మహేష్ బాబు అభిమానులు తలలు పట్టుకుంటున్నారు, కానీ ఇటీవల పవన్ కళ్యాణ్ ని రాజమౌళి రెండు మూడు సార్లు కలిశారు అట, ఆయనతో ఒక్క పవర్ ఫుల్ సబ్జెక్టు చెయ్యడానికి గత కొంతకాలం నుండి రాజమౌళి ప్రయత్నిస్తున్నాడట, త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావొచ్చు అని సోషల్ మీడియా లో గట్టిగ వినిపిస్తున్న వార్త.
ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భీమ్లా నాయక్ అనే సినిమా లో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఈ సినిమా షూటింగ్ ప్రసుతం హైదరాబాద్ లో శేరవేగంగా సాగుతుంది, ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన గ్లిమ్స్ ని ఆ చిత్ర యూనిట్ విడుదల చెయ్యగా దానికి అభిమానుల నుండి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఇక పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు విడుదల చేసిన భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ అయితే ఒక్క ప్రభంజనం సృష్టించింది, ఇప్పటియూకి ఈ పాటకి ప్రతి రోజు 20 లక్షల వ్యూస్ వస్తున్నాయి అంటే ఈ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పనవసరం లేదు, ఇక ఈ నెల 20 వ తారీఖున ఈ సినిమాలో నటిస్తున్న మరో హీరో రానా దగ్గుపాటి గ్లిమ్స్ ని కూడా విడుదల చెయ్యబోతున్నారు అట, అక్టోబర్ నెలలో షూటింగ్ మొత్తం పూర్తి చేసేసి జనవరి 12 వ తారీఖున ఈ సినిమాని అభిమానుల ముందుకి తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అట, మరి ఇప్పటికే ఎన్నో అంచనాలు రేపిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది చూడాలి.