Home Entertainment పవన్ కళ్యాణ్ ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ ఫుల్ ఎపిసోడ్ ఎక్సక్లూసివ్ గా మీకోసం

పవన్ కళ్యాణ్ ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ ఫుల్ ఎపిసోడ్ ఎక్సక్లూసివ్ గా మీకోసం

0 second read
0
0
1,339

ఎప్పుడూ టాక్ షోస్ కి రాని పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి నందమూరి బాలకృష్ణ ఆహా మీడియా లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ ప్రోగ్రాం లో ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు..ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ కూడా వారం రోజుల క్రితమే పూర్తి అయ్యింది..త్వరలోనే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో కూడా విడుదల కానుంది..ఈ ఎపిసోడ్ కేవలం సినీ వర్గాల్లోనే కాదు, రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది..పవన్ కళ్యాణ్ మరియు బాలకృష్ణ ఇద్దరూ కూడా రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళు కావడమే అందుకు కారణం..ఇప్పటికే అధికార వైసీపీ పార్టీ దీనిపై విమర్శలు చెయ్యడం ప్రారంభించింది..రెండు దశాబ్దాల సినీ కెరీర్ లో ఎప్పుడూ కూడా టాక్ షోస్ లో పాల్గొనని పవన్ కళ్యాణ్ ఇప్పుడు బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షో లో పాల్గొన్నాడు..దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు తెలుగు దేశం – జనసేన పార్టీలు కలిసి రాజకీయాలు చేస్తున్నాయి అని అంటూ వైసీపీ పార్టీ నాయకులు విమర్శలు చెయ్యడం మొదలు పెట్టేసారు.

మరోపక్క పవన్ కళ్యాణ్ మొట్టమొదటి టాక్ షో కాబట్టి ఆయన ఏమి మాట్లాడి ఉంటాడా అని అభిమానుల తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు..ప్రసారం కాకముందే ఇంత టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన ఈ ఎపిసోడ్, టెలికాస్ట్ తర్వాత ఇక ఎంతటి ప్రభంజనం సృష్టిస్తుందో అని విశ్లేషకులు అంచనాలు వెయ్యడం ప్రారంభించారు..తొలుత సంక్రాంతి కానుకగా ఈ ఎపిసోడ్ ని టెలికాస్ట్ చెయ్యాలని ఆహా మీడియా టీం అనుకుంది కానీ..ఇప్పుడు ఈ ఎపిసోడ్ కి ముందు ఇంకో రెండు ఎపిసోడ్స్ చేస్తే బాగుంటుందని..పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని ఫిబ్రవరి లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట..ఈ ఎపిసోడ్ తోనే రెండవ సీజన్ ముగియబోతుంది..అయితే ఈ ఎపిసోడ్ కి సంబంధించి అన్నీ సోషల్ మీడియా లో లీక్ అయ్యాయి..పవన్ కళ్యాణ్ బాలయ్య బాబు తో చేసిన చిట్ చాట్ మొత్తాన్ని పెట్టేసారు అభిమానులు.

ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ బాలయ్య బాబు తొడ గొట్టడం పై సెటైర్లు వేసినట్టు తెలుస్తుంది..పవన్ కళ్యాణ్ లోని ఫుల్ ఫన్ యాంగిల్ మొత్తం ఈ ఎపిసోడ్ లో చూడొచ్చు అట..అంతే కాకుండా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి కూడా బాలయ్య అనేక ప్రశ్నలు సంధించాడట..ముఖ్యంగా మూడు పెళ్లిళ్లు గురించి పవన్ కళ్యాణ్ ఈ ఎపిసోడ్ ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రజలకు క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది..ఇక పవన్ కళ్యాణ్ మధ్యలో ఫోన్ కాల్ ద్వారా త్రివిక్రమ్ మరియు రామ్ చరణ్ తో మాట్లాడడం ఈ ఎపిసోడ్ కి హైలైట్ గా నిలిచిందట..ఇక చివర్లో బాలయ్య బాబు కుమారుడు మోక్షజ్ఞ తేజ వచ్చి పవన్ కళ్యాణ్ తో ఫోటో దిగి వెళ్ళాడట..ఇవే ఈ ఎపిసోడ్ హైలైట్స్ అంటున్నారు..ఈ ఎపిసోడ్ కూడా ప్రభాస్ ఎపిసోడ్ లాగానే రెండు భాగాలుగా విడుదల చేస్తారట.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

రామ్ చరణ్ కోసం చేసిన అప్పులను పూడ్చేసిన ‘వారసుడు’ సినిమా

‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్‌లో చిరంజీవి ఓ మాట చెబుతూనే ఉన్నారు. ‘సరిగ్గ…