
బాలయ్య బాబు ఎప్పుడు హిట్ కొట్టిన బాక్స్ ఆఫీస్ బద్దలు అని అందరూ అంటూ ఉంటారు..ఆయన గత చిత్రాల ఫలితాలు ఒకసారి పరిశీలిస్తే అది నిజం అని నమ్మక తప్పదు..గత ఏడాది ఆయన ‘అఖండ’ సినిమా తో సృష్టించిన వసూళ్ల ప్రభంజనం ఎలాంటిదో ఇప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేరు..ఆ స్థాయి బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత బాలయ్య బాబు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది.దానికి తోడు ఆహా మీడియా లో ప్రసారమయ్యే ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ ప్రోగ్రాం సెన్సేషనల్ హిట్ అవ్వడం తో బాలయ్య ఉత్సాహం మరియుఈ సంతోషం కి అడ్డుకట్ట వేయలేకపోయారు అందరూ..అందుకే తన తదుపరి చిత్రం ‘వీర సింహా రెడ్డి’ సినిమాని సంక్రాంతికి మాత్రమే విడుదల చెయ్యాలంటూ పట్టుబట్టాడు..వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్ నెలలోనే విడుదల కావాల్సి ఉంది..కానీ సంక్రాంతికి చిరంజీవి సినిమా విడుదల అవుతుంది అని తెలుసుకున్న బాలయ్య చిరంజీవి తో పోటీ పడడానికి సిద్ధం అయ్యాడు.
మరోపక్క ఈ రెండు సినిమాలను ‘మైత్రి మూవీ మేకర్స్’ నిర్మించింది..ఇలా బాలయ్య బాబు మొండిపట్టు పట్టి సంక్రాంతికి రావాలి అని మారం చెయ్యడం తో వాళ్ళు వేరే దారిలేక ‘వీర సింహా రెడ్డి’ ని కూడా పొంగల్ రేస్ లోకి తీసుకొచ్చారు..ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఒకే బ్యానర్ నుండి రెండు సినిమాలను ఒక్క రోజు తేడా తో విడుదల చెయ్యాల్సిన పరిస్థితి ఎప్పుడు రాలేదు..అలాంటి పరిస్థితి రావడానికి కారణం బాలయ్య..చిరంజీవి వరుస ఫ్లాప్స్ తో ఉన్నాడు..ఆయన మార్కెట్ డౌన్ అయ్యింది..ప్రస్తుతం నా మార్కెట్ బాగా పెరిగింది.
చిరంజీవి మీద తనదే పై చెయ్యి అనిపించుకోవడానికి బాలయ్య అలా చేయించాడని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న వార్త.కానీ చివరికి కథ అడ్డం తిరిగింది..ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’ మొదటి వారం వసూళ్లు ‘వీర సింహా రెడ్డి’ క్లోసింగ్ వసూళ్లతో సమానం అయ్యే ప్రమాదం ఏర్పడింది..ఇప్పుడు కాకుండా ఈ చిత్రాన్ని డిసెంబర్ నెలలో విడుదల చేసి ఉంటే కచ్చితంగా పెద్ద హిట్ అయ్యేదని అంటున్నారు ట్రేడ్ పండితులు..పంతానికి పోయి బాలయ్య బాబు మొదటికే మోసం తెచ్చుకున్నాడు అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియా లో వాపోతున్నారు.