Home Entertainment ‘పనికిమాలిన నామినేషన్స్ చెయ్యడం మానుకో’ అంటూ శ్రీ సత్య కి వార్నింగ్ ఇచ్చిన తండ్రి

‘పనికిమాలిన నామినేషన్స్ చెయ్యడం మానుకో’ అంటూ శ్రీ సత్య కి వార్నింగ్ ఇచ్చిన తండ్రి

0 second read
0
0
309

బిగ్ బాస్ హౌస్ ప్రస్తుతం ఎంత రసవత్తరంగా సాగుతుందో మన అందరం చూస్తూనే ఉన్నాము..రోజుకొక్క ఆసక్తికరమైన టాస్కు తో మన ముందుకి వస్తూ తిరుగులేని వినోదం ని పంచుతూ రికార్డు స్థాయి లో TRP రేటింగ్స్ ని సొంతం చేసుకుంటున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇప్పుడు చివరి దశకి చేరుకుంది..ఈ వారం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి సంబంధించిన కుటుంబీకులు హౌస్ లో ఒక్కొక్కరిగా ఎంటర్ అవుతున్నారు..నిన్న ఆది రెడ్డి భార్య బిడ్డ హౌస్ లోకి వచ్చి సందడి చేసారు..ఈ బ్లాక్ మొత్తం చాలా ఎమోషనల్ గా సాగింది..ఆ తర్వాత రాజ్ తల్లి అడుగుపెట్టింది..చాలా కాలం తర్వాత కొడుకుని చూడగానే ఆమె ఏడ్చేసింది..వీళ్లిద్దరి తర్వాత ఈరోజు ఎపిసోడ్ లో ఫైమా తల్లి అడుగుపెట్టింది..ఈమె హౌస్ మేట్స్ తో బాగా కలిసిపోయాయి జోక్స్ గట్టిగానే పేల్చింది..ఇవన్నీ ఒక ఎత్తు అయితే శ్రీ సత్య తల్లదండ్రులు హౌస్ లోకి అడుగుపెట్టడం చాలా స్పెషల్ గా అనిపించింది.

ఎందుకంటే శ్రీ సత్య తల్లికి కాళ్ళు విరిగిపోయి చాలా కాలం అయ్యింది..ఆమెకి సంబంధించి అన్ని విషయాలు కూడా తండ్రి చూసుకుంటూ వస్తున్నాడు..శ్రీ సత్య తండ్రి గారే తన భార్య ని వీల్ చైర్ లో తోసుకుంటూ వచ్చాడు..ఈ కాలం లో ఒక భర్త తన భార్య కి ఈ స్థాయి లో సేవలు చెయ్యడం అంటే మాములు విషయం కాదు..అయితే వీళ్ళిద్దరిని చూసిన వెంటనే శ్రీ సత్య బాగా ఎమోషనల్ అయిపోతుంది..తన చేతుల మీదుగా తన తల్లికి అన్నం ముద్దలు తినిపిస్తుంది..ఆమె కళ్ళలో ఉన్న ఆనందం చూస్తే మన కళ్ళలో నీళ్లు తిరుగుతాయి..అలా శ్రీ సత్య తల్లిదండ్రులు హౌస్ లోకి అడుగుపెట్టగానే బిగ్ బాస్ హౌస్ వాతావరణం మొత్తం ఎమోషనల్ గా మారిపోతుంది..ఇక ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరితో కూడా వీళ్లిద్దరు ముచ్చటిస్తారు.,అలా కాసేపు భావోద్వేగాల నడుమ సాగిన ఈ షో శ్రీ సత్య మరియు ఆమె తండ్రి మధ్య చోటు చేసుకున్న ఒక సంభాషణ నవ్వులు పూయిస్తుంది.

ముందుగా శ్రీ సత్య రేవంత్ గురించి తన తండ్రికి చెప్తూ ‘మొదటి వారం నామినేషన్ ఇతను ఎంత సిల్లీ గా వేశాడో తెలుసా..మేమిద్దరం మంచిగా మాట్లాడుకుంటున్నాం..కానీ నాతో కనెక్షన్ కుదర్లేదట..అందుకే నామినేట్ చేసాడు’ అని చెప్తుంది శ్రీ సత్య..అప్పుడు వెంటనే శ్రీ సత్య వాళ్ళ నాన్న మాట్లాడుతూ ‘నువ్వు కూడా పనికిమాలిన నామినేషన్స్ చాలానే చేసావు లే ‘ అని గాలి తీస్తాడు..దెబ్బకి షాక్ అయ్యి నోరెళ్లబెడుతుంది శ్రీ సత్య..అలా ఈరోజు ఎపిసోడ్ సాగిపోయింది..మధ్యలో కెప్టెన్సీ టాస్కు లో భాగంగా బిగ్ బాస్ ఈ వారం ఎంటర్టైన్మెంట్ టాస్కు ఇచ్చాడు..’బిగ్ బాస్ కోచింగ్ సెంటర్’ పేరిట ఒక టాస్కు ఇచ్చి డాన్స్ మాస్టర్ గా ఆది రెడ్డిని, సింగింగ్ మాస్టర్ గా రాజ్ ని,ఇంగ్లీష్ మాస్టర్ గా ఫైమా ని..మేకప్ టీచర్ గా శ్రీ సత్య ని నియమిస్తాడు..మొత్తం ఎంటర్టైన్మెంట్ తో కడుపుబ్బా నవించేలా ఈ టాస్కు కొనసాగుతూ ఈరోజు కూడా అదిరిపొయ్యే వినోదం ని పంచింది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…