Home Entertainment పక్కా కమర్షియల్ ఫుల్ HD మూవీ ఎక్సక్లూసివ్ గా మీకోసం

పక్కా కమర్షియల్ ఫుల్ HD మూవీ ఎక్సక్లూసివ్ గా మీకోసం

4 second read
0
3
11,282

టాలీవుడ్ లో మంచి మాస్ ఇమేజి ఉన్న హీరోలలో ఒకరు గోపీచంద్..తొలివలపు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యి, ఆ తర్వాత విలన్ గా జయం, నిజం మరియు వర్షం వంటి సినిమాలలో మెప్పించి ఆ తర్వాత మళ్ళీ హీరో గా వరుస మాస్ సినిమాలు చేసి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి మాస్ ఇమేజి సంపాదించుకున్నాడు..అయితే గత కొంత కాలం నుండి గోపీచంద్ కి సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేదు.మధ్యలో అడపదడపా కొన్ని హిట్ సినిమాలు వచ్చినప్పటికీ అవి ఆయన రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్స్ కావు అనే చెప్పాలి..అలాంటి సమయం లో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో ముందుకి దూసుకుపోతున్న టాలీవుడ్ క్రేజీ యంగ్ డైరెక్టర్ మారుతీ తో పక్కా కమర్షియల్ అనే సినిమా చేసాడు..పక్కా హిట్ అవుతుంది అనే భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకి వచ్చింది..కానీ ఆ అంచనాలను అందుకోవడం లో ఈ సినిమా భారీ గా విఫలం అయ్యింది..కనీసం ఓపెనింగ్స్ కూడా దక్కించుకోలేని ఈ సినిమా వారం తిరగకముందే క్లోసింగ్ కి పడిపోయింది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అన్ని ప్రాంతాలకు కలిపి దాదాపుగా 20 కోట్ల రూపాయలకు జరిగింది..కానీ ఫుల్ రన్ లో కనీసం 11 కోట్ల రూపాయిలు కూడా వసూలు చేసే అవకాశం కనిపించడం లేదు..సీటిమార్ సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ లోకి వచ్చిన గోపీచంద్ ని ఫ్లాప్ ట్రాక్ లోకి నెట్టేసింది ఈ సినిమా..కామెడీ సరిగా వర్కౌట్ అవ్వకపోవడం..పాటలు సరిగా లేకపోవడమే ఈ సినిమాకి పెద్ద మైనస్ అని చెప్పొచ్చు..ఇక ఇటీవల కాలం లో థియేటర్స్ లో అట్టర్ ఫ్లాప్ అయినా సినిమాలను వెంటనే OTT లో వదిలేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..అలా ముందుగా OTT లో వదిలితే అనుకున్న దానికంటే భారీ మొత్తం డబ్బులు ఇస్తారట..దీనితో నిర్మాతకి థియేట్రికల్ ద్వారా వచ్చిన నష్టాలు OTT ద్వారా పూడుతాయి..ఇప్పుడు సీటిమార్ సినిమాని కూడా మూడు వారాల్లోపే OTT లో విడుదల చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నారట ఆ చిత్ర నిర్మాతలు బన్నీ వాసు మరియు అల్లు అరవింద్..ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ మరియు ఆహా భారీ మొత్తం మీద కొనుగోలు చేసారు..కొత్త రూల్స్ ప్రకారం తొలుత థియేటర్స్ లో విడుదలైన 50 రోజుల తర్వాత OTT లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు..కానీ థియేట్రికల్ రన్ రాకపోవడం తో మూడు వారాల్లోపే OTT లో విడుదల చెయ్యాలని అనుకుంటున్నారట.

ఇక ఈ సినిమా తర్వాత గోపీచంద్ ప్రస్తుతం శ్రీవాస్ అనే దర్శకుడితో ఒక సినిమా చెయ్యబోతున్నాడు..ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతుంది..ఈయన గతం లో గోపీచంద్ తో లక్ష్యం మరియు లౌక్యం వంటి సినిమాలు తీసాడు..ఈ రెండు సినిమాలు కూడా గోపీచంద్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి..ఇప్పుడు ఈ హిట్ కాంబినేషన్ నుండి వస్తున్న మూడవ సినిమా కావడం తో ఈ మూవీ పై భారీ అంచనాలే పెట్టుకున్నాడు గోపీచంద్..ఈ సినిమా తర్వాత ఆయన తమిళ దర్శకుడు హరి తో కూడా ఒక సినిమా చేయబోతున్నాడని లేటెస్ట్ గా ఫిలిం నగర్ నుండి వినిపిస్తున్న టాక్..హరి తమిళ్ లో టాప్ మోస్ట్ డైరెక్టర్..అక్కడి స్టార్ హీరోలందరికీ ఈయన బీహారు బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందించి ఉన్నాడు..మనకి బోయపాటి శ్రీను ఎలాగో..వాళ్లకి హరి అలాగా..గోపి చంద్ లాంటి మాస్ హీరో అలాంటి మాస్ డైరెక్టర్ తో తీస్తే కచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ పడుతుంది అని ఆయన అభిమానులు అనుకుంటున్నారు..చూడాలి మరి ఈ సినిమా అయినా గోపీచంద్ కి సరైన హిట్ ని ఇస్తుందా లేదా అనేది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…