
ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షోతో పాపులర్ అయిన వారిలో కిర్రాక్ ఆర్పీ ఒకడు. ఈ షోలో తన టీమ్ పేరునే తన ఇంటి పేరుగా ఆర్పీ మార్చుకున్నాడు. జబర్దస్త్ కామెడీ షో వల్ల క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఇటీవల జబర్దస్త్ కార్యక్రమానికి కిర్రాక్ ఆర్పీ దూరమయ్యాడు. దీంతో రెస్టారెంట్ బిజినెస్‌ను అతడు ప్రారంభించాడు. హైదరాబాద్ నగరంలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో కొత్తగా కర్రీ పాయింట్ ఓపెన్ చేశాడు. కిర్రాక్ ఆర్పీకి మంచి క్రేజ్ ఉండటంతో ఈ కర్రీ పాయింట్‌కు ఉచిత ప్రచారం లభించింది. ప్రారంభం రోజు నుంచే జనాలు కర్రీస్ కోసం క్యూ కట్టారు. కర్రీ పాయింట్‌కు ఆదరణ బాగా పెరిగింది. ఆర్పీ కర్రీ పాయింట్‌కు క్రమంగా కస్టమర్ల తాకిడి పెరగడంతో సమీపంలో ట్రాఫిక్ జామ్ కూడా అయ్యింది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చి ఆర్పీ కర్రీ పాయింట్‌లో చేపల పులుసు కర్రీని తీసుకువెళ్తున్నారు. అయితే ఊహించని రీతిలో ఈ కర్రీ పాయింట్ మూత పడింది.
అవును మీరు విన్నది నిజమే. ఎక్కడైనా బిజినెస్ పెరిగితే ఎవరైనా ఆనందిస్తారు. కానీ కిర్రాక్ ఆర్పీ మాత్రం తన కర్రీ పాయింట్‌ను క్లోజ్ చేసుకున్నాడు. దీనికి వేరే కారణం ఉందని పలువురు అంటున్నారు. తన కర్రీ పాయింట్‌కు ఆదరణ పెరగడం, తాకిడి ఎక్కువ కావడంతో వారికి సరిపడ కర్రీస్‌ని సిబ్బంది ప్రీపేర్ చేయలేకపోతున్నారు. వంటకాలు తక్కువ, జనం ఎక్కువ కావడంతో సరైన సమయంలో పార్సెల్ చేయలేకపోతున్నారు. ఈ నిర్వాహణ కష్టంగా మారిన నేపథ్యంలో కర్రీ పాయింట్‌ను కిర్రాక్ ఆర్పీ క్లోజ్ చేశాడు. అయితే ఇది తాత్కాలికం మాత్రమే అని.. త్వరలో కొన్ని మార్పులు చేసి త్వరలో రెస్టారెంట్‌ను ప్రారంభించాలని ఆర్పీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కిచెన్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు షాప్‌కు కీలక మార్పులు చేసి మళ్లీ రెస్టారెంట్ ఓపెన్ చేయాలని భావిస్తున్నానని ఆర్పీ చెప్పుకొచ్చాడు.
మరోవైపు తన కర్రీ పాయింట్‌లో పనిచేసే వర్కర్లు, మాస్టర్లను పెంచాల్సిన అవసరం ఉందని ఆర్పీ చెప్పాడు. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి ఉందన్నాడు. ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కర్రీ పాయింట్‌ను అప్ డేట్ చేయాల్సిన అవసరం ఉందని.. అందుకే నెల్లూరు పెద్దారెడ్డి చేపలపులుసు కర్రీ పాయింట్‌ను తాత్కాలికంగా మూసివేసినట్లు ఆర్పీ తెలిపాడు. నెల్లూరు మహిళలతోనే చేపల పులుసు వండించాలని ప్లాన్ చేశామని చెప్పుకొచ్చాడు. అడిషన్స్ పెట్టి చేపల పులుసు టేస్ట్ చేసి వంట మాస్టర్లను ఎంపిక చేస్తామని వివరించాడు. హైదరాబాద్‌కు వచ్చే ఆలోచన ఉంటే వాళ్లకు అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశాడు. కాగా ఈ రెస్టారెంట్ బిజినెస్ తర్వాత కిరాక్ ఆర్పీ కాస్తా చేపల పులుసు ఆర్పీ అయిపోయాడు. మరోవైపు చేపలపులుసు అమ్మకాలతో ఒక్క రోజులో కిరాక్ ఆర్పీ 10 లక్షలు సంపాదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంటే నెలకు మూడు కోట్ల రూపాయలు సంపాదిస్తు్న్నట్లు తెలుస్తోంది. ఖర్చులు పోను ఆర్పీకి బాగానే గిట్టుబాటు అవుతుందని అతడి సన్నిహితులు చెప్తున్నారు.