
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలుమూలలకు విస్తరింపచేసిన దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఇండియా లో ఉన్న సూపర్ స్టార్స్ అందరికీ సూపర్ స్టార్ అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఒక దర్శకుడిగా ఎన్ని ఉన్నత శిఖరాలు చూడాలో అన్నీ చూసేసాడు.భవిష్యత్తులో ఆ రేంజ్ ని అందుకోవడం కూడా అనితరసాధ్యమైనది.అలాంటి స్టార్ స్టేటస్ దక్కించుకున్న రాజమౌళి కేవలం దర్శకుడిగా మాత్రమే కాదు, నటుడిగా కూడా కొన్ని సినిమాలలో తళుక్కుమని మెరిశాడు.ఇక ఆయన నిర్మాతగా మారి ‘విశ్వామిత్ర క్రియేషన్స్’ బ్యానర్ ని స్థాపించి యమదొంగ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాని కూడా తీసాడు.కానీ ఆ సినిమా తర్వాత ఆ బ్యానర్ పై ఆయన ఎలాంటి సినిమా కూడా తెరకెక్కించలేదు.దర్శకుడిగా పూర్తి స్థాయి ఫోకస్ పెట్టలేను అనే ఉద్దేశ్యం తోనే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.
అయితే ఇప్పుడు తనకి వచ్చిన అంతర్జాతీయ క్రేజ్ ని సరిగ్గా ఉపయోగించుకొని క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నాడు.అందుకే త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబు తో తాను తియ్యబోతున్న పాన్ వరల్డ్ చిత్రానికి సహానిర్మాతగా వ్యవహరించబోతున్నట్టు సమాచారం.ఈ సినిమాకి నిర్మాతగా KS రామారావు వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఇప్పుడు ఆయనతో పాటుగా రాజమౌళి కూడా కలిసాడు.వెయ్యి కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి రాజమౌళి పెట్టబోతున్న బడ్జెట్ ఎంతో మరి.తాను నిర్మాతగా వ్యవహరించకుండా, కేవలం దర్శకత్వం వహిస్తేనే ప్రొమొతిఒన్స్ విషయం లో వేరే లెవెల్ చూపించే రాజమౌళి, ఇక నిర్మాతగా వ్యవహరిస్తే ఏ రేంజ్ ప్రొమోషన్స్ చేస్తాడో ఊహించుకోవచ్చు.ప్రస్తుతం అంతర్జాతీయ అవార్డ్స్ ని అందుకోవడం లో ఫుల్ బిజీ గా ఉన్న రాజమౌళి, ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ అయ్యేంత వరకు మహేష్ సినిమా గురించి అసలు ఆలోచించదట.
ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ అయిన తర్వాతనే స్క్రిప్ట్ ని చెక్కడం ప్రారంభిస్తాడట.యాక్షన్ అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కున్న ఈ సినిమాని మహేష్ స్టైల్ కి తగ్గట్టే మలిచి తియ్యబోతున్నాడట..రాజమౌళి.మరో మూడు నెలల్లో స్క్రిప్ట్ ని పూర్తి చేసి ఈ ఏడాది చివరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.