
గత ఏడాది ‘భింబిసారా’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి నందమూరి అభిమానులకు మంచి కిక్ ని ఇచ్చిన కళ్యాణ్ రామ్, ఈ ఏడాది ‘అమిగోస్’ చిత్రం ద్వారా మన ముందుకి వచ్చాడు..డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను ఎప్పుడూ అలరించే కళ్యాణ్ రామ్ ఈసారి కూడా మరో ఆసక్తికరమైన సబ్జెక్టు తో మన ముందుకి వచ్చాడు..ట్రైలర్ ని చూసి అభిమానులు మరియు ప్రేక్షకులు ఈ సినిమా మీద ఎలాంటి అంచనాలు అయితే పెట్టుకున్నారో, ఆ అంచనాలను ఈ చిత్రం అందుకోవడం లో సక్సెస్ అయ్యింది.
కానీ ఈ కలెక్షన్స్ రావడానికి బూస్ట్ రప్పించే టాక్ అయితే రాలేదనే చెప్పాలి..ఒక రేంజ్ హిట్ టాక్ అయితే రాలేదు, ఆలా అని ఫ్లాప్ టాక్ కూడా రాలేదు, ఎదో సరికొత్తగా ట్రై చేసాడు అనే టాక్ మాత్రం బాగానే వచ్చింది, అందుకే ఓపెనింగ్స్ చాలా డల్ గా వచ్చాయి..మొదటి రోజు ఈ చిత్రానికి విడుదల ముందు అడ్వాన్స్ బుకింగ్స్ అసలు జరగలేదు..అది చూసి అభిమానులు మరియు విశ్లేషకులు సినిమా జానర్ అలాంటిది కదా, అడ్వాన్ బుకింగ్స్ పెద్దగా ఉండదు అనేది ఊహించిందే, కానీ టాక్ వస్తే మాత్రం జనాలు కదులుతారని అనుకున్నారు..కానీ డీసెంట్ టాక్ వచ్చినప్పటికీ కూడా జనాలు ఈ చిత్రాన్ని పట్టించుకోలేదు..మొదటి రోజు మొత్తానికి కలిపి ఈ సినిమా కనీసం నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్, రెండు కోట్ల రూపాయిల షేర్ ని కూడా వసూలు చేయలేకపోయిందని అంటున్నారు.
అది కూడా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వసూళ్లు, కేవలం తెలుగు రాష్ట్రాల నుండి కాదు, ‘భింబిసారా’ చిత్రానికి మొదటి రోజు దాదాపుగా 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి, కానీ అమిగోస్ ఫుల్ రన్ లో అయినా ఆ రేంజ్ వసూళ్లు వస్తాయా అంటే డౌట్ అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు..చూడాలి మరి ఈ సినిమా రేంజ్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో అనేది.