
ఇటీవల కాలం లో టాలీవుడ్ లో టీజర్ మరియు ట్రైలర్ తో ప్రతి సినీ అభిమానికి ఎంతో ఆసక్తి కలిగించేలా చేసిన సినిమాలలో ఒకటి కార్తికేయ 2 ..నిఖిల్ కి హీరో గా ఒక స్థిరమైన మార్కెట్ ని ఏర్పర్చిన కార్తికేయ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం పై మొదటి నుండి భారీ అంచనాలే ఉన్నాయి..ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ప్రతి ఒక్కటి ఆకట్టుకుంటూ వాస్తు ఆ అంచనాలను మరింత పెంచేలా చేసాయి..దానికి ఉదాహరణ ఈ సినిమా కి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నా అడ్వాన్స్ బుకింగ్స్ ని చూపించి చెప్పవచ్చు ఈ సినిమాకి ఎలాంటి క్రేజ్ ఉంది అనేది..ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకి అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి..ఇటీవల కాలం లో ఒక మీడియం హీరో సినిమాకి ఈ స్థాయి బుకింగ్స్ ఎప్పుడు జరగలేదు అనే చెప్పాలి..సీక్వెల్ క్రేజ్ కూడా అందుకు కారణం అని చెప్పొచ్చు.
ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ప్రివ్యూ షోస్ ఇప్పటికే కొన్ని ఓవర్సీస్ ప్రాంతాలలో ప్రారంభం అయిపోయాయి..ఈ షోస్ నుండి వస్తున్న టాక్ ని చూస్తుంటే నిఖిల్ మరో భారీ హిట్ కొట్టేసాడనే చెప్తున్నాయి..కెరీర్ ప్రారంభం నుండి వుబ్బినమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్న నిఖిల్ ఈ సినిమా తో అదే ప్రయత్నం చేసాడు..ఆ ప్రయత్నం మరోసారి సక్సెస్ అయినట్టు తెలుస్తుంది..మిస్టరీ ని ఛేదించే కథాంశాలు ఇప్పటి వరుకు బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయినట్టు చరిత్ర లో లేదు..కార్తికేయ 2 కూడా అలాంటి కథాంశం తో తెరకెక్కిన చిత్రమే..శ్రీకృష్ణుడి తన అవతారం ని ముగించుకున్న తర్వాత ఆయన వంశం ఎలా కొనసాగింది..ఆయన వంశస్తులు ఏమయ్యారు..ఆయన వంశానికి చెందిన విలువైన ఆభరణాలు , కిరీటాలు ఏమైయ్యాయి వంటి అంశాల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది..డైరెక్టర్ చందు మొండేటి ఈ సినిమా ని ఆద్యంతం ఉత్కంఠ కలిగించేలా ప్రేక్షలను ప్రతి పది నిమిషాలకోసారి థ్రిల్ కి గురి చేసేలా ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడట.
ఇటీవల కాలం లో రొటీన్ కమర్షియల్ సినిమాలకంటే ప్రేక్షకులు కథలో కొత్తదనం ఉన్న సినిమాలను నెత్తిన పెట్టుకొనిమరీ ఆరాధిస్తున్నారు..దానికి ఉదాహరణే ఇటీవల విడుదలైన భింబిసారా మరియు సీతారామం సినిమాలు..ఈ చిత్రాలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై టాలీవుడ్ గడ్డు కాలం ని ఎదురుకుంటున్న సమయం లో ఎలాంటి విజయాలుగా నిలిచాయి మన అందరికి తెలిసిందే..ఇప్పుడు కార్తికేయ 2 కూడా అదే విధంగా అలరించబోతుంది అని తెలుస్తుంది..ప్రీమియర్ షో నుండే అద్భుతమైన టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా రేపు ఇక ఏ రేంజ్ టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి..ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇక కాశ్మీర్ ఫైల్స్ వంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో నటించిన అనుపమ్ ఖేర్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రని పోషించాడు..తెలుగు తో పాటు హిందీ , తమిళం మరియు మలయాళం వెర్షన్స్ లో కూడా ఈ సినిమా ఘనంగా విడుదల కాబోతుంది.