
ఇటీవల కాలం లో మన అందరినీ ఎంతో బాధ పెట్టిన సంఘటన నందమూరి తారకరత్న చనిపోవడం.ఎంతో ఆరోగ్యం గా ఉండే ఆయన తన బావ నారాలోకేష్ తెలుగు దేశం పార్టీ తరుపున చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభం లో పాల్గొని, అక్కడికక్కడే గుండెపోటు వచ్చి కుప్పకూలిపోవడం, ఆ తర్వాత ఆయనని బెంగళూరు ‘నారాయణ హృదయాలయ’ హాస్పిటల్స్ లో చేర్పించడం,ఆ తర్వాత 20 రోజుల పాటు ఆయన చికిత్స తీసుకుంటూ మరణించడం వంటి ఘనటనలు సినీ అభిమానులను ఎంతో దిగ్బ్రాంతికి గురి చేసింది.ముఖ్యంగా నందమూరి కుటుంబ సబ్యులకు ఎంత బాధగా ఉంటుందో మాటల్లో చెప్పలేము.ఇప్పటికీ వాళ్ళు ఈ దుఃఖం నుండి కోలుకోలేదు.ముఖ్యంగా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి, తన భర్త ని తల్చుకుంటూ ప్రతీ రోజు పెడుతున్న పోస్టులు, చివరి రోజుల్లో తన భర్త తో కలిసున్న మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ కంటతడి పెడుతుంది.ఆమెని ఎలా ఓదార్చాలో తెలియక అభిమానులు ఏమి చెయ్యలేక కామెంట్స్ రూపం లో ధైర్యం చెప్తున్నారు అంతే.
అయితే రీసెంట్ గా ఆమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో తారకరత్న ని తల్చుకుంటూ పెట్టిన ఒక పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది.ఆమె మాట్లాడుతూ ‘మన ఇద్దరి స్నేహం ప్రేమగా మారింది.నువ్వు నన్ను పెళ్లి చేసుకుందామా అని అడిగినప్పుడు నేను ఎంతో భయపడ్డాను.ఇది సాధ్యం అవుతుందా లేదా అని,కానీ నువ్వు మాత్రం పెళ్లి చేసుకోవాలనే స్పష్టమైన ఆలోచనతోనే ముందుకు వెళ్ళావు, మన ఇద్దరం తీసుకున్న నిర్ణయం మన వాళ్ళందరిని దూరం చేసింది.మానిస్కంగా ఎన్నో ఒత్తిడులను ఎదుర్కొని, ఆర్థికంగా కూడా ఎన్నో కష్టాలను అనుభవించాము.కొందరి ద్వేషాలను (అత్తమామలను ఉద్దేశిస్తూ) మనం తట్టుకోలేక ఎంతో మానసిక వేదనకు గురయ్యాము.మన కుటుంబాలు దూరం అవ్వడం తో మనకంటూ ఒక్క పెద్ద కుటుంబం కావాలని కోరుకున్నావు.బిడ్డలు పుట్టిన తర్వాత మన జాతకమే మారిపోయింది.సంతోషం గా జీవించడం ప్రారంభించాము, ఇంతలోపే నువ్వు మమల్ని వదిలి వెళ్ళిపోయావు.నిన్ను తలచుకొని క్షణం అంటూ లేదు’ అంటూ అలేఖ్య రెడ్డి పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది.
ఆమె మాటలను బట్టీ చూస్తుంటే తారకరత్న తల్లితండ్రులు ఆయనని ఎంత మానసిక వేదనకి గురి చేసారో అర్థం అవుతుంది.బ్రతికి ఉన్నన్ని రోజులు కొడుకుని దగ్గరకు తియ్యలేదు కానీ, చనిపోయిన తర్వాత మాత్రం అందరూ వచ్చి ఏడ్చారు,తారకరత్న కి తలకొరివి పెట్టింది కూడా ఆయన తండ్రే.బ్రతికి ఉన్నన్ని రోజులు తారకరత్నతో ప్రేమగా ఉంది ఉండుంటే ఎంత మంచి జ్ఞాపకాలు అర్థానికి మిగిలి ఉండేది.బ్రతికి ఉన్నన్ని రోజులు మనిషి విలువ తెలియదు.చనిపోయిన తర్వాతే తెలుస్తాది అని అనేది ఇందుకే.