Home Entertainment నా తండ్రితో నాకు పెళ్లి చేసారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన యాంకర్ శ్రీముఖి

నా తండ్రితో నాకు పెళ్లి చేసారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన యాంకర్ శ్రీముఖి

0 second read
0
0
2,047

టీవీ రంగంలో అందమైన యాంకర్ అంటే ఎవరైనా శ్రీముఖి పేరు చెప్పాల్సిందే. సుమ నంబర్‌వన్ యాంకర్ అయినా గ్లామర్ విషయంలో మాత్రం శ్రీముఖి క్రేజ్ తెచ్చుకుంది. అతి తక్కువ కాలంలో తన అందచందాలతో శ్రీముఖి అభిమానులను అలరిస్తోంది. సోషల్ మీడియాలోనూ శ్రీముఖి నిత్యం అందుబాటులో ఉంటుంది. తన ఫోటోలను అప్‌లోడ్ చేస్తూ ఇంటరాక్ట్ అవుతోంది. అయితే శ్రీముఖి విషయంలో రూమర్స్ కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పాలి. ఆమె పెళ్లి, ఎఫైర్‌కు సంబంధించిన వార్తలు నిత్యం హల్‌చల్ చేస్తుంటాయి. మరోసారి శ్రీముఖి పెళ్లి వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆమె ఓ బిజినెస్ మేన్‌ను పెళ్లి చేసుకుంటున్నట్లు విస్తృతంగా ప్రచారం జరిగింది. కొందరు ఫోటోలతో సహా శ్రీముఖి పెళ్లాడే వరుడు ఇతడే అంటూ ప్రచారం చేశారు. అయితే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూసి శ్రీముఖి కూడా షాకైంది. దీంతో తన పెళ్లి వార్తలపై జరుగుతున్న ప్రచారంపై స్పందించింది.

బ్యూటిఫుల్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న శ్రీముఖి తన పెళ్లి వార్తలపై వచ్చిన రూమర్స్‌ను ఖండించింది. చాలా రోజులుగా తన పెళ్లి గురించి అనేక రకాల వార్తలు వైరల్ అయ్యేలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకసారి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటారని.. మరొకసారి తనకు తండ్రి సమానమైన వ్యక్తి ఫోటో బ్లర్ చేసి త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని ఇష్టం వచ్చినట్లుగా ప్రచారాలు చేస్తున్నారని.. మరీ ఇంత దారుణంగా వార్తలు రాయాలా అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యింది. తన పెళ్లి వార్తలు చూసి తనకు విసుగొచ్చిందని.. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదని శ్రీముఖి వివరణ ఇచ్చింది. అంతేకాకుండా తనకు పెళ్లి ఇంకా ఫిక్స్ కాలేదని కాస్త ఘాటుగా సమాధానం ఇచ్చింది. ఒకవేళ పెళ్లి చేసుకుంటే మీడియాకు చెప్పే చేసుకుంటానని తెలిపింది. తనకు మరో రెండు మూడేళ్ల వరకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని శ్రీముఖి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తన ఫోకస్ పూర్తిగా తన కెరీర్‌పైనే ఉందని సెలవిచ్చింది.

అటు తన మాటలతో, హావభావాలతోనే కాకుండా గ్లామర్ తో కూడా శ్రీముఖి ఎంతో అందంగా ఓ వర్గం కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. ఎలాంటి షో చేసినా కూడా సక్సెస్ అవ్వాల్సిందే అనే విధంగా శ్రీముఖి తన క్రేజ్ అయితే పెంచుకుంది. శ్రీముఖి టీవీ షోల కంటే ముందు కొన్ని సినిమాల్లో నటించింది. సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్‌లో నటిస్తూ తన క్రేజ్ పెంచుకుంటూ వచ్చింది. ముఖ్యంగా కొంతమంది స్టార్ హీరోల సినిమాల్లో కూడా ప్రాముఖ్యత కలిగిన పాత్రలలో కనిపించింది. అల్లు అర్జున్ నటించిన జులాయి సినిమాతో శ్రీముఖి వెండితెరకు పరిచయం అయింది. దీని తర్వాత నేను శైలజ, జెంటిల్‌మెన్ వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించింది ప్రేమ ఇష్క్ కాదల్, బాబు బాగా బిజీ వంటి సినిమాల్లోనూ లీడ్ రోల్ కూడా చేసింది. వెండితెరపై నటిస్తున్న సమయంలోనూ అదుర్స్ అనే షోతో యాంకర్‌గా మారింది. పటాస్ షోతో అభిమానుల్లో క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత బిగ్‌బాస్ షోకు వెళ్లింది. రామ్ నటించిన నేను శైలజ సినిమాలో హీరో చెల్లెలి పాత్రలో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. అటు కేవలం పాజిటివ్ రోల్స్ మాత్రమే కాకుండా సీరియస్ నెగిటివ్ రోల్స్ చేసే ప్రయత్నం కూడా శ్రీముఖి చేస్తోంది. అలాగే లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా నటించాలని భావిస్తోంది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

రామ్ చరణ్ కోసం చేసిన అప్పులను పూడ్చేసిన ‘వారసుడు’ సినిమా

‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్‌లో చిరంజీవి ఓ మాట చెబుతూనే ఉన్నారు. ‘సరిగ్గ…