
బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ షోతో పరిచయమైన సుడిగాలి సుధీర్ తెలుగు రాష్ట్రాలలో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. కమెడియన్‌గా, మెజీషియన్‌గా, డ్యాన్సర్‌గా, యాంకర్‌గా అన్ని రంగాలలో తనదైన ప్రతిభ చూపి ముందుకు దూసుకుపోతూ బుల్లితెరపై స్టార్ హీరోల రేంజ్‌లో సుడిగాలి సుధీర్ అభిమానులను సంపాదించుకున్నాడు. రష్మీతో ప్రేమాయణం కూడా సుధీర్‌కు ఇమేజ్ తెచ్చిపెట్టింది. అయితే సడెన్‌గా జబర్దస్త్ షో వీడి వేరే ఛానల్‌కు సుధీర్ మకాం మార్చేశాడు. స్టార్ మా ఛానల్‌లో కామెడీ స్టార్స్ అనే షోలో సుధీర్ నటిస్తున్నాడు. ఈ షోను దర్శకుడు ఓంకార్ నిర్వహిస్తున్నాడు. సుధీర్ ఉంటే ఈ షోకు ప్లస్ అవుతుందని అతడికి ఎక్కువ ప్యాకేజీ ఆశ చూపించాడు. దీంతో సుధీర్ అట్రాక్ట్ అయిపోయి జబర్దస్త్‌ను వదులుకుని మరీ కామెడీ స్టార్స్ షోలో భాగం అయ్యాడు.
అయితే అర్ధాంతరంగా కామెడీ స్టార్స్ షోను నిర్వాహకులు నిలిపివేశారు. దీంతో ఈ షోపై ఆశలు పెట్టుకుని వచ్చిన కమెడియన్స్ అందరికీ పెద్ద షాక్ తగిలింది. ఈ బాధితుల్లో సుడిగాలి సుధీర్ కూడా ఉండటం అతడి అభిమానులను కలిచివేసింది. ఉన్నది పోయి.. ఉంచుకున్నది పోవడంతో మూడు నెలలుగా సుధీర్ ఖాళీగా ఉంటున్నాడు. బుల్లితెరపై మళ్లీ సుధీర్ కనిపిస్తే చూడాలని కోరుకుంటున్నాం అంటూ ఆయన అభిమానులు ఏకంగా కన్నీళ్లు పెట్టుకున్నంత పనిచేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలను హాయిగా చేసుకుంటున్న సుడిగాలి సుధీర్‌ను కామెడీ స్టార్స్ షో కోసం అనవసరంగా లాగారని అతడి అభిమానులు మండిపడుతున్నారు. ఇదంతా ఓంకార్ పని అని తెలిసి అతడిని ఓ రేంజ్‌ను ఆడుకుంటున్నారు. అటు సుధీర్ అరుదైన జబ్బుతో బాధపడుతున్నాడని.. అది కాస్త బాగా ముదిరిపోయిందని అందుకే బుల్లితెరకు కొంతకాలంగా దూరంగా ఉంటున్నాడని కొందరు చర్చించుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.
మరోవైపు సుడిగాలి సుధీర్ మరో కామెడీ షో కోసం రెడీ అవుతున్నట్లు ప్రస్తుతం టాక్ నడుస్తోంది. త్వరలో ఆహా ఓటీటీ వారు నిర్వహించే కామెడీ షోలో సుధీర్ కనిపిస్తాడని ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఈ షో ఆలస్యమైతే సుధీర్ మరింత ఖాళీగా ఉండాలి. ఎప్పుడూ బిజీగా ఉండే సుధీర్ ఇప్పుడు ఇలా ఖాళీ అవ్వడం అతని అభిమానులను డిజప్పాయింట్ చేస్తోంది. సుడిగాలి సుధీర్ మళ్లీ అవకాశాల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి కల్సించారంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు. అటు వెండితెర కూడా సుధీర్‌కు కలిసి రాలేదు. సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీ మంకీస్, వాంటెడ్ పండుగాడ్, గాలోడు వంటి చిత్రాల్లో అతడు హీరోగా నటించాడు. కానీ ఈ సినిమాలు సుధీర్ కెరీర్‌కు ఉపయోగపడలేదు. సుడిగాలి సుధీర్ తన అల్లరి చేష్టలతో జబర్దస్త్ షోకు కళ తీసుకువచ్చాడు. రాంప్రసాద్, గెటప్ శ్రీనుతో కలసి సుధీర్ చేసే రచ్చ అభిమానులను కడుపుబ్బా నవ్వించేది. భారీ రెమ్యునరేషన్ ఆఫర్ రావడం వల్లే జబర్దస్త్ లాంటి షో నుంచి సుధీర్ తప్పుకున్నాడని అతడి సన్నిహితులు చెప్తున్నారు.