
మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఈ పొంగల్ విన్నర్ అనే విషయం అందరికీ తెలిసిందే..సంక్రాంతికి ఈ సినిమా తో పోటీ అంటూ వచ్చిన బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ముందు నిలబడలేకపోయింది..ఈ రెండు సినిమాలకు మధ్య సుమారుగా 50 కోట్ల రూపాయిల వరకు తేడా ఉంటుంది..ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ 135 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించిన ఈ చిత్రానికి సంబంధించి విజయోత్సవ వేడుక ని నిన్న వరంగల్ లో నిర్వహించారు..ఈ ఈవెంట్ కి మెగాస్థార్ చిరంజీవి తో పాటుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హాజరయ్యాడు..కానీ ఈ చిత్రం లో కీలక పాత్ర పోషించిన రవితేజ మాత్రం షూటింగ్ లో బిజీ గా ఉండడం వల్ల హాజరు కాలేకపోయాడు.
అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి మీద నెగటివ్ కామెంట్స్ చేసే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని రామ్ చరణ్ ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..ఆయన మాట్లాడుతూ ‘ఇందులో రవితేజ గారు చిరంజీవి గారిని పేస్ టర్నింగ్ ఇచ్చుకో బాక్స్ బద్దలు అవ్వుధి అంటాడు..రవితేజ గారంటే మా ఇంట్లో మనిషి లాంటోడు కాబట్టి..మా నాన్న కి తమ్ముడిలాంటి వాడు కాబట్టి అభిమానులు చాలా లైట్ తీసుకున్నారు..అదే వేరేవాళ్లు అంటే ఫ్యాన్స్ ఊరుకుంటారా..అందరూ నాన్న ని సౌమ్యుడు అని అంటూ ఉంటారు..ఆయన సౌమాంగా ఉంటేనే ఇంత లక్షలాది మంది ఆయన వెంట ఉన్నారు..అదే ఆయన కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి..ఆయన సౌమ్యుదే కానీ..నేను మరియు అభిమానులం మాత్రం సౌమ్యులం కాదు’ అంటూ రామ్ చరణ్ ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలను దృష్టిలో పెట్టుకొని చేసిన కామెంట్స్ ఇప్పుడు సెన్సేషనల్ గా మారాయి.
అయితే రామ్ చరణ్ ఈ మాటలను లేటెస్ట్ గా మంత్రి రోజా చేసిన కామెంట్స్ ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడినట్టు అందరికీ అర్థం అయ్యింది..రోజా ఈమధ్య కాలం లోనే చిరంజీవి కుటుంబం జనాలకు ఏమి చెయ్యలేదు..అందుకే రాజకీయాల్లో ముగ్గురు అన్నదమ్ములను జనాలు ఓడించారు అంటూ ఆమె చేసిన కామెంట్స్ పెను దుమారమే రేపింది..దీనిపై పవన్ కళ్యాణ్ , నాగబాబు మరియు చిరంజీవి కూడా స్పందించారు..ఇప్పుడు లేటెస్ట్ గా రామ్ చరణ్ ఆమె పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడు..దీనిని బట్టి మెగా ఫ్యాన్స్ రోజా మీద ఎంత పగతో రగిలిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు.