
న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన దసరా మూవీ కోసం ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే.ఈ సినిమాని నాని తన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసాడు.ఈ సినిమాకి సంబంధించిన ప్రతీ ప్రమోషనల్ ఈవెంట్ లోను నాని మాటల్లో ఉన్న నమ్మకం ని చూసి, కచ్చితంగా భారీ రేంజ్ హిట్ కొట్టబోతున్నాడని అందరికీ అర్థం అయిపోయింది.అందుకే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా దాదాపుగా 50 కోట్ల రూపాయలకు జరిగింది.ఈ రేంజ్ బిజినెస్ ఇప్పటి వరకు నాని కి ఏ సినిమాకి కూడా జరగలేదు.కంటెంట్ అద్భుతంగా రావడం తో మూవీ ని పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చెయ్యడానికి సిద్దమయ్యాడు.ప్రొమోషన్స్ కూడా ఇరగకుమ్మేసాడు,అలా ఎన్నో పాజిటివ్ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించిందా లేదా అనేది ఇప్పుడు మనం ఈ రివ్యూ లో చూడబోతున్నాము.
ధరణి పాత్రలో నాని నటించలేదు, జీవించాడు అనే చెప్పాలి.ఆయన మాట్లాడే యాస, బాడీ లాంగ్వేజ్, ఎమోషన్స్ మరియు ఎక్స్ప్రెషన్స్ ఇలా ఏది తీసుకున్న కూడా నేషనల్ అవార్డు విన్నింగ్ రేంజ్ పెర్ఫార్మన్స్ కి ఏమాత్రం తీసిపోదు.ఇన్ని రోజులు యూత్ ఫుల్ ఎంటెర్టైనెర్స్ ని మాత్రమే చేస్తూ వచ్చిన నాని, ఇంత బరువైన మాస్ రోల్ ని మొయ్యగలడా అని ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ అనుకున్నారు.కానీ ఆయన తప్ప ఈ పాత్ర ఎవ్వరు చెయ్యలేరు అనే విధంగా నటించాడు.ఇది నిజంగా అందరినీ షాక్ కి గురి చేసిన విషయం.ఇక కీర్తి సురేష్ కూడా మహానటి తర్వాత అంతటి గొప్ప నటనకి స్కోప్ ఉన్న పాత్రని ఎంచుకుంది.మూవీ ఫస్ట్ హాఫ్ చూసినప్పుడే బ్లాక్ బస్టర్ అనే ఫీలింగ్ అందరిలో కలుగుతుంది, ఇక సెకండ్ హాఫ్ ఏమి జరగబోతుందా అనే ఆత్రుతని అందరిలో కలిగిస్తుంది.
అంత చక్కగా చిత్రీకరించాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.సెకండ్ హాఫ్ కూడా ఎక్కడా తగ్గకుండా మాస్ ఎలేవేషన్స్ తో పాటుగా హృదయాలను కట్టిపడేసే ఎమోషన్ సన్నివేశాలను కూడా డైరెక్టర్ అద్భుతంగా రాసుకున్నాడు.ఇక ఈ సినిమాలో నాని స్నేహితుడిగా దీక్షిత్ శెట్టి అద్భుతంగా నటించాడు.ఇది వరకే ఆయన కన్నడలో పలు షార్ట్ ఫిలిమ్స్ మరియు టీవీ సీరియల్స్ లో చేసాడు.వెండితెర మీద కనిపించడం ఇదే తొలిసారి.తొలిసారి అయ్యినప్పటికీ కూడా మంచి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసాడు.మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ కూడా పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేసాడు.మొత్తం మీద హీరో నాని ఈసారి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని ముందుగానే చెప్పి మరీ కొట్టాడు.అలా ఇలా కాదు పాన్ ఇండియా లెవెల్ లో మోతమోగిపోయ్యేలాగా.ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఎన్ని అద్భుతాలు సృష్టించబోతుందో చూడాలి.