Home Movie News నాగ చైతన్య సొంత అన్నయ్యని ఎప్పుడైనా చూసారా?

నాగ చైతన్య సొంత అన్నయ్యని ఎప్పుడైనా చూసారా?

0 second read
0
0
1,224

అక్కినేని వంటి పెద్ద ఫామిలీ బ్యాక్ గ్రౌండ్ నుండి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన, తన నటనతో కుర్రకారులను, ఫామిలీ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకున్న హీరో అక్కినేని నాగ చైతన్య, తోలి సినిమా జోష్ తో నాగార్జున వారసుడిగా భారీ అంచనాలతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నాగ చైతన్య కి తోలి సినిమా తో బాక్స్ ఆఫీస్ వద్ద చేదు అనుభవమే ఎదురు అయ్యింది, కానీ ఆ తర్వాత ఆయన చేసిన ఏం మాయ చేసావే సినిమా బాక్స్ ఆఫీస్ పరంగా ఎంత గొప్ప విజయం సాధించిందో, నటుడిగా నాగ చైతన్య ని కూడా గొప్ప గా ఆవిష్కరించింది, కేవలం రెండవ సినిమా తోనే ఏం మాయ చేసావే వబ్టి కల్ట్ క్లాసిక్ సినిమా కెరీర్ లో పడడం తో నాగ చైతన్య కి యూత్ లో మరియు అమ్మాయిలలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది, ఇక ఆ సినిమా తర్వాత ఆయన 100 % లవ్ , ఒక్క లైలా కోసం, మనం , రారండోయ్ వేడుక చూద్దాం, మజిలీ , ప్రేమమ్ , తడాకా మరియు వెంకీ మామ సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలు అందుకొని యూత్ లో శాశ్వతమైన ఇమేజి ని సొంతం చేసుకున్నాడు.

ఇది ఇలా ఉండగా అక్కినేని నాగ చైతన్య గురించి మనకెవ్వరికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ లో వైరల్ అవుతున్నాయి, నాగ చైతన్య అక్కినేని నాగార్జున మరియు విక్టరీ వెంకటేష్ సోదరి లక్ష్మి దంపతులకు జన్మించిన విషయం మన అందరికి తెలిసిందే, పెళ్లి అయినా కొన్నాళ్లకే వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన కొన్ని విభేదాల కారణంగా విడిపోవాల్సి వచ్చింది, కానీ వీళ్లిద్దరు విడిపోయిన కూడా నాగ చైతన్య ని మాత్రం ఎంతో ప్రేమ తో చూసుకునే వాళ్ళు, నాగ చైతన్య కూడా ఇద్దరికీ సమానమైన ప్రాముఖ్యత మొదటి నుండి ఇస్తూ వచ్చే వాడు, అక్కినేని మరియు దగ్గుపాటి వంశాలకు చెందిన ఏకైక వారసుడు కావడం తో నాగ చైతన్య ని రెండు ఫ్యామిలీలు ఎంతో అల్లారు ముద్దుగా పెంచారు, చిన్నప్పటి నుండి విదేశాల్లోనే పుట్టి పెరిగిన నాగ చైతన్య తన చదువులు అన్ని పూర్తి అయ్యాక ఇండియా కి తిరిగి వచ్చి నాగార్జున తనయుడిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టాడు, అప్పట్లో నాగ చైతన్య గ్రాండ్ లాంచ్ ఏ స్థాయిలో జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, తోలి సినిమా జోష్ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినా , నాగ చైతన్య తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు.

ఇది ఇలా ఉండగా నాగ చైతన్య తల్లి లక్ష్మి నాగార్జున తో విడాకులు తీసుకున్న కొద్దీ కాలం తర్వాత శరత్ విజయ రాఘవన్ సుందరం అనే అతనిని పెళ్లి చేసుకుంది, వీళ్లిద్దరికీ కూడా ఒక్క కొడుకు ఉన్నాడు, ఇంత కాలం ఇతని ఫోటోలు సోషల్ మీడియా లో ఎప్పుడు కనిపించలేదు కానీ, ఇటీవల నాగ చైతన్య తన తల్లిని కలవడానికి సింగపూర్ కి వెళ్ళినప్పుడు అక్కడ తన తల్లి లక్ష్మి ఫామిలీ తో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా ద్వారా అప్లోడ్ చేసాడు, ఈ ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ గా మారింది, ఇందులో శరత్ మరియు లక్ష్మిలా తనయుడితో నాగ చైతన్య మరియు సమంత ఉన్నారు, ఆ ఫోటో ని మీరు క్రింద ఎక్సక్లూజివ్ గా చూడవచ్చు, లక్ష్మి నాగ చైతన్య తో ఎంత క్లోజ్ గా ఉంటారో తన కోడలు సమంత తో కూడా అంతే క్లోజ్ గా ఉంటారు, సమంత నాగ చైతన్య ల పెళ్ళి వేడుకలో కూడా లక్ష్మి గారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు, ఇక నాగ చైతన్య ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం లో లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నాడు, ఈ సినిమా లో హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తుంది, ఫిదా వంటి సంచలన విజయం తర్వాత శేఖర్ కముల తీస్తున్న సినిమా కావడం తో ఈ సినిమా పై తోలి నుండి ట్రేడ్ లో మంచి అంచనాలే ఉన్నాయి, ఇటీవలే విడుదల అయినా టీజర్ కి కూడా అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది, షూటింగ్ కార్యక్రమాలు అన్ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం నాగ చైతన్య కెరీర్ ని మరోసారి మలుపు తిప్పే హిట్ గా నిలుస్తుందా లేదా అనేది తెలియాలి అంటే కొంత కాలం వేచి చూడక తప్పదు.

1

2

3

4

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Movie News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…