
అక్కినేని నాగార్జున ఇద్దరు తనయులు టాలీవుడ్‌లో వరుస సినిమాలతో ముందుకు దూసుకువెళ్తున్నారు. నాగచైతన్య ఒకేసారి రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అతడు నటించిన థాంక్యూ, లాల్ సింగ్ చద్దా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అటు నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ కూడా ఏజెంట్ సినిమాతో రెడీగా ఉన్నాడు. అన్నదమ్ముల సినిమాలు ఒకేనెలలో ఒక్కరోజు తేడాలో విడుదలకు సిద్ధమయ్యాయి. అయితే ఏజెంట్ అనివార్య కారణాల వల్ల వెనక్కి వెళ్లింది. అయితే చైతూ థాంక్యూ సినిమా మాత్రం ఈనెలలోనే విడుదలవుతోంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాను టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు నిర్మించారు. సాధారణంగా దిల్ రాజు నిర్మించిన సినిమాలపై అంచనాలు భారీగా ఉంటాయి. దిల్ రాజు ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం వచ్చేస్తుంది. అందుకే దిల్ రాజు బ్యానర్ అత్యధిక సినిమాలు విజయవంతం అవుతుంటాయి.
తాజాగా దిల్ రాజు నిర్మాణంలో విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమా ఈనెల 22న విడుదల కానుంది. ఈ క్రమంలోనే చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు నాగచైతన్య గురించి, అక్కినేని ఫ్యామిలీ గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఫిలింనగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అక్కినేని హీరోలకు ఒక హీరోయిన్ సరిపోదు అని.. వాళ్లకు తప్పకుండా ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లు ఉండాలంటూ దిల్ రాజు వ్యాఖ్యానించారు. అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి చూసుకుంటే నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ వరకు ఒక్కో సినిమాలో ఇద్దరు లేదా ముగ్గురు హీరోయిన్లు ఉండాల్సిందే అని దిల్ రాజు చెప్పడంతో అక్కడున్న వాళ్లంతా అవాక్కయ్యారు. అలాగే చైతూ తాజా సినిమా థాంక్యూలో కూడా ముగ్గురు హీరోయిన్లు ఉన్నారని దిల్ రాజు వివరించారు.
థాంక్యూ సినిమాలో నాగచైతన్య మూడు వేరియేషన్లలో కనిపిస్తాడని.. అయితే ఒక్కో వేరియేషన్‌లో నాగచైతన్య ఒక్కో అమ్మాయితో ప్రేమలో పడతాడని దిల్ రాజు వెల్లడించారు. అందుకే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్‌లను తీసుకున్నామని తెలిపారు. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా చైతన్య పాత్రలోని ఎమోషన్స్‌తో ట్రావెల్ అవుతామని చెప్పారు. మనకు ఇష్టమైన వారికి ఫోన్ చేసి కృతజ్ఞతలు చెబుతామని.. అంతలా ప్రతి ఒక్కరిని కదిలించే భావోద్వేగాలు ఈ సినిమాలో ఉంటాయన్నారు. థాంక్యూ సినిమా మన హృదయంలో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం అవుతుందన్నారు. జీవితంలో, కెరీర్‌లో ఏం పోగొట్టుకుంటున్నామో అనే ఆలోచనల్ని కలిగిస్తుందని చెప్పారు. నాగార్జున శివ, నిన్నే పెళ్లాడుతా, అన్నమయ్య తరహాలో చైతూ కెరీర్‌లో థాంక్యూ గొప్ప సినిమాగా మిగిలిపోతుందని దిల్ రాజు అభిప్రాయపడ్డారు. కాగా గతంలో విక్రమ్ కె కుమార్, చైతూ కాంబినేషన్‌లో వచ్చిన మనం సినిమా మంచి ఫీల్ గుడ్ సినిమాగా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. దీంతో థాంక్యూ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.