
అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన థాంక్యూ మూవీ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫీల్ గుడ్ మూవీ అని సినిమా చూసిన వాళ్లు చెప్తున్నారు. మనం లాంటి మరపురాని సినిమాతో అలరించిన విక్రమ్ కుమార్-నాగచైతన్య కలయికలో తెరకెక్కిన రెండో చిత్రం ఈ మూవీ. దీంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు నాగచైతన్య వరుస విజయాలతో ముందుకు దూసుకుపోతున్నాడు. వెంకీమామ, రారండోయ్ వేడుక చూద్దాం, మజిలీ, లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్నాడు. ఇప్పుడు థాంక్యూ మూవీ కూడా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. అయితే భారీ వర్షాల కారణంగా ఓపెనింగ్స్ తక్కువ వచ్చినట్లు బాక్సాఫీస్ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. శని, ఆది వారాల్లో వసూళ్లు పికప్ అవుతాయన్న ధీమాను చిత్ర బృందం వ్యక్తపరుస్తోంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.
అటు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు కూడా సిద్ధమవుతోంది. ఈ సినిమా శాటిలైట్ హక్కులను జెమినీ టీవీ కొనుగోలు చేయగా ఓటీటీ హక్కులను సన్ నెక్ట్స్, అమెజాన్ ప్రైమ్ సంయుక్తంగా దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 2 నుంచి థాంక్యూ మూవీ ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్ కానుంది. దిల్ రాజు బ్యానర్లో తెరకెక్కిన ఎఫ్3 మూవీ తరహాలోనే థాంక్యూ మూవీని కూడా రెండు ఓటీటీలు కొనుగోలు చేయడం విశేషం. ఈ సినిమాలో అభిరామ్‌గా చైతూ నటన ఆట్టుకునేలా ఉందని టాక్ వస్తోంది. అమెరికాలో జాబ్ చేస్తూ ఇండియా వచ్చి మళ్లీ తన స్నేహితులను కలుసుకుంటాడు. ఈ మూవీలో చైతూ సూపర్ స్టార్ మహేష్‌బాబు అభిమానిగా కనిపిస్తాడు. ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్లు చైతూ సరసన నటించారు. రాశీఖన్నా మెయిన్ లీడ్ రోల్లో నటించగా మాళవిక నాయర్, అవికా గోర్ కూడా ముఖ్య పాత్రలను పోషించారు. బీవీఎస్ రవి అందించిన కథను విక్రమ్ కె కుమార్ ఆకట్టుకునేలా తెరకెక్కించారు. ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అని విశ్లేషకులు చెప్తున్నారు.
మరోవైపు పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం థాంక్యూ మూవీకి హైలెట్‌గా నిలిచిందనే టాక్ వినిపిస్తోంది. ప్రకాష్ రాజ్ పాత్ర చిన్నదైనా చాలా బాగా చేశాడని ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే ఈ మూవీ ప్రేమమ్, ఆటోగ్రాఫ్, మహర్షి సినిమాలను తలపిస్తుందని పలువురు అంటున్నారు. ఫైనల్‌గా ఈ మూవీ సక్సెస్ ఎంతవరకు అనేది వీకెండ్‌తో తేలిపోనుంది. నాగ చైతన్య గత ఏడాది లవ్ స్టోరీ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే సాధించింది. హీరోయిన్ సాయిపల్లవి ఈ మూవీకి హైలెట్‌గా నిలిచింది. ఓ సందేశంతో శేఖర్ కమ్ముల లవ్‌స్టోరీని తెరకెక్కించగా.. ఇప్పుడు విక్రమ్ కె కుమార్ కూడా అంతర్లీనంగా థాంక్యూ సినిమాలో సందేశం ఇచ్చాడట. మన జీవితంలో మనం ఎదగడానికి కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లో మరిచిపోకూడదని ఈ సినిమా ద్వారా వివరించారని తెలుస్తోంది.