
అక్కినేని నాగార్జున హీరో గా నటించిన ఘోస్ట్ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన సంగతి మన అందరికి తెలిసిందే..ఇటీవల కాలం లో విడుదలైన నాగార్జున గారి సినిమాలలో భారీ అంచనాలను ఏర్పాటు చేసిన సినిమా ఇదే..ప్రవీణ్ సత్తారు వంటి న్యూ ఏజ్ డైరెక్టర్ ఈ సినిమాకి దర్శకుడు కావడం , దానికి తోడు టీజర్ మరియు ట్రైలర్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం వల్ల అభిమానుల్లోనే కాదు..ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి..కానీ ఈరోజు మొదటి ఆట నుండి డివైడ్ టాక్ ని సొంతం చేసుకోవడం తో నాగార్జున గారిని అభిమానులను కాస్త నిరాశకి గురి చేసింది..కానీ దసరా పండగ కావడం తో ఈ మూవీ కి కాస్త డీసెంట్ స్థాయి ఓపెనింగ్స్ దక్కాయనే చెప్పాలి..అయితే ఒకసారి ఈ సినిమా కథ , విశ్లేషణ మరి నటీనటుల నటన ఎలా ఉందొ క్లుప్తంగా ఈ కథనం లో విశ్లేషిద్దాం.
కథ విషయానికి వస్తే ఇందులో అక్కినేని నాగార్జున ఇంటర్ పోల్ ఆఫీసర్ గా నటించాడు..ఆయన ఒక మిషన్ డీల్ చేసాడంటే తిరుగు ఉండదు..అలా ఎన్నో మిషన్స్ ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసిన నాగార్జున అనుకోకుండా ఒక మిషన్ ఫెయిల్యూర్ అవుతుంది..ఇందులో ఆయన చేసిన పొరపాటు వల్ల ఇంటర్ పోల్ ఆఫీసర్ గా విరమణ చేస్తాడు..అలా కొంత కాలం బాగా విరామం తీసుకున్న తర్వాత పెద్ద ఇంటి కుటుంబ సబ్యులకు సెక్యూరిటీ గా వ్యవహరిస్తూ ఉంటాడు..అలా ఆయన ఒక పెద్ద ఇంటికి సెక్యూరిటీ గా పని చేస్తున్న సమయం లో ఆ ఇంటి చిన్న పాప ని కొంతమంది గ్యాంగ్ కిడ్నాప్ చెయ్యాలని చూస్తారు..వారి నుండి ఆ కుటుంబాన్ని ఎలా రక్షించాడు..వాళ్ళు గతం లో నాగార్జున గారి ఫ్లాష్ బ్యాక్ లో కూడా ఉన్నారా..వాళ్లకి నాగార్జున కి లింక్ ఏమిటి అనేది తెర మీద చూడాల్సిందే.
యాక్షన్ మూవీ లవర్స్ కి ఈ సినిమా బాగా నచుతుంది అనే చెప్పాలి..సినిమాలో ఎక్కువ శాతం యాక్షన్ సన్నివేశాలు ఉండడం..కథ కథనం ఆసక్తికరంగా లేకపోవడం ఈ సినిమాకి పెద్ద మైనస్..కానీ యాక్షన్ సన్నివేశాలు మాత్రం అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు..ముఖ్యంగా చర్చి లో వచ్చే ఫైట్ సీన్ మూవీ లవర్స్ కి ఫీస్ట్ లాగ ఉంటుంది..కాస్త కథ కథనం మీద ద్రుష్టి పెట్టి ఉంటె ఈ సినిమా రేంజ్ మరో లెవెల్ కి వెళ్ళేది..కచ్చితంగా నాగార్జున గారి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచేది..మరోపక్క మెగాస్టార్ గాడ్ ఫాదర్ చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది..కలెక్షన్స్ దుమ్ము లేపేస్తున్నాయి..ఆ సినిమా కలెక్షన్స్ ప్రభావం ఘోస్ట్ మీద కూడా గట్టిగ పడింది..అయితే మొదటి రోజు వసూళ్లు మాత్రం డీసెంట్ గానే వచ్చాయి..ఫుల్ రన్ లో ఎంత వసూలు చేస్తుందో చూడాలి..ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 22 కోట్ల రూపాయలకు జరగగా మొదటి రోజు 3 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..చూడాలి మరి ఈ దసరా సీసన్ ఈ చిత్రాన్ని ఎంత వరుకు ఆదుకుంటుందో అనేది.