Home Entertainment నాగార్జున ‘ది ఘోస్ట్’ మూవీ ఫుల్ రన్ కలెక్షన్స్..అక్కినేని ఫాన్స్ కి ఇది మాములు ఎదురు దెబ్బ కాదు

నాగార్జున ‘ది ఘోస్ట్’ మూవీ ఫుల్ రన్ కలెక్షన్స్..అక్కినేని ఫాన్స్ కి ఇది మాములు ఎదురు దెబ్బ కాదు

0 second read
0
0
528

దసరా కానుకగా అక్కినేని నాగార్జున నటించిన ది ఘోస్ట్ మూవీ భారీ అంచనాలతో విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీకి పోటీగా విడుదల కావడంతో ఈ సినిమాలో కంటెంట్‌పై ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. నాగ్ లాంటి హీరో ఎలాంటి నమ్మకం లేకుండా పోటీలో తన మూవీని రిలీజ్ చేయడని పలువురు భావించారు. కానీ అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి అన్న తరహాలో ది ఘోస్ట్ మూవీ పరిస్థితి తయారైంది. కనీస స్థాయిలో కూడా వసూళ్లు రాబట్టలేకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో నాగార్జున కెరీర్‌లో మరో అట్టర్ ఫ్లాప్ చేరినట్లు అయ్యింది. నిజానికి ఈ మూవీకి మరీ బ్యాడ్ టాక్ ఏమీ రాలేదు. తొలిరోజు యావరేజ్ టాక్ వినిపించడంతో నెమ్మదిగా ఈ మూవీ పికప్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్లు ఆశించారు. కానీ అలా జరగలేదు.

మరోవైపు ఈ శుక్రవారం ఏకంగా 11 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటి కోసం గాడ్ ఫాదర్ కంటే ది ఘోస్ట్ సినిమాను థియేటర్ల నుంచి ఎక్కువగా తొలగించాల్సి వచ్చింది. బెల్లంకొండ గణేష్ కుమార్ నటించిన స్వాతిముత్యం సినిమా ఎలాగూ లిమిటెడ్ స్క్రీన్స్‌లలోనే రిలీజైంది. దీంతో శుక్రవారం రిలీజైన సినిమాలతో ఘోస్ట్ మూవీ దాదాపు 50శాతం థియేటర్లు కోల్పోవాల్సి వచ్చింది. నిజానికి ఈ సినిమా విడుదలైన మూడో రోజుకే ఫ్లాప్ అని ట్రేడ్ విశ్లేషకులు నిర్ధారించారు. మొదటి రోజు ఓ మోస్తరుగా వసూళ్లు వచ్చాయి. ఆ తర్వాత వీకెండ్‌లో కొంత రెవెన్యూ వచ్చింది. ఆ తర్వాత నాగ్ మూవీ పూర్తిగా చతికిలపడింది. సోమవారం నుంచి పూర్తిగా డౌన్ అయిన ఈ సినిమా శుక్రవారానికి అట్టర్ ఫ్లాప్‌గా స్పష్టమైంది. కథ, కథనం రొటీన్‌గా ఉండటంతో ఈ సినిమా ప్రేక్షకులకు అంతగా రుచించలేదు. ఈ సినిమాలో నాగార్జున సోదరిగా గుల్ పనాగ్, మేనకోడలిగా అనికా సురేంద్రన్ నటించారు. ఈ మూవీలో నటీనటులు ఎమోషన్స్ పండించడంలో ఎందుకో విఫలమయ్యారని, కావాలని ఎమోషన్స్ తెచ్చి పెట్టుకుని నటించినట్లు ఉందని సినిమా చూసిన అభిమానులు చర్చించుకుంటున్నారు.

ది ఘోస్ట్ క్లోజింగ్ కలెక్షన్‌ల వివరాలను పరిశీలిస్తే కేవలం ఈ మూవీ రూ.5కోట్ల వసూళ్లు మాత్రమే రాబట్టింది. ది ఘోస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను చూస్తే నైజాంలో రూ.5.5 కోట్లు, సీడెడ్‌లో రూ.2.5 కోట్లు, ఏపీలోని మిగతా ప్రాంతాలన్నీ కలిపి రూ.8 కోట్లకు ఈ సినిమాను విక్రయించారు. కర్ణాటకలో రూ.65 లక్షలు, హిందీతో పాటు రెస్టాఫ్ ఇండియాలో రూ.2 కోట్ల మేర ప్రి రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మొత్తంగా ఈ మూవీకి రూ.21.5కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే తొలివారం ది ఘోస్ట్ సినిమా రూ.4 కోట్లు మాత్రమే సాధించి ఉసూరుమనిపించింది. రెండో వారంలో మరో రూ.కోటి మాత్రమే సాధించడంతో సుమారు రూ.15 కోట్ల నష్టాన్ని చవిచూసింది. యాక్షన్‌ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో నాగార్జున ఇంటర్‌పోల్‌ అధికారిగా నటించాడు. నాగార్జునకు జోడీగా సోనాల్‌ చౌహన్‌ హీరోయిన్‌గా నటించింది. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌ల‌పై సునీల్ నారంగ్‌, పుస్కురి రామ్‌మోహ‌న్ రావు, శ‌ర‌త్ మ‌రార్ నిర్మించారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

బ్రేకింగ్ : విడాకులు తీసుకున్న నిహారిక కొణిదెల – చైతన్య..గుండెలు పగిలేలా ఏడుస్తున్న నాగబాబు

ఈమధ్య కాలం లో సెలెబ్రిటీలు విడాకులు తీసుకోవడం సర్వసాధారణం అయిపోయింది.సమంత – నాగ చైతన…