
యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున హీరో గా నటించిన ఘోస్ట్ సినిమా ఈరోజు భారీ అంచనాల నడుమ విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..టీజర్ మరియు ట్రైలర్ తో ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలను ఏర్పాటు చేసిన ఈ సినిమా..ఆ అంచనాలను అందుకోవడం లో విఫలం అయ్యింది..సినిమాలో అనుకున్నట్టే యాక్షన్ సన్నివేశాలన్నీ అద్భుతంగా ఉన్నప్పటికీ, కథ వీక్ అవ్వడం తో ఆశించిన స్థాయి అంచనాలను అందుకోలేకపోయింది..అయితే దసరా రోజు విడుదల అవ్వడం తో ఈ చిత్రానికి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో పర్వాలేదు అనే రేంజ్ వసూళ్లు వచ్చాయి..ఇటీవల విడుదలైన నాగార్జున సోలో సినిమాలతో పోలిస్తే ఘోస్ట్ సినిమా ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి..ఒకపక్క మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా తో వసూళ్ల సునామి ని సృష్టిస్తూ ముందుకి దూసుకుపోతుంటే,నాగార్జున ఘోస్ట్ చిత్రం కూడా ఆ సినిమా పరిధి కి తగ్గట్టుగా డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టింది.
అందుతున్న ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి మూడు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చిందని చెప్తున్నారు..ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా 22 కోట్ల రూపాయలకు జరిగింది..మొదటి రోజు వచ్చిన డీసెంట్ స్థాయి వసూళ్లు వీకెండ్ వరుకు ఈ చిత్రం రాబట్టగలిగితే కచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు..మరి ఈ సినిమా మెగాస్టార్ గాడ్ ఫాదర్ చిత్రం ప్రభంజనం ని తట్టుకొని వీకెండ్ వరుకు డీసెంట్ స్థాయి వసూళ్లను సాధించగలుగుతుందా లేదా అనేది చూడాలి..ఇక ఈ సినిమా ఓవర్సీస్ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో కనీస స్థాయి వసూళ్లను కూడా రాబట్టలేక చతికిలపడింది..ఈ వసూళ్లను చూస్తే నాగార్జున మార్కెట్ ఈ రేంజ్ లో పడిపోయిందా అని ఆశ్చర్యపోక తప్పదు..గడిచిన కొన్నేళ్ల నుండి విడుదలైన నాగార్జున సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి..ఆ ప్రభావం ఈ సినిమా మీద చాలా గట్టిగానే పడింది.
అమెరికా లో ఈ సినిమా ప్రీమియర్స్ నుండి కేవలం 38 వేల డాలర్లు మాత్రమే వసూలు చేసింది..ఇది చాలా తక్కువ అనే చెప్పాలి..ప్రీమియర్స్ కాకుండా మొదటి రోజు కూడా ఈ సినిమా అక్కడ కేవలం 5 వేల డాలర్లు మాత్రమే వసూలు చేసింది..అంటే ప్రీమియర్స్ మరియు మొదటి రోజు కి కలిపి ఈ సినిమా సుమారు 43 వేల డాలర్లు వసూలు చేసింది..ఇది నాగార్జున రేంజ్ కి చాలా తక్కువ అని చెప్పొచ్చు..సీనియర్ హీరోలలో ఓవర్సీస్ లో మొదటి నుండి మంచి పట్టు ఉన్న హీరో అక్కినేని నాగార్జున..ఈయన నటించిన మనం మరియు ఊపిరి వంటి సినిమాలు అక్కడ రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది..అలాంటి మార్కెట్ ఉన్న నాగార్జున గారికి ఇలాంటి పరిస్థితి ఏర్పడడం ఆయన అభిమానులను తీవ్రమైన నిరాశకి గురి చేస్తుంది..ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన బంగార్రాజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి వసూళ్లను రాబట్టినప్పటికీ ఓవర్సీస్ లో మాత్రం అంతంతమాత్రమే వసూలు చేసింది.