Home Movie News నాగార్జున గురించి రవితేజ మాట్లాడిన ఈ మాటలు వింటే ఆశ్చర్యపోతారు

నాగార్జున గురించి రవితేజ మాట్లాడిన ఈ మాటలు వింటే ఆశ్చర్యపోతారు

0 second read
0
0
4,595

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా ఇటీవలే విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి సమాన అందరికి తెలిసిందే, వరుస ఫ్లాపులతో దాదాపుగా రవితేజ పని అయ్యిపోయింది అని అందరూ అనుకుంటున్న టైం లో ఈ సినిమా ఆయనకీ కెరీర్ లో భారీ హిట్ అయ్యి మంచి ఊపుని ఇచ్చింది, పండగ సమయం లో పోటీ కి నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద వచ్చిన రవితేజ బాక్స్ ఆఫీస్ జోరు ముందు నిలబడలేకపోయింది అనే చెప్పాలి, విడుదల అయినా రోజు తోలి ఆట నుండే బంపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న ఈ చిత్రం , మొదటి రోజు నుండే ఒక్క రేంజ్ వసూళ్లను బాక్స్ ఆఫీస్ వద్ద రాబడుతూ ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది, కరోనా కాలం లో 50 శాతం సీటింగ్ కెపాసిటీ తో ఈ స్థాయి వసూళ్లు రాబడుతుంది అని ఎవ్వరు ఊహించలేదు, కానీ కరోనా ని జయించి క్రాక్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించి సంక్రాంతి విజేతగా నిలిచింది.

ఇక ఎవ్వరు ఊహించని విధంగా ఈ సినిమా సక్సెస్ సాధించడం తో ఈ చిత్ర యూనిట్ గ్రాండ్ గా ఇటీవలే సక్సెస్ ఫంక్షన్ ని ఏర్పాటు చేసింది, ఇక పండగ సందర్భంగా రవితేజ కూడా ఎన్నో ఇంటర్వూస్ లో పాల్గొన్నాడు, పలు ఇంటర్వూస్ లో ఆయన తన లైఫ్ లో చోటు చేసుకున్న కొన్ని సంగటనలు పంచుకున్నాడు, రవితేజ తొలుత తన కెరీర్ ని అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రారంబించి ఆ తర్వాత చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ మెల్లిగా హీరోగా మారి టాప్ స్టార్ అయినా సంగతి మన అందరికి తెలిసిందే, అలా ఆయన అక్కినేని నాగార్జున హీరో గా తెరకెక్కిన ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ నిన్నే పెళ్లాడట సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చెయ్యడమే కాకుండా, ఆ సినిమాలో చిన్న రోల్ లో కూడా కనిపిస్తాడు, అప్పటి వరుకు రవితేజ ఎన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన ఒక్కరు కూడా ఆయనకీ డబ్బులు ఇవ్వలేదు, కానీ అక్కినేని నాగార్జున మాత్రం రవితేజ పని అయిపోయిన తర్వాత స్వయంగా ఆయనే పిలిచి చేతిలో 3500 రూపాయిలు పెట్టాడు అట, అదే ఆయన సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత నాకు అందిన రెమ్యూనరేషన్ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక క్రాక్ సినిమా బాక్స్ ఆఫీస్ రన్ విషయానికి వస్తే ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ 16 కోట్ల రూపాయలకు జరుగగా, కేవలం 5 రోజుల లోపే ఈ సినిమా 23 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి డిస్ట్రిబ్యూటర్స్ ని లాభాల్లో ముంచి ఎత్తింది, ఇటీవల కాలం లో ఈ స్థాయిలో లాభాలు కురిపించిన సినిమా ఇదే అవ్వడం విశేషం, పండగ కారణంగా నాలుగు సినిమాలు పోటీ కి వచ్చేసరికి తక్కువ థియేటర్స్ దొరకడం వల్ల క్రాక్ సినిమా వసూళ్లు కాస్త తగ్గాయి అని , లేకపోతే అవలీల గా ఈ సినిమా 40 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసేది అని, ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ వాపోతున్న సంగతి మన అందరికి తెలిసిందే, దిల్ రాజు తమిళ్ డబ్బింగ్ సినిమా మాస్టర్ కి ఎక్కువ థియేటర్స్ కబ్జా చేసేసి మా సినిమాకి థియేటర్స్ దక్కకుండా చేసారు అని ఆ సినిమా నిజాం డిస్ట్రిబ్యూటర్ ఇటీవలే మీడియా ముందుకి వచ్చి దిల్ రాజు పై ఆరోపణలు చేసిన సంఘీ మన అందరికి తెలిసిందే, ప్రస్తుతం విజయవంతంగా నడుస్తున్న క్రాక్ సినిమాని తొక్కేయడం పై సోషల్ మీడియా లో నెటిజెన్ల తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Movie News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…