
గత కొద్దీ రోజుల నుండి మీడియా లో వివాదాస్పదం గా మారిన అంశం నరేష్ – పవిత్ర లోకేష్ పెళ్లి వ్యవహారం..వీళ్లిద్దరు గత కొద్దీ సంవత్సరాల నుండి సహా జీవనం చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే..అయితే పవిత్ర ని నాల్గవ పెళ్లి చేసుకోవడం కోసం తన మూడవ భార్య రమ్య కి విడాకుల నోటీసులు పంపాడు నరేష్..కొన్నేళ్ల నుండి రమ్య తో నరేష్ దూరంగా ఉంటున్నాడు..ఆమె ప్రస్తుతం బెంగళూరు లో ఉంటుంది..అయితే నరేష్ కి విడాకులు ఇచ్చే సమస్యే లేదని..ఆయన పవిత్ర లోకేష్ ని ఎలా పెళ్లి చేసుకుంటాడో నేను కూడా చూస్తానని, పవిత్ర లోకేష్ కాపురాలు కూల్చే టైపు అని..ఆమె మోజులోపడి నరేష్ నాకు నా బిడ్డకి అన్యాయం చెయ్యాలని చూస్తున్నాడని రమ్య మీడియా సమావేశం ఏర్పాటు చేసి నరేష్ పై సంచలన ఆరోపణలు చేసిన విషయం మనకి తెలిసిందే..ఒక్కవేల నరేష్ పవిత్రాలు బెంగళూరు కి వస్తే వాళ్ళని చెప్పుతో కొడతాను అని చెప్పి , అన్నంత పనే చేసింది రమ్య..ఇటీవల బెంగళూరు లోని ఒక హోటల్ లో దిగిన నరేష్ మరియు పవిత్ర లోకేష్ ని చెప్పు తీసుకొని కొట్టడానికి వచ్చింది..అక్కడ పోలీస్ సెక్యూరిటీ పటిష్టంగా ఉండడం వల్ల చెప్పు దెబ్బల నుండి తప్పించుకున్నారు..ఈ వీడియో సోషల్ మీడియా లో ప్రస్తుతం ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో చెప్పక్కర్లేదు.
అయితే జరుగుతున్నా ఈ వివాదం పై సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో విలేకరి అడగగా స్పందించారు..ఆయన మాట్లాడుతూ ‘నరేష్ నా కొడుకు తో సమానం..విజయ నిర్మల గారు చనిపోయిన తర్వాత నాకు తోడుగా ఉంటుంది నరేష్ మాత్రమే..నాకు సంబంధించిన అన్ని పనులు కూడా ఆయనే దగ్గరుండి చూసుకుంటాడు..నాకు ఎంతో దగ్గర మనిషి అయినప్పటికీ కూడా నరేష్ వ్యక్తిగత విషయాలలో నేను తలదూర్చాను..వాడేమి చిన్న పిల్లవాడు కాదు..ఎవ్వరు కూడా కావాలని మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకోరు..అది ఇద్దరి దంపతుల మధ్య జరిగిన కొన్ని అనుకోని సంఘటనల వల్ల దేవుడి రాసిన తలా రాత ప్రకారమే ఏదైనా జరుగుతుంది తప్ప..ఏది కూడా ప్లాన్ చేసుకొని పొరపాట్లు చెయ్యము.నరేష్ కి ఇలా మూడు పెళ్లిళ్లు అవుతాయని మేము ఎప్పుడు కూడా ఊహించలేదు..అది విధాత రాసిన రాత..ఇప్పుడు ఈ వయస్సులో వాడు నాల్గవ పెళ్లి కూడా చేసుకుంటాడని అనుకోలేదు..ఏది కూడా మన చేతిలో లేదు..పెద్ద వయస్సు లో తోడు కచ్చితంగా అవసరం అవుతుంది..నరేష్ అందుకే పవిత్ర గారిని పెళ్లి చేసుకుంటున్నాడు’ అంటూ చెప్పుకొచ్చాడు సూపర్ స్టార్ కృష్ణ.
నరేష్ టాలీవుడ్ లో ఎంత బిజీ ఆర్టిస్టు అనేది మన అందరికి తెలిసిందే..ప్రతి శుక్రవారం విడుదలయ్యే సినిమాలలో నరేష్ కచ్చితంగా ఉండాల్సిందే..హీరో గా క్యారక్టర్ ఆర్టిస్యుగ నరేష్ ప్రస్థానం ఎంతో గొప్పది..లేటెస్ట్ గా ఆయన ప్రధాన పాత్ర పోషించిన అంటే సుందరానికి సినిమా లో ఆయన నటనకు గాను ఎంత అద్భుతమైన పేరు ప్రఖ్యాతలు వచ్చాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..అయితే ఇప్పుడు తరుచు వివాదాల్లో మునిగి తేలుతున్న నరేష్ సినీ కెరీర్ పై ప్రభావం పడే అవకాశం ఉందని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్..టాప్ డైరెక్టర్లు మరియు హీరోలు ఎప్పుడూ కూడా నరేష్ డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు..కానీ ఇప్పుడు రెగ్యులర్ గా అయన ఎదో ఒక వివాదం లో చిక్కుకోవడం తో ఆయనతో సినిమాలు చెయ్యడానికి దర్శక నిర్మాతలు ఇప్పుడు ఆలోచిస్తున్నారు..మరో పక్క పవిత్ర లోకేష్ కి కూడా సినిమాల్లో అవకాశాలు కరువు అవ్వడమే కాకుండా..ఒప్పుకున్నా రెండు సినిమాలు కూడా చేతినుండి జారిపోయాయి..ఇలా నరేష్ మరియు పవిత్ర కెరీర్లు వారి మధ్య ఉన్న సంబంధం వల్ల డైలమా లో పడింది అంటూ ఫిలిం నగర్ లో వినిపిస్తున్న గుసగుసలు.