
:టాలీవుడ్ సీనియర్ నటులలో లెజెండరీ స్థానం ని సంపాదించుకున్న నటుడు నరేష్..హీరో గా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ని సొంతం చేసుకున్న ఆయన, క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా ఒక రేంజ్ లో సక్సెస్ అయ్యాడు..నేడు నరేష్ గారు లేకుండా సినిమా విడుదల కానీ పరిస్థితి ఏర్పడింది..నటుడిగా ఆయన కి ఉన్న స్థానం ఎంతో ప్రత్యేకం..దానిని ఎవ్వరు కాదు అనలేరు..కానీ ఇటీవల ఆయన వరుస వివాదాల్లో చిక్కుకుంటూ ఎక్కడలేని నెగటివిటీ ని తెచ్చుకుంటున్నాడు..ఇది నిజంగా ఆయన కెరీర్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది..మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికలలో నరేష్ చేసిన ఓవర్ యాక్షన్ ని అంత తేలికగా ఎవ్వరు మర్చిపోలేరు..హద్దులు దాటి ఆయన ప్రవర్తించిన తీరు, ఆయన అభిమానులకు సైతం చిరాకు పుట్టేలా చేసింది..ఇక ఇటీవల ప్రముఖ నటి పవిత్ర లోకేష్ ని నరేష్ నాల్గవ పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్త అయితే ఆయన పై మరింత నెగటివిటీ పెంచేలా చేసింది..దానికి తోడు నరేష్ మూడవ భార్య నరేష్ – పవిత్రాలపై కామెంట్స్ చెయ్యడం..అలాగే నరేష్ కూడా తిరిగి ఆమె పై కామెంట్ చెయ్యడం..ఆమె చెప్పు తీసుకొని నరేష్ ని కొట్టడం..ఇవన్నీ సోషల్ మీడియా లో గత కొద్దీ రోజులుగా ఎలాంటి దుమారం రేపిందో మనం అందరం చూస్తూనే ఉన్నాము.
అయితే వివాదాలకు ఎప్పుడు దూరంగా ఉంటూ వచ్చే కృష్ణ గారి కుటుంబం నరేష్ వ్యవహారం పై సేయస్ అయినట్టు సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి..కృష్ణ గారి సతీమణి విజయ్ నిర్మల గారి కొడుకు నరేష్ అనే విషయం మన అందరికి తెలిసిందే..విజయనిర్మల గారు స్వర్గస్తులు అయినా తర్వాత నరేష్ కృష్ణ గారికి కుడి భుజం లాగ మారి అన్ని చూసుకుంటున్నాడు..ఇండస్ట్రీ లో పెద్ద కుటుంబానికి చెందిన వాడు ఇలా తరుచు వివాదాల్లో ఉంటె కృష్ణ గారి పరువు పోతుందని..ఆయనని ఈ వయస్సులో దయచేసి బాధపెట్టొడు అని సూపర్ స్టార్ మహేష్ బాబు నరేష్ ని వ్యక్తిగతం గా కలిసి మాట్లాడినట్టు తెలుస్తుంది..వివాదాల్లోకి ఘట్టమనేని ఫామిలీ ఎప్పుడు దూరంగా ఉంటుంది..నిన్ను కూడా అందరూ ఘట్టమనేని ఫామిలీ లాగానే చూస్తారు..నీ వ్యక్తిగత విషయాలు ఎలా ఉన్న అది నీ ఇష్టం..కానీ దయచేసి గొడవలు పెద్దవి చేసుకోవద్దు..ఏదైనా ఉంటె కూర్చొని మాట్లాడనుకోండి అని నరేష్ ని మహేష్ రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది.
నరేష్ మరియు పవిత్రాలు చాలా కాలం నుండి డేటింగ్ చేస్తున్నారు..మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికల సమయం లో కానీ..అలాగే కృష్ణ ఫామిలీ కి సంబంధించిన ఆ ఏ ఫంక్షన్ లో అయినా అప్పట్లో పవిత్ర లోకేష్ నరేష్ పక్కన ఉండడం చూసి , ఈమెకి కృష్ణ గారి కుటుంబం తో ఏమి పని అని అనుకునేవారు అప్పట్లో..నరేష్ పవిత్ర ని పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు కూడా రావడం అప్పట్లో జరిగాయి..కానీ ఇదంతా కేవలం రూమర్స్ ఏమో అని అనుకున్నారు..కానీ ఇటీవలే వీళ్లిద్దరు స్వయంగా మేము డేటింగ్ లో ఉన్నాము అంటూ చెప్పడం..పెళ్లి చేసుకోవడం కోసం మూడవ భార్య రమ్య కి విడాకులు ఇవ్వాలని అనుకోవడం..ఆమె మీడియా ముందుకి వచ్చి రచ్చ చెయ్యడం అన్ని అలా జరిగిపోయాయి..అయితే గత కొద్దీ రోజుల నుండి మీడియా లో నరేష్ కనిపించడం తగ్గించారు..బహుశా కృష్ణ ఫామిలీ సీరియస్ అవ్వడం వల్లే ఆయన సైలెంట్ అయ్యాడని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న వార్త.