
టాలీవుడ్ సీనియర్ నటి సురేఖ వాణి అంటే అందరికీ తెలుసు తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది నటి గా వివిధ పాత్రల్లో నటించింది సురేఖ వాణి నటిగా సినిమాల్లో రాకముందు ఒక టీవీ షో లో యాంకర్ గా వ్యవహరించింది. యాంకర్ గా అందరికీ పరిచయం అయింది మా టాకీస్ ,హార్ట్ బీట్ ,మొగుడు పెళ్ళాం వంటి షోస్ చేశారు. తర్వాత దర్శకుడు రచయిత అయిన సురేష్ తేజ తో పరిచయం, స్నేహం ప్రేమ గా మారి పెళ్లికి దారి తీసింది తరువాత తనకు సినిమాల్లో అవకాశం దక్కింది నటించిన మొదటి సినిమా శీను గాడు చిరంజీవి అనే సినిమా లో హీరో వదిన గా నటించింది తన నటనకు మంచి గుర్తింపు రావడంతో ఆ తరువాత సినిమాలో అవకాశాలు లభించాయి. దాదాపు గా అన్ని పాత్రల్లో కనిపించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
ఈ విధంగా విజయాలతో ముందుకు సాగుతున్న సురేఖ వాణి జీవితం అనుకొని మలుపు తిరిగి హఠాత్తుగా తన భర్త సురేష్ తేజ మరణించారు. భర్త మరణం తో సురేఖ వాణి చాలా కాలం వరకు డిప్రెషన్ లో ఉండిపోయారు తరువాత తాను ఉండిపోతే తన కూతురు సుప్రీత జీవితం ఏం అయిపోతుందో అని ఆలోచించి తిరిగి ముందడుగు వేశారు. సురేఖ వాణి తన కూతురు తో కలిసి దిగిన ఫొటోస్ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉంటారు ఆ ఫొటోస్ లో ఇద్దరూ అక్క చెల్లి లాగా ఉన్నారని కామెంట్స్ వస్తు ఉంటాయి అయితే సురేఖ వాణి కూతురితో ఉన్న ఫొటోస్ ఏ కాకుండా తనకు సంబంధించిన పర్సనల్ మరియు ప్రొఫెషనల్ కూడా సోషల్ మీడియా లో షేర్ చేస్తూ చాలా యాక్టివ్ గా తన వయసు తో సంబంధం లేకుండా తన హాట్ హాట్ ఫొటోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది అయితే నటనలో వచ్చే పాత్రల్లో మాత్రం చాలా సాంప్రదాయకం గా తెలుగింటి అమ్మాయి కనిపిస్తూ ఉంటుంది.
ఇక ఈమె కూతురు సుప్రీతా కూడా సోషల్ మీడియా లో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది,ఈమెకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే, రీసెంట్ గా ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ ఈమెని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీ అమ్మగారు డేటింగ్ చెయ్యాలనుకుంటే మన టాలీవుడ్ స్టార్ హీరోలలో ఎవరితో డేటింగ్ చెయ్యడానికి ఇష్టపడుతుంది’ అని అడగగా దానికి సుప్రీతా సమాధానం ఇస్తూ ‘మా అమ్మకి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం, ఆయనతో డేటింగ్ చెయ్యడానికి సిద్ధం అవుతాది, అలాగే నాగార్జున తో కూడా’ అని చెప్పుకొచ్చింది.ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.