
ఈ సంక్రాంతికి చాన్నాళ్ల తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్, నందమూరి హీరోలు తలపడ్డారు. నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి జనవరి 12న విడుదల కాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య జనవరి 13న విడుదలైంది. అయితే తొలిరోజు వాల్తేరు వీరయ్యతో పోలిస్తే వీరసింహారెడ్డికి ఎక్కువ థియేటర్లు దక్కాయి. కానీ టాక్ అంతంత మాత్రంగానే రావడంతో క్రమ క్రమంగా వీరసింహారెడ్డి థియేటర్లు తగ్గిపోయాయి. 14న వారసుడు మూవీ విడుదల కావడం కూడా ఈ సినిమాపై ప్రభావం చూపింది. అయితే మెగాస్టార్ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో కొన్ని బాలయ్య మూవీ థియేటర్లను వీరయ్య సినిమాకు కేటాయించడం జరిగింది. ఈ రెండు సినిమాలు ఒకే నిర్మాత, ఒకే డిస్ట్రిబ్యూటర్‌వి కావడం కూడా కలిసొచ్చింది. వీరసింహారెడ్డి సినిమాలో కాస్త రక్తపాతం హింస ఉండటంతో జనాలు వాల్తేరు వీరయ్య సినిమాను చూసేందుకు ఆసక్తి చూపించారు.
అటు నందమూరి హీరోలలో బాలయ్య, ఎన్టీఆర్ ప్రధానంగా కొనసాగుతున్నారు. ఆర్.ఆర్.ఆర్ మినహాయిస్తే ఎన్టీఆర్ సినిమాలతో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా అంటే అరవింద సమేత వీరరాఘవ మాత్రమే. ఈ సినిమా వసూళ్లను, నందమూరి బాలయ్య అఖండ వసూళ్లను వారంలోపే వాల్తేరు వీరయ్య అధిగమించింది. నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో ఇప్పటి వరకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన అఖండ మూవీ ఫైనల్ వసూళ్లను వాల్తేరు వీరయ్య సినిమా కేవలం 4 రోజుల్లోనే క్రాస్ చేసిందని ట్రేడ్ వర్గాలు తెలియజేశాయి. బోయపాటి శ్రీను, బాలయ్య కాంబోలో తెరకెక్కిన అఖండ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 70 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. కానీ వాల్తేరు వీరయ్య తొలి వారంలోనే రూ.97 కోట్ల షేర్ సాధించి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ మూవీ ఏడో రోజు కూడా అదిరిపోయే రీతిలో వసూళ్లు సాధించింది. 7వరోజు వీరయ్య మూవీ రూ. 4.85 కోట్ల కలెక్షన్లను సొంతం చేసుకుంది. అయితే గతంలో రిలీజ్ అయిన సినిమాల లిస్టులో ఈ సినిమా ఓవరాల్‌గా 6వ స్థానాన్ని దక్కించుకుంది. తొలి వారం టాప్ 7 మూవీస్‌లో మెగాస్టార్ చిరంజీవి సినిమాలు 3 ఉండటం విశేషం.
అటు మెగాస్టార్ చిరంజీవి నటించిన గత ఐదు చిత్రాల తొలి వారం వసూళ్లను గమనిస్తే సైరా నరసింహారెడ్డి అత్యధికంగా రూ.188 కోట్ల గ్రాస్ వసూళ్లను, రూ.115.38 కోట్ల షేర్ వసూళ్లను సొంతం చేసుకుంది. చిరు కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 మూవీ తొలివారం రూ.111.5 కోట్ల గ్రాస్ వసూళ్లు, రూ.77.32 కోట్ల షేర్ వసూళ్లను అందుకుని రెండో స్థానంలో నిలిచింది. ఈ మూవీని వివి వినాయక్ తెరకెక్కించాడు. కత్తి సినిమాకు రీమేక్‌గా ఈ మూవీని ప్రేక్షకులకు అందించాడు. అటు మూడో స్థానంలో తాజా మూవీ వాల్తేరు వీరయ్య మూవీ నిలిచింది. ఈ సినిమా తొలి వారం రోజుల్లో రూ.165.45 కోట్ల గ్రాస్, రూ.96.46 కోట్ల షేర్ వసూళ్లను సాధించింది. నాలుగో స్థానంలో గాడ్ ఫాదర్ మూవీ రూ.96.35 కోట్ల గ్రాస్ వసూళ్లు, రూ.53.10 కోట్ల షేర్‌ను వసూలు చేసింది. ఐదో స్థానంలో డిజాస్టర్‌గా నిలిచిన ఆచార్య ఉంది. ఈ మూవీ తొలివారం రూ.75 కోట్ల గ్రాస్, రూ.47.87 కోట్ల షేర్ మాత్రమే సాధించింది.