Home Entertainment ‘ధమాకా’ మొదటి రోజు వసూళ్లు..రవితేజ మాస్ విశ్వరూపం చూపించాడు

‘ధమాకా’ మొదటి రోజు వసూళ్లు..రవితేజ మాస్ విశ్వరూపం చూపించాడు

0 second read
0
0
183

మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన ‘ధమాకా’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది..విడుదలకి ముందే భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రానికి విడుదల మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ వచ్చింది..కథ రొటీన్ అయ్యినప్పటికీ కూడా వింటేజ్ రవితేజ మాస్ మరియు కామెడీ టైమింగ్ తో మూవీ ని ఎంటర్టైన్మెంట్ తో ఫుల్లుగా నింపేసాడు.. అందువల్ల సినిమా టైం పాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా నిలిచింది..అందుకే ఓపెనింగ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో దద్ధరిల్లాయి..మొదటి ఆట నుండే హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రవితేజ కి క్రాక్ సినిమా తర్వాత అంతటి ఓపెనింగ్స్ ఈ సినిమాకే దక్కాయని చెప్పొచ్చు..ముఖ్యంగా నైజాం ప్రాంతం లో అయితే మాస్ విద్వంసం జరిగింది అనే చెప్పాలి..నేటి తరం స్టార్ హీరోలకు ఏ మాత్రం కూడా తీసిపోని వసూళ్లు అవి..ఒకపక్క అవతార్ 2 మూవీ మంచి కలెక్షన్స్ తో ముందుకు దూసుకుపోతుండగా మరోపక్క ధమాకా మూవీ అవతార్ 2 మేనియా ని కూడా దాటుకొని ఇంత గ్రాండ్ ఓపెనింగ్ ని రాబట్టడం అంటే మామూలు విషయం కాదు.

ఇక మొదటి రోజు వసూళ్ల విషయానికి వస్తే నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి మొదటి రోజు రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది..క్రాక్ తర్వాత రవితేజ కి ఇది బెస్ట్ ఓపెనింగ్ అని చెప్పొచ్చు..క్రాక్ సినిమాకి కూడా మొదటి రోజు ఈ ప్రాంతం లో ఇదే రేంజ్ వసూళ్లు వచ్చాయి..ఇక గుంటూరు జిల్లాలో ఈ చిత్రానికి మొదటి రోజు 33 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..రవితేజ గత చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాకి క్లోసింగ్ కలెక్షన్స్ కూడా అంత రాలేదు..దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు..ధమాకా ఓపెనింగ్స్ ఎలాంటివో..అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతం లో ఈ చిత్రానికి మొదటి రోజు 60 లక్షల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి..ఈ ప్రాంతం లో ఈ రేంజ్ వసూళ్లు అంటే బంపర్ ఓపెనింగ్ అనే చెప్పొచ్చు..కేవలం ఈ మూడు ప్రాంతాల నుండే ఈ చిత్రానికి మొదటి రోజు 3 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ఇక కృష్ణ జిల్లాలో కూడా ఈ సినిమాకి అదిరిపొయ్యే ఓపెనింగ్ దక్కింది..అక్కడ ఈ చిత్రానికి మొదటి రోజు 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..ఇక సీడెడ్ లో నిన్న ఈ చిత్రం చిన్న చిన్న సి సెంటర్స్ నుండి టౌన్స్ వరుకు హౌస్ ఫుల్ కలెక్షన్స్ ని రిజిస్టర్ చేసిన ఈ సినిమాకి మొదటి రోజు కోటి రూపాయిల వరకు షేర్ వసూళ్లు వచ్చాయని అంచనా వేస్తున్నారు..అలా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమాకి 6 కోట్ల రూపాయిల షేర్ మార్క్ కి దగ్గరగా వసూళ్లను రాబట్టాయి అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి..తెలుగు స్టేట్స్ లో ఈ రేంజ్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రానికి అమెరికా లో మాత్రం చాలా తక్కువ వసూళ్లు వచ్చాయి..మొదటి రోజు మరియు ప్రీమియర్స్ కలిపి ఈ చిత్రానికి కనీసం లక్ష డాలర్స్ కూడా రాలేదు..ఒకవేళ ఓవర్సీస్ కూడా ఈ సినిమాకి కలిసి వచ్చి ఉంటే కలెక్షన్స్ వేరే లెవెల్ లో ఉండేవని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

రామ్ చరణ్ కోసం చేసిన అప్పులను పూడ్చేసిన ‘వారసుడు’ సినిమా

‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్‌లో చిరంజీవి ఓ మాట చెబుతూనే ఉన్నారు. ‘సరిగ్గ…