
మాస్ మహారాజ రవితేజ కి పాపం ప్రస్తుతం కష్టకాలం నడుస్తుంది..వరుస ఫ్లాప్స్ తో సతమతవుతున్న ఆయనకీ ‘క్రాక్’ ద్వారా భారీ హిట్ లభించింది..ఇండస్ట్రీ మొత్తం రీసౌండ్ వచ్చేలాగా తన రేంజ్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు..కానీ క్రాక్ తర్వాత వచ్చిన రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొట్టాయి..ఖిలాడీ సినిమాకి ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి కానీ రామారావు ఆన్ డ్యూటీ కి మాత్రం కనీసం ఓపెనింగ్స్ కూడా దక్కలేదు..అయితే ఆ తర్వాత ఆయన నటించిన ‘ధమాకా’ సినిమా మీద మాత్రం అంచనాలు భారీ రేంజ్ లో ఏర్పడ్డాయి..ఈ సినిమాలోని ప్రతీ పాట బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం , టీజర్ మరియు ట్రైలర్ కూడా ప్రేక్షకులను అభిమానులను బాగా ఆకట్టుకోవడం తో బిజినెస్ కూడా బాగా జరిగింది..ఈరోజు ఘనంగా విడుదలైన ఈ చిత్రం అభిమానుల అంచనాలను అందుకుందా లేదా అనేది ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.
ముందుగా ఈ చిత్రం కథ దగ్గరకి వద్దాం..ధమాకా స్వామి ( రవితేజ ) మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి..పనిపాట లేకుండా గాలి తిరుగుడు తిరుగుతూ ఉంటాడు..అలాంటి ఆవారా కి ఒక అమ్మాయితో (శ్రీ లీల ) లవ్ ట్రాక్ కూడా ఉంటుంది..అయితే ఒక ప్రముఖ వ్యాపారవేత్త, వేలకోట్ల రూపాయలకు అధిపతి అయినా ఒక వ్యక్తి అచ్చు గుద్దినట్టు రవితేజ పోలికలతో ఉంటాడు..ఒక కంపెనీ కి ఆయన CEO కూడా..కొన్ని సంఘటనలు చోటు చేసుకున్న తర్వాత వీళ్లిద్దరు కలుసుకుంటారు..ఒకరి జీవితం ని ఒకరు మార్చుకుంటారు..ఆ తర్వాత వీళ్ళ జీవితాల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి..ఎదురుకున్న సమస్యలు ఏమిటి అనేదే మిగతా స్టోరీ..ఈ కథ గోపీచంద్ హీరో గా నటించిన ‘గౌతమ్ నంద’ అనే చిత్రానికి దగ్గరగా ఉంటుంది, కానీ సినిమా మొత్తం రవితేజ మార్క్ తో అన్ లిమిటెడ్ ఎనర్జీ తో దూసుకెళ్తుంది..రవితేజ ఫ్యాన్స్ కి మాత్రం ఈ సినిమా ఒక పండగే.
కథ రొటీన్ అయ్యినప్పటికీ కూడా రవితేజ ఎనర్జీ వల్ల మంచి ఎంటర్టైన్మెంట్ తో సాగిపోతుంది ఈ చిత్రం..ముఖ్యంగా కామెడీ సీన్స్ కొన్ని బాగా పేలాయి..వింటేజ్ రవితేజ మార్క్ కామెడీ టైమింగ్ ని ఈ సినిమాలో మనం చూడవచ్చు..హైపర్ ఆది కామెడీ మరియు ఆయన వేసిన పంచులు బాగా పేలాయి..ఆయన కెరీర్ కి ఈ సినిమా బాగా ప్లస్ అవుతుంది అని చెప్పొచ్చు..ఇక శ్రీ లీల గురించి ఇప్పుడు మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి..తొలిసినిమా ‘పెళ్ళిసందడి’ తోనే తన అద్భుతమైన నటన మరియు గ్రేస్ తో కూడా డ్యాన్స్ తో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ, ఈ సినిమాలో కూడా డాన్స్ విషయం లో తన విశ్వరూపం చూపించేసింది..ఆమె వేసిన స్టెప్పులకు థియేటర్ పై కప్పులు ఎగిరిపోతుందేమో అనే రేంజ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వచ్చింది..భీమ్స్ సిసిరోలియో అందించిన పాటలన్ని సూపర్ హిట్..ఆన్ స్క్రీన్ మీద ఇంకా అదిరిపోయాయి..అలా ఆద్యంతం వినోదభరితంగా సాగిపోయిన ఈ సినిమాని వీకెండ్ లో బాగా ఎంజాయ్ చెయ్యొచ్చు.