Home Entertainment ‘ధమాకా’ మూవీ క్లోసింగ్ కలెక్షన్స్..చరిత్ర సృష్టించిన రవితేజ

‘ధమాకా’ మూవీ క్లోసింగ్ కలెక్షన్స్..చరిత్ర సృష్టించిన రవితేజ

0 second read
0
0
1,793

మాస్ మహారాజా రవితేజ నటించిన ధమాకా మూవీ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. క్రాక్ మూవీ తర్వాత లాంగ్ గ్యాప్ ఇచ్చిన రవితేజ ఎట్టకేలకు మరో హిట్ కొట్టాడు. ధమాకా సినిమాతో దుమ్ముదులిపాడు. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన ధమాకా సినిమా ఇటీవల వంద కోట్ల రూపాయల క్లబ్ లోకి కూడా చేరింది. రవితేజ కెరీర్‌లో మొదటి వంద కోట్ల సినిమా ఇదే. తాజాగా సంక్రాంతి సినిమాలు విడుదలకు సిద్ధం కావడంతో ధమాకా రన్ ముగిసింది. మూడు వారాలకు ఈ మూవీ రూ.43 కోట్ల షేర్ రాబట్టింది. విడుదలైన 5 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బయ్యర్లందరికీ లాభాలు అందించింది. నైజాంలో రూ.17 కోట్లు, సీడెడ్‌లో రూ.7 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.5 కోట్లు, తూర్పుగోదావరిలో రూ.2 కోట్లు, పశ్చిమగోదావరిలో రూ.1.5 కోట్లు, గుంటూరులో రూ.2 కోట్లు, కృష్ణాలో రూ.1.9 కోట్లు, నెల్లూరులో రూ.కోటి షేర్ వసూలు చేసింది.

మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోనే కాకుండా కర్ణాటక, రెస్టాఫ్ ఇండియాలలో రూ.3.6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.3 కోట్ల వసూళ్లను ధమాకా సొంతం చేసుకుంది. ఈ సినిమాకు మొత్తం రూ.18.3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా రూ.43 కోట్ల షేర్ రాబట్టడంతో డబుల్ ప్రాఫిట్ మూవీగా మిగిలింది. ఈ వసూళ్లకు శాటిలైట్, డిజిటల్ రైట్స్ ద్వారా వచ్చే ఆదాయం ప్లస్ కానుంది. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ వంటి డిజాస్టర్ల తర్వాత పూర్తిగా తన మార్కెట్ పడిపోయిన పరిస్థితుల్లో ధమాకా సినిమా అద్భుతం చేసిందనే చెప్పాలి. అది కూడా నెగిటివ్ టాక్ వచ్చిన మూవీకి ఈ స్థాయిలో వసూళ్లు రావడం అంటే ఆశ్చర్యకరమే అని సినీ పండితులు అంటున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ జోనర్‌లో నిర్మితమైన ధమాకా సినిమాలో కథ పెద్దగా లేనప్పటికీ హీరో రవితేజ నుంచి అభిమానులు కోరుకుంటున్న అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల ఈ సినిమా ఒక రేంజ్‌లో వారికి కనెక్ట్ అయింది.

ధమాకా మూవీలో రవితేజ సరసన శ్రీలీలా హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో సచిన్ ఖేడ్కర్, తులసి, తనికెళ్ళ భరణి, హైపర్ ఆది, ప్రవీణ్, జయరాం, అలీ కీలక పాత్రల్లో నటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ధమాకా మూవీని నిర్మించారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చాడు. అతడు స్వరపరిచిన అన్ని పాటలు మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. రెగ్యులర్ మాస్ తరహా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా బీ,సీ సెంటర్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. రవితేజ ఫ్యాన్స్ అతడి నుంచి ఏం కోరుకుంటారో అవే అంశాలను దర్శకుడు త్రినాధరావు నక్కిన జోడించాడు. దీంతో ధమాకా బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపింది. భారీ అంచనాలతో విడుదలైన ధమాకా మూవీ మొదటి రోజే రవితేజ కెరీర్ మరో సాలిడ్ ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా నిలిచింది. ఈ చిత్రానికి ప్రసన్నకుమార్ బెజవాడ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించాడు. కాగా ధమాకా చిత్రానికి నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు రూ. 30 కోట్ల వరకు జరిగినట్టు సమాచారం. ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ రూ. 10 కోట్లు పలికాయట. మరోవైపు శాటిలైట్, డిజిటల్ హక్కులు రూ. 20 కోట్లు పలికినట్లు తెలుస్తోంది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…