
తమిళ స్టార్ హీరో ధనుష్ తెలుగు లో చేసిన మొట్టమొదటి చిత్రం ‘సార్’ ఇటీవలే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే.విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ పెద్దగా స్క్రీన్ ప్రెజెన్స్ లేకపోయినా కూడా తన అద్భుతమైన టాలెంట్ తో నేషనల్ అవార్డు ని కూడా గెల్చుకున్న ధనుష్ అంటే టాలీవుడ్ ఆడియన్స్ కి కూడా ఎంతో ఇష్టం.ఇక్కడ ఆయన డైరెక్టుగా సినిమా చెయ్యాలని వాళ్ళు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న నేపథ్యం లో ‘సార్’ మూవీ విడుదలయ్యేసరికి బంపర్ ఓపెనింగ్స్ తో పాటుగా బ్లాక్ బస్టర్ రన్ ని కూడా ఇస్తున్నారు.ఇప్పటి వరకు విడుదలై మూడు రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమాకి ఇప్పటి వరకు ఎంత వసూళ్లు వచ్చాయో ఇప్పుడు మనం చూడబోతున్నాము.
విడుదలకి ముందు ఈ సినిమాకి సుమారుగా 6 కోట్ల రూపాయిల వరకు తెలుగు స్టేట్స్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.అలా ఆరు కోట్ల రూపాయిల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో దిగిన ఈ సినిమా మొదటి రోజే రెండు కోట్ల 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.ఇది ధనుష్ కెరీర్ లోనే తెలుగు లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా చెప్పుకోవచ్చు.ఇక రెండవ రోజైతే మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టింది.ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ సినిమా రెండవ రోజు సుమారుగా మూడు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది.అలా అద్భుతమైన ట్రెండ్ తో ముందుకు దూసుకుపోతున్న ఈ సినిమా మూడవ రోజు కూడా అదే స్థాయి వసూళ్లను రాబట్టి కేవలం మూడు రోజుల్లోనే 9 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించిన చిత్రం గా నిలిచింది.
నాల్గవ రోజు వర్కింగ్ డే అయ్యినప్పటికీ కూడా డీసెంట్ స్థాయి వసూళ్లను నమోదు చేసుకుంటుంది ఈ సినిమా.ట్రెండ్ చూస్తూ ఉంటే ఈ సినిమా ఫుల్ రన్ లో 20 కోట్ల రూపాయిల షేర్ మార్కుని అవలీల గా అందుకుంటుందని, ధనుష్ టాలీవుడ్ లో ఇక స్టార్ అయ్యిపోయినట్టే,ఆయన ఇక్కడి డైరెక్టర్స్ తో మరికొన్ని సినిమాలు చెయ్యాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు.ఈ సినిమా తర్వాత ధనుష్ తెలుగు లో చెయ్యబోతున్న మరో సినిమా శేఖర్ కమ్ముల తో ఉండబోతుంది.ఈ సినిమా తర్వాత ధనుష్ మార్కెట్ టాలీవుడ్ లో ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.