
దొరికితే దొంగ లేకపోతే దొర అనే సామెత మీకు గుర్తుండే ఉంటుంది. చిన్నతనంలో అందరూ ఏదో ఒక సందర్భంలో దొంగతనం చేస్తారు. అయితే కాస్త పెద్దయ్యాక ఆ అలవాటు మానుకుంటారు.ఇది అందరి ఇళ్లల్లో సహజంగా జరిగే ప్రక్రియ. ఒక స్టార్ హీరోయిన్‌గా హోదా అనుభవిస్తున్న ఓ నటి దొంగతనం చేస్తే ఎలా ఉంటుంది. అలాంటి ఒక సంఘటన టాలీవుడ్ హీరోయిన్‌కు ఎదురైంది. ఆమె ఎవరో కాదు సీనియర్ హీరోయిన్ సరోజినీ దేవి. మహానటి సావిత్రితో పాటు సమానంగా రెమ్యునరేషన్ అందుకున్న నటీమణుల్లో సరోజినీ దేవి కూడా ఉంటారు. అయితే సినిమాల్లో నటించే సమయంలోనే సరోజినీ దేవి తన చేతివాటం చూపించేది. ఎందుకంటే ఆమెకు దొంగతనం చేయడం ఒక అలవాటు. దీంతో సినిమా షూటింగ్ లోకేషన్‌లో ఏది కనిపిస్తే అది నొక్కేసేది.కెమెరా లెన్సుల నుంచి పక్క నటుల హెయిర్ పిన్స్ వరకు ఆమె దొంగిలించి తన బ్యాగ్‌లో వేసుకునేది.
అయితే అప్పట్లో సరోజినీ దేవి స్టార్ హీరోయిన్ కావడంతో ఆమె దొంగతనం చేసిందనే భావన ఎవరికీ వచ్చేది కాదు. ఆమెను ఎవరూ అనుమానించే వాళ్లు కాదు. అయితే సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఓసారి తమిళ హీరో ఎంజీఆర్‌తో కలిసి ఆమె ఊటీలో షూటింగ్ చేయాల్సి వచ్చింది. అక్కడ ఆమె ఎప్పుడూ తీసుకునే ఫైవ్ స్టార్ హోటల్ లోనే రూమ్ కావాలని డిమాండ్ చేయడంతో యూనిట్ కూడా కాదనలేక అదే హోటల్లో రూమ్ బుక్ చేసింది.కానీ సరోజినీ దేవి హోటల్‌కు వస్తుందంటే సదరు హోటల్ ఆర్గనైజర్లకు అనుమానం ఉండేది. ఎందుకంటే ఫైవ్ స్టార్ హోటళ్లలో అక్కడ ఉన్న సామాను అంతా కూడా ఆమె ఖాళీ చేసేది. సబ్బులు, టవల్స్, దుప్పట్ల నుంచి ప్రతి వస్తువును తన బ్యాగ్‌లో సర్దుకునేది. అయితే ఓసారి మాత్రం సరోజినీ దేవిని ఊరికే ఎందుకు వదిలేయాలని హోటల్ మేనేజ్‌మెంట్ స్కెచ్ వేసి ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని ప్లాన్ వేసింది.
అలా ఓ రోజు షూటింగ్ అయిపోయి తిరిగి వెళుతున్న సరోజినీ దేవి బ్యాగ్‌ను చెక్ చేయాలని హోటల్ సిబ్బంది పట్టు పట్టారు. ఈ సందర్భంగా ఆమె బ్యాగ్ చెక్ చేయడంతో అందులో ఉన్న సామాను అంతా కూడా బయటపడి ఆమె పరువు పోయింది.పక్కనే ఉన్న ఎంజీఆర్ ఏదోలా విషయాన్ని సర్దుబాటు చేసి సైడ్ ఇచ్చేశారు. దీంతో సరోజినీ దేవి బండారం బయటపడటంతో యూనిట్‌లో తన ముఖం చూపించలేక ఎంతో ఇబ్బంది పడేది. క్రమంగా ఈ విషయం అందరికీ తెలియడంతో సరోజినీ దేవికి సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. అంతేకాదు ఓసారి హీరోయిన్ సావిత్రితో కలిసి మందు తాగుతూ ఆమె మెడలోని నెక్లెస్ కూడా సరోజినీ దేవి కొట్టేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే సావిత్రికి ఈ విషయం తెలిసినా అడగలేదట. కానీ కష్టకాలంలో సావిత్రి సదరు నెక్లెస్ గురించి అడగ్గా నువ్వు అసలు నాకు ఆ నెక్లెస్ ఇవ్వలేదని సరోజినీదేవి అబద్ధం చెప్పి బుకాయించిందట. అప్పటి నుంచి ఆమెను ఎవరూ దగ్గరకు రానిచ్చేవారు కాదని.. అలా ఆమె స్థాయి పడిపోయిందని ఆనాటి నటుల్లో పలువురు చెప్తున్నారు.