
విక్టరీ వెంకటేష్ నటించిన దేవీపుత్రుడు సినిమాను టీవీలలో ప్రసారం చేస్తే ఇప్పటికీ చాలా మంది చూస్తుంటారు. 2001లో విడుదలైన ఈ మూవీ భారీ అంచనాలతో విడుదలైంది. అయితే అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. కానీ ఈ సినిమాలో గ్రాఫిక్స్ ప్రేక్షకులను అలరించాయి. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కుమార్తెగా నటించిన చిన్నారిని అంత త్వరగా ఎవరూ మరిచిపోలేరు. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో పాటు డైలాగులు, కృష్ణుడు గురించి చెప్పే విధానానికి అందరూ ఫిదా అయిపోయారు. వెంకటేష్‌ను నేస్తం అంటూ ముద్దుగా పిలుస్తుంది. ఆ చిన్నారి అసలు పేరు వేగా తమోతియా. ఈ విషయం చాలా మందికి తెలియదు. కానీ ఆమె ఫోటో చూస్తే మాత్రం దేవీపుత్రుడు సినిమాలో నటించిన పాప కదా అని చాలా మంది గుర్తుపడతారు. అయితే ఇప్పుడు ఈ చిన్నారి పెద్దమ్మాయి అయిపోయింది. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో వేగా ఎంతో అందంగా కనిపిస్తోందని నెటిజన్‌లు కామెంట్ చేస్తున్నారు. అంతే కాదు టాప్ లెవెల్ ట్రెండ్ ని సృష్టించింది అంతే కాదు ఆమె పిక్స్ కి మతి పోయే రెస్పాన్స్ రావటం చుస్తే మాత్రం నిజంగా పెద్ద హైలెక్టు అని చెప్పాలి వేగా ఎప్పుడు కూడా సినిమాల్లోకి రావాలని అనుకోలేదని కానీ ఇప్పుడు వస్తున్నా వరుస ఆఫర్లను చుస్తే మాత్రం కళ్ళు తిరుగుతున్నాయని చెప్తున్నది.
దేవీపుత్రుడు సినిమా తర్వాత సినిమాల వైపు కాకుండా వేగా తమోతియా చదువు వైపు దృష్టి సారించింది. దీంతో ఆమె విదేశాల్లో చదువుకుంది. పెద్దయ్యాక మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. వరుణ్ సందేశ్ సరసన హీరోయిన్‌గానూ నటించింది. హ్యాపీడేస్, కొత్తబంగారులోకం సినిమాల తర్వాత వరుణ్ సందేశ్ నటించిన హ్యాపీహ్యాపీగా సినిమాలో వేగా నటించింది. అయితే ఈ మూవీ హిట్ అవ్వలేదు. దీంతో వేగాకు అవకాశాలు కరువయ్యాయి. ఆమె సౌత్ సినిమాలలో కనిపించకపోయినా పలు బాలీవుడ్ సినిమాలలో నటించింది. చిన్నప్పుడు వేగా తమోతియా ఎంత ముద్దుగా క్యూ్‌ట్‌గా ఉందో..ఇప్పుడు అంతే అందంగా తయారైంది. వేగా తమోటియా 1985లో ఛత్తీస్‌గఢ్‌లో జన్మించింది. కానీ పెరిగింది మాత్రం ఆస్ట్రేలియాలోని సిడ్నీలో. న్యూసౌత్‌వేల్స్ యూనివర్సిటీలో ఎకానమిక్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది. అనంతరం సినిమాలపై మోజుతో ఇండియాకు వచ్చి బెంగళూరులోని ఓ ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకుని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె తన యాక్టింగ్ శైలిలో చాల మార్పులు చేసుకోవడమే కాకుండా ఆమె నటించే ప్రతి సినిమా చాల సరికొత్తగా ఉండాలని కోరుకుంటుంది.
కాగా వేగా తమోటియా బాల్యంలో నటించిన దేవీపుత్రుడు సినిమా ద్వాపర యుగంలో మునిగిపోయిన ద్వారక ఆధారంగా తెరకెక్కింది. ఓ బాక్స్ సముద్రం లోపల ఉండిపోయిందని.. ప్రతి అమావాస్య రోజు ఈ బాక్స్ తెరుచుకుంటుందని.. అప్పుడు దేవుడి శక్తి బయటకు వస్తుందని సినిమాలో చూపించారు. దేవీపుత్రుడు సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో వెంకటేష్ హీరోగా నటించగా సౌందర్య, అంజనా జువేరి హీరోయిన్‌లుగా నటించారు. మణిశర్మ సంగీతం సమకూర్చిన బాణీలకు మంచి స్పందన లభించింది. ఫాంటసీ డ్రామాగా వచ్చిన ఈ సినిమాను తెలుగు సినీ పరిశ్రమలో భారీ వ్యయంతో నిర్మించారు. ఈ సినిమా వల్ల దాదాపు సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత ఎంఎస్ రాజు రూ. 14 కోట్లు నష్టపోయాడని ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. అంతకుముందు కోడిరామకృష్ణతో దేవి అనే సినిమాను కూడా ఎంఎస్ రాజు నిర్మించారు. ఈ మూవీ అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.