
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహా మీడియా ఛానల్ లో నిర్వహించిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే..బాలయ్య బాబు లో ఈ యాంగిల్ కూడా ఉందా అని తెలుగు ప్రేక్షకులు ఆశ్చర్యపొయ్యేలా చేసిన షో ఇది..బాలయ్య బాబు పెద్ద కోపిష్టి, అభిమానుల మీద చెయ్యి చేసుకుంటాడు..అతనితో డైరెక్టర్స్ సినిమాలు ఎలా చేస్తున్నారో అని చాలా మందికి ఈ షో కి ముందు అనుమానం ఉండేది..కానీ బాలయ్య బాబు చిన్న పిల్లాడి మనస్తత్వం అని,ఆయన నిజ జీవితం లో ఎంతో సరదా మనిషి అని అందరికి అర్థం అయ్యింది..యూత్ కి బాగా దగ్గరయ్యాడు..ఆయనకి మహర్దశ పట్టుకుంది..సీజన్ 1 గ్రాండ్ హిట్ అవ్వడం తో సీజన్ 2 పై అంచనాలు భారీ రేంజ్ లో ఉండేవి..ఆ అంచనాలకు తగ్గట్టుగానే సీజన్ 2 మొదటి ఎపిసోడ్ నుండే రికార్డ్ స్థాయి వ్యూస్ ని సొంతం చేసుకొని ముందుకి దూసుకుపోతుంది.
ఇప్పటి వరుకు అయిదు ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకున్న ఈ సీజన్ కి మొదటి ఎపిసోడ్ లో నారా చంద్రబాబు నాయుడు హాజరు కాగా..రెండవ ఎపిసోడ్ లో విశ్వక్ సేన్ మరియు సిద్దు ,మూడవ ఎపిసోడ్ కి శర్వానంద్ మరియు అడవి శేష్, నాల్గవ ఎపిసోడ్ కి కిరణ్ కుమార్ రెడ్డి , ఐదవ ఎపిసోడ్ కి అల్లు అరవింద్ , సురేష్ బాబు మరియు రాఘవేంద్ర రావు హాజరయ్యారు..ఈ ఎపిసోడ్ కి ఈ సీజన్ లో హైయెస్ట్ వ్యూస్ వచ్చాయి..ఇక తదుపరి ఎపిసోడ్ లో పాన్ ఇండియన్ సూపర్ స్టార్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హాజరు కాబోతున్నాడు..ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ ని నిన్ననే పూర్తి చేశారు..ప్రభాస్ ఇంటర్వూస్ వంటివి గతం లో చాలానే ఇచ్చాడు కానీ..ఎప్పుడూ కూడా ఇలాంటి టాక్ షోస్ లో పాల్గొనలేదు..మొట్టమొదటిసారి ఆయన పాల్గొంటున్న టాక్ షో ఇదే..బాలయ్య బాబు తో ఆయన పంచుకునే ముచ్చట్లు ఎలా ఉండబోతున్నాయో చూడాలని అమితాసక్తి చూపిస్తున్నారు ఫ్యాన్స్ .
ఈ షో లో ప్రభాస్ తో పాటుగా మరో మాస్ హీరో గోపీచంద్ కూడా హాజరు కాబోతున్నాడు..గోపీచంద్ ప్రభాస్ కి బెస్ట్ ఫ్రెండ్ అనే విషయం అందరికీ తెలిసిందే..వీళ్లిద్దరు కలిసి ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటి ఫంక్షన్స్ లో కనపడడమే కానీ, ఎప్పుడూ కూడా ఇలాంటి చిట్ చాట్ సెషన్స్ లో పాల్గొనలేదు..అందుకే అందరూ ఈ ఎపిసోడ్ పై అమితాసక్తి ని చూపిస్తున్నారు..ఇక అన్ స్టాపబుల్ చివరి ఎపిసోడ్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధి గా హాజరు కాబోతున్నాడు..ఇది దాదాపుగా ఖరారు అయిపోయినట్టు తెలుస్తుంది..పవన్ కళ్యాణ్ లాంటి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్న హీరో ఇలాంటి షోస్ లో పాల్గొంటే సరికొత్త యూజర్లు కూడా ఆహా మీడియా కి కుప్పలు తెప్పలు గా వచ్చి పడుతారు..ఆ ఎపిసోడ్ కి వచ్చే వ్యూస్ ని భవిష్యత్తులో ఎవ్వరూ కూడా బ్రేక్ చెయ్యలేరు..ఈ క్రేజీ ఎపిసోడ్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అతి త్వరలోనే తెలియనున్నాయి .