Home Entertainment దుమ్ములేపేస్తున్న సమంత ‘యశోద’ కలెక్షన్స్..అక్కినేని ఫ్యామిలీ క్లోసింగ్ కలెక్షన్స్ ని రెండు రోజుల్లోనే మటాష్ చేసేసింది

దుమ్ములేపేస్తున్న సమంత ‘యశోద’ కలెక్షన్స్..అక్కినేని ఫ్యామిలీ క్లోసింగ్ కలెక్షన్స్ ని రెండు రోజుల్లోనే మటాష్ చేసేసింది

0 second read
0
0
406

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్స్ అని పిలవబడే వారిలో సమంత కూడా ఒకరు..ఈమె సినిమాలకు ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజి ఉంది..సినిమా లో హీరో తో సంబంధం లేకుండా కేవలం సమంత కోసం థియేటర్స్ కి వచ్చే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువే..అందం తో పాటు అద్భుతమైన అభినయం సమంత సొంతం..అందుకే ఆమెకి కోట్లలో ఫాన్స్ ఉంటారు..కేవలం హీరో పక్కన డాన్స్ కి మాత్రమే పరిమితం అయ్యే టైపు హీరోయిన్ కాదు సమంత..నటనకి ప్రాధాన్యత ఉంటేనే ఏ సినిమా అయినా ఒప్పుకుంటుంది..కథలో దమ్ముంటే విలన్ రోల్స్ చెయ్యడానికి కూడా ఆమె వెనుకాడడు..ఫామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో ఆమె పోషించిన విలన్ పాత్ర కి నేషనల్ లెవెల్ లో ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో మన అందరికి తెలిసిందే..అలా విలక్షణమైన పాత్రలు చేసుకుంటూ ముందుకెళ్తున్న సమంత లేటెస్ట్ గా యశోద అనే సినిమాతో మన ముందుకి వచ్చింది..లేడీ ఓరియెంటెడ్ సినిమాగా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన ఈ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ బాషలలో ఘనంగా విడుదలైంది.

ఈ సినిమాకి మొదటి రోజు మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ వచ్చింది..రెండు తెలుగు రాష్ట్రాల దగ్గర నుండి ఓవర్సీస్ వరుకు ఈ సినిమాకి కలెక్షన్స్ అదిరిపోయాయి..ముఖ్యంగా సమంతని అందరూ ఓవర్సీస్ క్వీన్ అని అంటూ ఉంటారు..యశోద సినిమా మరోసారి సమంత బ్రాండ్ ఓవర్సీస్ మార్కెట్ లో చాలా పెద్దది అని నిరూపించింది..ఈ సినిమా కి కేవలం ప్రీమియర్స్ నుండి లక్ష డాలర్లు వచ్చాయి..ఇక ప్రీమియర్స్ + మొదటి రోజు వసూళ్లను కలుపుకుంటే ఈ సినిమాకి దాదాపుగా రెండు లక్షల 50 వేల డాలర్లు వచ్చాయి..ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ కి ఇలాంటి వసూళ్లు రావడం అంటే మాములు విషయం కాదు..మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి ఈ సినిమాకి మొదటి రోజు 3 కోట్ల రూపాయిల వరుకు షేర్ వసూళ్లు వచ్చాయి..ఇక రెండవ రోజు కూడా అదే స్థాయి వసూళ్ళు..మొత్తం మీద రెండు రోజులకు కలిపి ఈ సినిమా సుమారుగా 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే సమంత తన మాజీ భర్త నాగ చైతన్య , మరియు మాజీ మావయ్య నాగార్జున లేటెస్ట్ మూవీస్ కలెక్షన్స్ ని అతి తేలికగా దాటేసింది..నాగ చైతన్య హీరో గా నటించిన లేటెస్ట్ మూవీ థాంక్యూ కి ఫుల్ రన్ లో కేవలం 3 కోట్ల రూపాయిలు మాత్రమే వచ్చింది..కానీ సమంత నటించిన యశోద చిత్రం ఆ వసూళ్లను కేవలం మొదటి రోజే దాటేసింది..ఇక అక్కినేని నాగార్జున లేటెస్ట్ మూవీ ఘోస్ట్ పరిస్థితి కూడా ఇంతే..ఫుల్ రన్ లో ఈ చిత్రం కేవలం ఆరు కోట్ల రూపాయిల షేర్ ని మాత్రమే వసూలు చేసింది..సమంత యశోద చిత్రం కేవలం రెండు రోజుల్లోనే 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది..అంటే అక్కినేని ఫామిలీ మొత్తం ప్రస్తుతం సమంత బాక్స్ మార్కెట్ ముందు సరితూగరు అన్నమాట..దశాబ్దాలుగా ఇండస్ట్రీ లో కొసంగుతున్న కుటుంబానికి ఇలాంటి అవమానకరమైన సందర్భం రావడం నిజంగా చింతించాల్సన విషయం.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…