Home Entertainment దీపావళి పండగ రోజు కృష్ణంరాజు గారి సతీమణి వింత ప్రవర్తన..వైరల్ అవుతున్న వీడియో

దీపావళి పండగ రోజు కృష్ణంరాజు గారి సతీమణి వింత ప్రవర్తన..వైరల్ అవుతున్న వీడియో

0 second read
0
0
1,512

ప్రభాస్ కుటుంబంలో కొన్ని రోజులుగా విషాద ఛాయలు నెలకొన్నాయి. ప్రభాస్ పెద్దనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కృష్ణంరాజు మృతిచెందడంతో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. రెబల్‌స్టార్ మరణించి రోజులు గడుస్తున్నా ఆ షాక్ నుంచి ఆయన కుటుంబం బయటకు రాలేకపోతోంది. ఇటీవల జరిగిన దీపావళి పండగను కూడా కృష్ణంరాజు కుటుంబం సెలబ్రేట్ చేసుకోలేదు. ప్రతి ఏడాది ఎంతో సంబరంగా దీపావళిని జరుపుకునే రెబల్ స్టార్ ఫ్యామిలీ ఈ ఏడాది ఇలా సెలబ్రేట్ చేసుకోకపోవడం అభిమానులను కూడా కలిచివేసింది. అయితే ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి దీపావళి నాడు తన భర్త కృష్ణంరాజుకు ఇష్టమైన వంటకాలను చేసి ఆయన గది వద్ద పెట్టిందట. కృష్ణంరాజు ఇంకా ఆ గదిలోనే ఉన్నాడని.. కచ్చితంగా తన వంటకాలను రుచి చూస్తాడని చెప్పి ఆయన రూమ్‌లోకి వెళ్లి అన్నం వడ్డించి.. తన భర్త తింటున్నాడు అంటూ అందరికీ చెప్తూ సంబరపడిందట. కానీ ఈ పరిణామం పట్ల కృష్ణంరాజు కుమార్తెలు షాక్‌కు గురై కన్నీళ్ళు పెట్టుకున్నట్లు టాక్ నడుస్తోంది.

అటు హీరో ప్రభాస్‌కు తండ్రి లేకపోవడంతో కృష్ణంరాజు అన్నీ దగ్గరుండి పెంచారు. పేరుకు పెద్దనాన్న అయినా తండ్రి స్థానంలో అన్నీ తానై చూసుకున్నారు. ఇప్పుడు ఆయన లేకపోవడం ప్రభాస్‌కు పెద్దలోటుగా మారింది. కృష్ణంరాజుకు కూడా కుమారులు ఎవరూ లేకపోవడంతో ప్రభాస్ కూడా ఆయన్ను చాలా ప్రేమగా చూసుకునేవాడు. కృష్ణంరాజు భౌతిక కాయానికి కూడా ప్రభాస్ సోదరుడు ప్రభోద్ ఉప్పలపాటి దహన సంస్కారాలు నిర్వహించాడు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు 1940 జనవరి 20న జన్మించారు. ఆయన పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. వీరు విజయనగర సామ్రాజ్య రాజకుటుంబానికి చెందిన వంశస్తులు. కృష్ణంరాజు మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు శ్యామలా దేవి. 1996లో నవంబరు 21న వీరి వివాహం జరిగింది. ఆయనకు ప్రసీదీ, ప్రకీర్తి, ప్రదీప్తి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చదువు పూర్తి కాగానే కొన్నాళ్లు జర్నలిస్టుగా కూడా పని చేశారు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. 1966లో చిలకా గోరింక చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

మరోవైపు కృష్ణంరాజు సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ రాణించారు. తొలుత 1991లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే ఏడాదిలో నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపతిరాజు విజయకుమార్ రాజు చేతిలో ఓడిపోయాడు. ఆ తర్వాత కొద్దికాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మళ్లీ 1998లో 13వ లోక్ సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరి కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం నుండి విజయం సాధించారు. 1999 మధ్యంతర ఎన్నికలు రావడంతో అప్పుడు కూడా నర్సాపురం లోక్‌సభ నుండి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజుపై గెలుపొందారు. అలా కేంద్రంలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుతంలో కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. 2004 లోక్‌సభ ఎన్నికలలో మళ్ళీ అదే స్థానం నుండి బీజేపీ తరఫున పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి జోగయ్య చేతిలో ఓటమి చెందారు. మార్చి 2009లో బీజేపీని వీడి చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అనంతర పరిణామాలతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…