Home Entertainment దారుణంగా పడిపోయిన బిగ్ బాస్ 6 TRP రేటింగ్స్..కారణం అదేనా?

దారుణంగా పడిపోయిన బిగ్ బాస్ 6 TRP రేటింగ్స్..కారణం అదేనా?

6 second read
0
0
297

బుల్లితెర మీద అశేష ప్రజాదరణ పొందిన బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్..ఇప్పటికే 5 సీసన్స్ ని పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇటీవలే ఆరవ సీసన్ లోకి అడుగుపెట్టిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇంతకు ముందు సీసన్స్ లాగానే ఈ సీసన్ లో కూడా ఆసక్తికరమైన టాస్కులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు బిగ్ బాస్..షో బాగుంది కాబట్టి TRP రేటింగ్స్ అద్భుతంగా వస్తున్నాయి అని మనం అనుకుంటూ ఉన్నాం..కానీ ఆశించిన రేంజ్ లో TRP రేటింగ్స్ అయితే రావట్లేదట..టైమింగ్ లోపమో లేదా జనాల్లో బిగ్ బాస్ ని చూసే ఆసక్తి తగ్గడం వల్లో తెలీదు కానీ..TRP రేటింగ్స్ ప్రస్తుతానికి చాలా లౌ లో ఉన్నాయని చెప్తున్నారు విశ్లేషకులు..గత సీసన్స్ తో పోలిస్తే ఈ సీసన్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ పెద్దగా పాపులర్ సెలెబ్రిటీలు కాకపోవడం వల్లే జనాలు సరైన ఆసక్తి చూపించలేకపోతున్నారని టాక్..ఈ సీసన్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ లో ఒకరు ఇద్దరు మినహా మిగిలిన ఇంటి సభ్యుల పేర్లు కూడా సరిగా ఎవరికీ తెలియదు అనేది వాస్తవం.

ఇక బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ కి కూడా చాలా తక్కువ TRP రేటింగ్స్ వచ్చాయి..సెప్టెంబర్ నాల్గవ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారమైన బిగ్ బాస్ ప్రారంభోత్సవ ఎపిసోడ్ కి కేవలం 8.5 రేటింగ్స్ మాత్రమే వచ్చాయి..గడిచిన సీసన్స్ తో పోలిస్తే ఈ సీసన్ కి సగం TRP రేటింగ్స్ కూడా రాలేదు..గడిచిన సీసన్స్ అన్నిటికి ప్రారంభోత్సవ ఎపిసోడ్స్ కి 15 కి పైగానే TRP రేటింగ్స్ వచ్చాయి..వాటితో పోలిస్తే ఇప్పుడు వచ్చిన TRP రేటింగ్స్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఇక రోజు ప్రసారమయ్యే ఎపిసోడ్స్ కి కూడా అంతంత మాత్రమే TRP రేటింగ్స్ వస్తున్నాయి..ఇంతకు ముందు ప్రసారమయ్యే ఎపిసోడ్స్ కి కనీసం రోజుకి 6 TRP రేటింగ్స్ వచ్చేవి..కానీ ఈసారి రోజువారీ ఎపిసోడ్స్ కి సగటున 4 నుండి 5 లోపు రేటింగ్స్ వస్తున్నాయని విశ్లేషకులు చెప్తున్న మాట..వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఎవరైనా పేరున్నసెలబ్రిటీ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే కానీ జనాల్లో ఆసక్తి రాదేమో.

బిగ్ బాస్ ప్రారంభోత్సవ ఎపిసోడ్ కి రేటింగ్స్ తగ్గడానికి మరో కారణం కూడా లేకపోలేదు..ఈ ఎపిసోడ్ ప్రసారం అవుతున్న రోజు ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంది..ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో మన అందరికి తెలిసిందే..సెప్టెంబర్ 4 న జరిగిన క్రికెట్ మ్యాచ్ ని థియేటర్స్ లో కూడా ప్రదర్శించారు..అందరి ద్రుష్టి దాని మీదనే ఉండడం వల్ల ఈసరి దాని ప్రభావం బిగ్ బాస్ మీద పడిందని అంటున్నారు విశ్లేషకులు..ఇక బిగ్ బాస్ విజయవంతంగా మొదటి వారం పూర్తి చేసుకొని ఇప్పుడు రెండవ వారం ని కూడా పూర్తి చేసుకోబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..మొదటి వారం లో ఎలాంటి ఎలిమినేషన్స్ జరగలేదు..కానీ రెండవ వారం నుండి ఎలిమినేషన్స్ ఉంటుంది..ఈ వారం నామినెటే అయినా ఇంటి సభ్యులలో అతి తక్కువ ఓట్లతో అభినయశ్రీ ఎలిమినేట్ అవ్వబోతుంది అని తెలుస్తుంది..ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ తెలియాలంటే రేపటి వరుకు వేచి చూడాల్సిందే మరి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…